అన్వేషించండి

AP Covid Cases: ఏపీలో కోవిడ్‌తో 18 మంది మృతి.. కొత్తగా 1,557 పాజిటివ్ కేసులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,557 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో నమోదైన కేసుల సంఖ్య 20,12,123కి పెరిగింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 18 మంది కోవిడ్‌ కారణంగా మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 13,825కి పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో నమోదైన కోవిడ్ కేసులకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో కొత్తగా 1,557 కోవిడ్ కేసులు నమోదైనట్లు బులెటిన్‌లో పేర్కొంది. నిన్న 64,550 శాంపిళ్లను పరీక్షించగా ఈ మేరకు వెల్లడైనట్లు తెలిపింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20,12,123కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం చిత్తూరు (255), తూర్పు గోదావరి (232), పశ్చిమ గోదావరి (212), నెల్లూరు (164), కృష్ణా (159) జిల్లాల్లో నమోదయ్యాయి.

గత కొద్ది రోజులుగా నమోదవుతోన్న కోవిడ్ పాజిటివ్ కేసుల్లో అత్యధికం ఈ ఐదు జిల్లాల నుంచే నమోదవుతున్నాయి. ఇక కోవిడ్ బాధితుల్లో గత 24 గంటల్లో 1,213 కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 19,83,119కి చేరింది. ప్రస్తుతం 15,179 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న మరణించిన వారిలో కృష్ణా జిల్లాలో నలుగురు.. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున.. ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరిలో ఒకరు ఉన్నారు.  
దేశంలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి..
దేశంలో గత కొద్ది రోజుల నుంచి కోవిడ్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 45,083 మంది కోవిడ్ బారిన పడ్డారు. వీటిలో కేరళ నుంచే 70 నుంచి 75 శాతం కేసులు ఉన్నాయి. మరో 460 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ కన్నుమూశారు. రికవరీ రేటు మాత్రం 97 శాతానికి పైగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్క రోజులో 35,840 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారని తెలిపింది.

Also Read: Vaccination Duping: వ్యాక్సిన్ వేసుకుంటే బ్యాంక్ ఖాతాల్లో నగదు... మోసానికి తెర లేపిన సైబర్ నేరగాళ్లు.. ఇద్దరు అరెస్టు

Also Read: Andhra Pradesh Highway: ఏపీలో కొత్తగా 20 జాతీయ రహదారులు... కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ రహదారులివే!

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget