News
News
X

Guntur Meat Shops: ఆ పనిచేసిన వాళ్లకు మాంసం దుకాణాల్లో డిస్కౌంట్.. మున్సిపల్ కమిషనర్ బంపర్ ఆఫర్

గుంటూరు మున్సిపల్ కమిషనర్ చల్లా అనురాధ ఓ ఆఫర్ ప్రకటించారు. అది కూడా మాంసం దుకాణాలకు వెళ్లే ముందు ఓ పని చేస్తే సరిపోతుంది.

FOLLOW US: 

గుంటూరు మున్సిపల్ కమిషనర్ చల్లా అనురాధ మాంసం దుకాణాలకు సంబంధించి ఓ ఆఫర్ ప్రకటించారు. మాంసం దుకాణాలకు వెళ్లే ముందు వినియోగదారులు.. సొంత జూట్ బ్యాగ్ లేదా క్లాత్ బ్యాగ్ తీసుకువెళ్తే.. మాంసం దుకాణంలో డిస్కౌంట్ ఉంటుందని ప్రకటించారు. ఈ రకంగానైనా.. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ఆమె చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె మాంసం దుకాణ యాజమానులతో మాట్లాడారు. 

Also Read: Vizag Steel Plant Protest: విశాఖ ఉక్కు పోరు @ 200వ రోజు... 10 కి.మీ మానవహారంతో నిరసన.. పట్టువదలని కార్మికులు

గుంటూరులో పర్యావరణాన్ని కాపాడేందుకు ఇప్పటికే కమిషనర్ చల్లా అనురాధ అనేక చర్యలు తీసుకున్నారు. గుంటూరు పరిసరాల పరిశుభ్రం, పర్యావరణ పరిరక్షణ అంశాలపై  పోటీలు కూడా నిర్వహించారు. నగరంలో ఇప్పటికే తడి పొడి చెత్త విభజన, హోం కంపోస్ట్ తయారీ కిచెన్, టెర్రస్ గార్డెన్స్ వంటి అంశాల్లో పలు చర్యలు తీసుకున్నారు.

మన గుంటూరు-స్వచ్చ గుంటూరు నినాదంలో భాగంగా.. ప్రజలకు అవగాహన కల్పించేదుకు పాటల పోటీలను కూడా నిర్వహించారు. నగరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దటం, పరిశుభ్రత వల్ల ఉపయోగాలపై ఆమె అవగాహన కల్పిస్తున్నారు.

Also Read: AP Covid Cases: ఏపీలో కోవిడ్‌తో 18 మంది మృతి.. కొత్తగా 1,557 పాజిటివ్ కేసులు..

గుంటూరు నగరానికి సరఫరా అయ్యే తాగు నీటి విషయంలో కూడా ఆమె అత్యంత జాగత్త్రలు తీసుకుంటున్నారు. ల్యాబ్ లో సిబ్బంది ఎప్పటికప్పుడు విధుల్లో ఉండేలా చూడాలని, ఇతరులు ప్రాంగణంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిల్టర్ బెడ్స్ ని నిర్ధేశిత పద్ధతిలో శుభ్రం చేస్తుండాలని. ప్రతి రోజు కృష్ణా నది నుంచి వచ్చే నీరు, శుద్ధి చేసి నగరంలోని రిజర్వాయర్ లకు పంపింగ్ చేసే నీటి పరిమాణం, శుద్ధికి వినియోగించిన ఆలం, క్లోరిన్ వివరాలు కూడా క్రమపద్ధతిలో రిజిస్టర్ లో నమోదు చేయాలని గతంలోనే చెప్పారు.

అయితే ప్లాస్టిక్ తో పర్యావరణానికి కలుగుతున్న హాని కారణంగా తాజాగా.. మాంసం దుకాణాలకు జూట్ లేదా క్లాత్ బ్యాగ్ లాంటిది తీసుకెళ్తే డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు.

Also Read: SI Bhavani Suicide: విజయనగరంలో మహిళా ఎస్సై సూసైడ్... పోలీసు ట్రైనింగ్ హాస్టల్లో ఉరివేసుకున్న భవానీ... కారణాలపై పోలీసులు ఆరా

Vaccination Duping: వ్యాక్సిన్ వేసుకుంటే బ్యాంక్ ఖాతాల్లో నగదు... మోసానికి తెర లేపిన సైబర్ నేరగాళ్లు.. ఇద్దరు అరెస్టు

Andhra Pradesh Highway: ఏపీలో కొత్తగా 20 జాతీయరహదారులు... కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ రహదారులివే!

Published at : 29 Aug 2021 07:12 PM (IST) Tags: Guntur latest news Guntur meat shops Guntur meat shops discount Guntur muncipal commissioner challa anuradha jute bags

సంబంధిత కథనాలు

AP High Court Jobs: ఏపీ హైకోర్టులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?

AP High Court Jobs: ఏపీ హైకోర్టులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?

Breaking News Live Telugu Updates: ఈ నెల 6న వైఎస్ షర్మిల ఢిల్లీ టూర్, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం 

Breaking News Live Telugu Updates: ఈ నెల 6న వైఎస్ షర్మిల ఢిల్లీ టూర్, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం 

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో పోరాటం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమా?, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో పోరాటం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమా?, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

Nellore Crime : కానిస్టేబుల్ తో ఎస్ఐ ప్రేమపెళ్లి, అదనపుకట్నం కోసం వేధింపులు

Nellore Crime : కానిస్టేబుల్ తో ఎస్ఐ ప్రేమపెళ్లి, అదనపుకట్నం కోసం వేధింపులు

Kotakonda Durgamma : శ్రీకాకుళం జిల్లాలో దొరల దసరా, వేపచెట్టు వద్ద తురాయి పువ్వు ఎటుపడితే అటు సుభిక్షం!

Kotakonda Durgamma : శ్రీకాకుళం జిల్లాలో దొరల దసరా, వేపచెట్టు వద్ద తురాయి పువ్వు ఎటుపడితే అటు సుభిక్షం!

టాప్ స్టోరీస్

IND vs SA 3rd T20: ఆఖరి టీ20లో టీమ్‌ఇండియా ఢమాల్‌! టాప్‌- మిడిల్‌ కొలాప్స్‌!

IND vs SA 3rd T20: ఆఖరి టీ20లో టీమ్‌ఇండియా ఢమాల్‌! టాప్‌- మిడిల్‌ కొలాప్స్‌!

Unstoppable with NBK Teaser release: ‘అన్‌స్టాపబుల్ 2’ టీజర్: మరింత జోష్‌తో బాలయ్య ఎంట్రీ, ఈ సారి డబుల్ ధమాకా!

Unstoppable with NBK Teaser release: ‘అన్‌స్టాపబుల్ 2’ టీజర్: మరింత జోష్‌తో బాలయ్య ఎంట్రీ, ఈ సారి డబుల్ ధమాకా!

Kareena Kapoor: కరీనాకు చేదు అనుభవం, ముంబై ఎయిర్ పోర్టులో ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టి ఏం చేశారంటే?

Kareena Kapoor: కరీనాకు చేదు అనుభవం, ముంబై ఎయిర్ పోర్టులో ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టి ఏం చేశారంటే?

Jairam Ramesh : కేసీఆర్ కు బీఆర్ఎస్ కాదు వీఆర్ఎస్ అవసరం- జైరాం రమేష్

Jairam Ramesh : కేసీఆర్ కు బీఆర్ఎస్ కాదు వీఆర్ఎస్ అవసరం-  జైరాం రమేష్