News
News
X

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

Global Healthcare Summit: విశాఖపట్నంలో 16వ వార్షిక AAPI గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్ (GHS) నిర్వహించనున్నారు. ఈ హెల్త్ సమ్మిట్‌కు హాజరు కావాలని సీఎం జగన్‌ను ప్రవాస వైద్యులు ఆహ్వానించారు.  

FOLLOW US: 

ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ, ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చడమే లక్ష్యంగా వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ప్రవాస వైద్యులు ముందుకొచ్చారు. ఎన్నారై డాక్టర్లు శనివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. విలేజ్ క్లీనిక్, టెలి మెడిసిన్ సహా ఇతర ఆరోగ్య శిక్షణా కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు ఆసక్తి చూపించారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) అధ్యక్షుడు డాక్టర్ రవి కొల్లి ఆధ్వర్యంలో జనవరి 6 నుంచి 8, 2023 వరకు విశాఖపట్నంలో 16వ వార్షిక AAPI గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్ (GHS) నిర్వహించనున్నారు. ఈ హెల్త్ సమ్మిట్‌కు హాజరు కావాలని సీఎం జగన్‌ను ప్రవాస వైద్యులు ఆహ్వానించారు.  

మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, స్త్రీలు & పిల్లల ఆరోగ్యం, అంటు వ్యాధులు మరియు మానసిక ఆరోగ్యం వంటి కీలకమైన ఆరోగ్య అంశాలపై  అవగాహన పెంచడం ఈ సమ్మిట్ లక్ష్యమని డాక్టర్ రవి కొల్లి ముఖ్యమంత్రి జగన్ కి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఏపీని మోడల్ రాష్ట్రంగా మార్చడానికి AAPI వైద్యులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని డాక్టర్ రవి తెలిపారు. 

మాతా శిశు మరణాలను తగ్గించాలని నిర్ణయం
టెలి కన్సల్టేషన్‌లు, ట్రైనర్ సెషన్‌లకు శిక్షణ ఇవ్వడం, వివిధ ప్రత్యేకతల కోసం నేర్చుకునే మాడ్యూల్స్ మొదలైన వాటికి AAPI మద్దతు ఇస్తుందని డా. రవి తెలిపారు. మాతా శిశు మరణాలను తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అమెరికాకు చెందిన ట్రైన్ అండ్ హెల్ప్ ఏ బేబీ సంస్థ (TAHB) తమ సంసిద్ధతను తెలిపింది. TAHB సంస్థ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు డాక్టర్ కె. ప్రకాష్ సంస్థ లక్ష్యాల గురించి సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. బోధనా సంస్థలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలైన వాటితో TAHB పని చేస్తుందన్నారు.

ఏపీకి ఎన్నారై వైద్యులు, సంఘాలు సహకారం
విలేజ్ క్లినిక్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు శిక్షణ అందించడంలో ఎన్నారై వైద్యులు, సంఘాలు సహకారం అందించడానికి ముందుకు రావడాన్ని సీఎం జగన్ అభినందించారు.అలాగే,  AAPI వారు చెప్పిన మానసిక ఆరోగ్య కార్యక్రమం పట్ల ఆసక్తి చూపించారు. అవసరమైన సమయంలో ఉపయోగపడే మానసిక ప్రథమ చికిత్సలో శిక్షణ పొందగల కౌన్సెలర్‌లను పాఠశాలలకు కేటాయించాలని అభిప్రాయపడ్డారు. గ్రాస్ రూట్ స్థాయిలో నైపుణ్యాలను మెరుగుపరచడానికి 15,000 మందికి పైగా ఆశా  కార్యకర్తలకు వర్చువల్ సెషన్‌ల ద్వారా దృష్టి సారించవచ్చునని ఎన్నారై డాక్టర్లకు సీఎం జగన్ సూచించారు. 

Also Read : Stalin Letter To Jagan : ఏపీ - తమిళనాడు మధ్య జల జగడం ! రెండు ప్రాజెక్టుల్ని నిలిపివేయాలని జగన్‌కు స్టాలిన్ లేఖ ! 

ఆరోగ్య సంరక్షణలో  తనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్నారై వైద్య వ్యవహారాల సలహాదారుగా అవకాశం కల్పించినందుకు సీఎం జగన్‌కు డాక్టర్ ఎన్. వాసుదేవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో ఉపయోగపడే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను ఏపీలోని అన్ని మెడికల్ కాలేజీల్లో ఫ్యామిలీ మెడిసిన్‌ చేర్చాలని సీఎం జగన్‌కు డాక్టర్లు సూచించారు. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి APNRTS, AAPI, TAHB, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ మొదలైన వాటితో సమన్వయం చేస్తామని పేర్కొన్నారు.

Also Read : Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Published at : 14 Aug 2022 08:21 AM (IST) Tags: YS Jagan Visakhapatnam AP News Telugu News AAPI Global Healthcare Summit Health Summit

సంబంధిత కథనాలు

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

BJP Vishnu : అమిత్ షాను కలిసినందుకే విమర్శిస్తారా ? జూ.ఎన్టీఆర్‌కు 18 కోట్ల బీజేపీ సభ్యుల మద్దతు ఉంటుందన్న ఏపీ బీజేపీ !

BJP Vishnu :  అమిత్ షాను కలిసినందుకే విమర్శిస్తారా ? జూ.ఎన్టీఆర్‌కు 18 కోట్ల బీజేపీ సభ్యుల మద్దతు ఉంటుందన్న  ఏపీ బీజేపీ !

Breaking News Live Telugu Updates: తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

Breaking News Live Telugu Updates: తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలలో సీఎం జగన్ టూర్- ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం

తిరుమలలో సీఎం జగన్ టూర్- ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం

KVP Letter To Jagan : జగన్‌కు కేవీపీ సీరియస్ లెటర్ - కేంద్రంపై ఒత్తిడి చేయాలని సలహా !

KVP Letter To Jagan :  జగన్‌కు కేవీపీ సీరియస్ లెటర్ - కేంద్రంపై ఒత్తిడి చేయాలని సలహా !

టాప్ స్టోరీస్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..! | ABP Desam

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..!  | ABP Desam

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?