CM Chandrababu: తిరుమలకు చేరుకున్న చంద్రబాబు - ప్రోటోకాల్ పాటించని అధికారులు
Chandrababu Tirumala Tour: ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు స్వాగతం పలికేందుకు వాహనం వద్దకు టీటీడీ అధికారులు ఎవరూ రాలేదు.
Officers Not Followed Protocol During Chandrababu Tirumala Tour: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) బుధవారం రాత్రి తిరుమలకు (Tirumala) చేరుకున్నారు. సీఎం హోదాలో ఆయన తొలిసారిగా గురువారం ఉదయం శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు. బుధవారం ప్రమాణ స్వీకారం అనంతరం ప్రత్యేక విమానంలో తిరుపతికి విచ్చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం తిరుమల వెళ్తూ తిరుపతిలోని టీడీపీ కార్యాలయం వద్ద వాహనశ్రేణిని ఆపి కార్యకర్తలకు అభివాదం చేశారు. వర్షం కురుస్తున్నా వారిని ఆప్యాయంగా పలుకరించారు. అటు, మంత్రి నారా లోకేశ్ సైతం వారితో సరదాగా ముచ్చటించారు. అనంతరం తిరుమలలోనే బస చేశారు.
ప్రోటోకాల్ పాటించని అధికారులు
అటు, తిరుమల పర్యటన సందర్భంగా అధికారుల వ్యవహారశైలిపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఎవరూ ప్రోటోకాల్ పాటించలేదు. గాయత్రి నిలయం వద్దకు సీఎంకు స్వాగతం పలికేందుకు వాహనం వద్దకు టీటీడీ అధికారులు ఎవరూ రాలేదు. చంద్రబాబు వాహనం దిగి గాయత్రి నిలయం లోపలికి వెళ్లిన తర్వాత పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు టీటీడీ ఇంఛార్జీ ఈవో వీరబ్రహ్మం యత్నించగా.. సీఎం తిరస్కరించారు.
Also Read: Chandrababu: ఏపీ మంత్రుల సమర్థత మేరకు శాఖలు కేటాయింపు: చంద్రబాబు