అన్వేషించండి

New Education Policy: ఏపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రభుత్వం అద్భుతమంటుంటే ఉపాధ్యాయులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ఏపీలో బడిగంట మోగుతోంది. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది నుంచే కొత్త విద్యావిధానాన్ని అమలులోకి తీసుకురానుంది. దీనిపై కొందరు విద్యావేత్తలు, ఉపాధ్యాయసంఘాల్లో వ్యతిరేకత ఉంది.

 

ప్రైమరీ, హైస్కూల్, ఇంటర్.. ఇప్పటి వరకూ ప్రభుత్వ విద్యావిధానం ఇది. 10+2 విధానాన్ని ఇక నుంచి  5+3+3+4గా మార్చబోతున్నారు. ఇప్పటివరకూ ఉన్న ప్రాథమిక పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఉండవ్. వీటి స్థానంలో  ఆరు రకాల పాఠశాలలు వస్తున్నాయి. మొత్తం విద్యావిధానమే  మారిపోతోంది. ప్రైమరీ విద్యకు ముందే ఫౌండేషన్ కోర్సులు వస్తున్నాయి. జూనియర్ ఇంటర్ పాఠశాలల్లోకే వస్తోంది. ఈ కొత్త విధానంతో విద్యార్థులకు చిన్నతనంలోనే మంచి పునాది పడుతుందని.. ప్రభుత్వం చెబుతోంది. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా దీనిని తీసుకొచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 

రాష్ట్రంలో ఆరు రకాల పాఠశాలలు
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత... ఇలా మూడు రకాల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఏపీలో అమలుకానున్న నూతన విద్యావిధానాన్ని అనుసరించి స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరించారు. పీపీ-1 నుంచి 12వ తరగతి వరకూ ఆరు రకాల స్కూల్స్‌ ఉంటాయి.

1) శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌ ( పీపీ-1, పీపీ-2)
ప్రాథమిక విద్య కంటే ముందుగా నేర్పే ఫౌండేషన్ స్కూళ్లు ఇవి. అంగన్‌వాడీలను శాటిలైట్‌ ఫాండేషన్‌ పాఠశాలలుగా మార్పు చేస్తారు. ఇక్కడ పీపీ-1, 2 మాత్రమే బోధిస్తారు. ప్రాథమిక పాఠశాలలకు దూరంగా ఉన్న ప్రతి ఆవాసంలోనూ వీటిని ఏర్పాటు చేస్తారు.

2) ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2, 1, 2 తరగతులు)
అంగన్‌వాడీలకు దూరంగా ఉన్న చోట.. ఇప్పటికే ఉన్న ప్రైమరీ స్కూళ్లలో ఫౌండేషన్ కోర్సులు ప్రారంభిస్తారు.  పీపీ-1, 2, ఒకటి, రెండు తరగతులు బోధించే బడులను ఫౌండేషన్‌ పాఠశాలలుగా పిలుస్తారు. ఈ పాఠశాలల్లోని ౩,4,5 తరగతులను సమీపంలోని హైస్కూళ‌్లలో కలుపుతారు. 

౩. ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2, 1, 2, 3, 4, 5 తరగతులు)
హైస్కూళ్లకు దూరంగా ఉన్న ప్రైమరీ స్కూళ్లను అలాగే ఉంచి.. వీటిలో ఫౌండేషన్ కోర్సులు ప్రారంభిస్తారు. 

4. ప్రీహైస్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు)
ఇప్పటి వరకూ ఉన్న యూపీ స్కూళ్లు ఇక నుంచి ప్రీ హైస్కూళ్లుగా మారిపోతాయి. 1-7 తో పాటు.. వీటికి అదనంగా ఫౌండేషన్ కోర్సులు కూడా చేరతాయి. 

5. హైస్కూల్స్‌ (3 నుంచి 10వ తరగతి వరకూ)
ఇప్పటివరకూ హైస్కూల్ అంటే 6 నుంచి 10 తరగతుల వరకే ఉండేది. ఇప్పుడు హైస్కూల్ సమీపంలోని ప్రైమరీ స్కూలు నుంచి 3,4,5 తరగతుల విద్యార్థులను కూడా వీటిలో కలుపుతారు. 

6. హైస్కూల్‌ ప్లస్‌ ( 3 నుంచి 12వ తరగతి వరకూ)
సీబీఎస్ఈ తరహాలో స్కూళ్లలోనే +2 వచ్చేస్తుంది. విద్యార్థుల డిమాండును అనుసరించి ప్రతి మండలానికి ఒకటి, రెండు జూనియర్‌ కళాశాలలను ప్రారంభించాలని చూస్తున్నారు. వీటిని ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న కొన్ని కళాశాలలను దూరాన్ని అనుసరించి పాఠశాలల ప్రాంగణానికి తరలిస్తారు. 3-12 తరగతులు ఏర్పాటు చేసి, హైస్కూల్‌ ప్లస్‌గా గుర్తిస్తారు


New Education Policy: ఏపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రభుత్వం అద్భుతమంటుంటే ఉపాధ్యాయులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

కొత్త విద్యావిధానంతో పెనుమార్పులు-ప్రభుత్వం

జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి దానిని అమలు చేస్తున్నది తామేనని ఏపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. పూర్వ ప్రాథమిక విద్యను పటిష్టం చేయడంతో పాటు.. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి సరిగ్గా ఉంటుందని చెబుతోంది. ఉపాధ్యాయులను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే నూతన విధానంలో ప్రధాన లక్ష్యమన్నారు సీఎం జగన్. కొత్త విధానంలో 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులును బీఈడీ, పీజీ చేసిన ఉపాధ్యాయులతో సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధన అందించబోతున్నామని, తద్వారా పిల్లలకు ఫోకస్డ్‌ ట్రైనింగ్‌ వస్తుందని, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నామని, ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ రాబోతున్నారని సీఎం.. ఇటీవల కొత్త విద్యావిధానంపై జరిగిన సమావేశంలో చెప్పారు.
 
జాతీయ విద్యావిధానం (NEP) చెప్పిందేంటి..? వీళ్లు చేస్తోందేంటి..?

జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ప్రీ ప్రైమరీని మరింత పటిష్టం చేయడానికి కొత్త విధానం తీసుకొచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే NEPకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతోందని విద్యావేత్తలు చెబుతున్నారు. పాఠశాల విద్యకు పూర్వస్థాయిలో ఉండేది సన్నద్ధత దశ అని.. ఆ తర్వాత ప్రాథమిక స్థాయిలో అభ్యసన దశ మొదలవుతుందని చెబుతున్నారు. ప్రపంచంలో అన్నిదేశాల్లోనూ ప్రాథమిక విద్య ప్రత్యేకమైన యూనిట్‌గా ఉందని గుర్తుచేస్తున్నారు. కేంద్రం విద్యావిధానం.. కేవలం అభ్యసనం కోసమేనని చెప్పిందని... పాఠశాల విద్యను వర్గీకరించమని ఎక్కడా చెప్పలేదని చెబుతున్నారు. 


New Education Policy: ఏపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రభుత్వం అద్భుతమంటుంటే ఉపాధ్యాయులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ప్రాథమిక విద్యను లేకుండా చేస్తున్నారా..?

నూతన విద్యావిధానం పేరుతో ప్రాథమిక విద్యను పూర్తిగా నాశనం చేస్తున్నారని కొందరు విద్యావేత్తలు దీనిని ఆక్షేపిస్తున్నారు. NEPలో చెప్పిన దానికి విరుద్ధంగా రాష్ట్ర విధానం ఉందన్నారు. ప్రాథమిక పాఠశాలను విభజించమని జాతీయ విద్యావిధానం ఎక్కడా చెప్పలేదని ప్రముఖ విద్యావేత్త, ఎం.ఎల్.సీ విఠపు బాలసుబ్రమణ్యం చెప్పారు. "దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రాథమిక విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసే సాహసం ఈ ప్రభుత్వం చేస్తోంది. చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎవ్వరూ ఈ పనిచేయలేదు" అని ఏబీపీ దేశంతో అన్నారాయన..! విద్యారంగాన్ని సంస్కరిస్తున్నామన్న పేరుతో ప్రాథమిక విద్యను పూర్తిగా నాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్రీ ప్రైమరీ విద్యార్థులు వికాస దశలో ఉంటారని.. వాళ్లని 1, 2 తరగతులతో కలిపినా.. 3,4,5 తరగతుల పిల్లలను హైస్కూలుతో కలిపినా ఇబ్బందేనన్నారు. ఆయా వయసుల్లో పిల్లల మానసిక స్థాయిలు వేర్వేరుగా ఉంటాయని ఇది ప్రీ ప్రైమరీని.. అటు హైస్కూలును దెబ్బతీస్తుందని అన్నారు. ప్రభుత్వం చెబుతున్న ఉద్దేశ్యం నెరవేరకపోగా.. నష్టం జరుగుతుందన్నారు. 

ఉపాధ్యాయ పోస్టులు తగ్గించడానికేనా..?

కొత్త విద్యావిధానంపై ఉపాధ్యాయ సంఘాలు కూడా అభ్యంతరం చెబుతున్నాయి. ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతోనే చేస్తున్నామని చెబుతున్నప్పటికీ... ఉపాధ్యాయ పోస్టులను తగ్గించే ఎత్తుగడ ఇందులో ఉందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైస్కూళ్లలో ఇంగ్లిషు మీడియం తీసుకురావడం వల్ల 16 వేల పోస్టులు తగ్గుతాయని.. ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలను లేకుండా చేసి వాటిని అంగన్‌వాడీల్లోనూ... హైస్కూళ్లలోనూ కలపడం వల్ల దాదాపు 40 వేల టీచర్‌ పోస్టులను తగ్గించే ప్రయత్నం చేస్తారని... ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు బసవలింగారావు అన్నారు. " ఈ విధానంతో ప్రభుత్వ ఉద్దేశ్యం నెరవేరదు. పైగా పాఠశాలలు దూరం అయి డ్రాపవుట్స్ కూడా పెరుగుతాయి"  అని ఏబీపీ దేశంతో చెప్పారు. 

ప్రభుత్వం మాత్రం ఒక్కరిని కూడా ఉద్యోగంలో నుంచి తొలగించమని చెబుతోంది. ఉపాధ్యాయుల సేవలను మరింత సమర్థంగా వాడుకోవడానికి కొత్త విధానం పనిచేస్తుందని తెలిపింది. "కేవలం నలుగురు విద్యార్థులు ఉన్న చోట ఒక టీచర్ ఉండి... 100 మంది ఉన్న చోట కూడా ఒకరే ఉంటే.. సరిగ్గా ఉన్నట్లు కాదు కదా.. విద్యార్థులు- ఉపాధ్యాయుల నిష్పత్తిని సమానంగా చేయగలగాలి" అని ముఖ్యమంత్రి జగన్ విద్యాశాఖ సమీక్షలో అన్నారు. ఉద్యోగాలు తొలగించకపోయినా... రేషనలైజేషన్ పేరుతో కొత్త ఉద్యోగాలు ఉండవని... ఇప్పటికే పాతిక వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని..  ఈ విధానంతో ఇంకా కొన్నాళ్లు కొత్త ఉపాధ్యాయ పోస్టుల ఊసే ఉండదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. దానికి తగ్గట్లే ఇటీవల ప్రకటించిన జాబ్ కాలెండర్.. డీఎస్సీ గురించి ప్రస్తావించలేదు. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నాయి. 

అంగన్‌వాడీల ఆందోళన

నూతన విద్యావిధానంతో ఓ విచిత్రమైన పరిస్థితి కూడా వస్తోంది. ఇప్పుడు అంగన్‌వాడీలన్నీ శాటిలైట్  ఫౌండేషన్ స్కూళ్లుగా మారతాయి. కొన్ని చోట్ల ఒకటి రెండు తరగతులను అంగన్వాడీల్లోకి తెస్తారు.  ఏపీలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో అంగన్ వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. 1, 2  తరగతులు విద్యాశాఖ పరిధిలోకి వస్తాయి. అంటే ఒకే స్కూలుపై రెండు శాఖలు పర్యవేక్షణ ఉంటుంది.  బాలింతలు, శిశువులు, కిషోరబాలికలకు పౌష్టికాహారం అందించడం, వారిలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం లక్ష్యంగా  అంగన్‌వాడీలు పని చేస్తున్నారు. విద్య మీద దృష్టి పెట్టడం వల్ల ఆ కార్యక్రమాల లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉంది. 
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని డ్వాక్రా వర్కర్ అందిస్తున్నారు. అంగన్‌వాడీల్లో ఆయాలు ఉన్నారు. ఒకే స్కూలులో ఉండే తక్కువ మంది పిల్లల కోసం ఇక నుంచి ఇద్దరి వర్కర్‌లను ప్రభుత్వం ఉంచకపోవచ్చు. అది తమ ఉద్యోగాలకు ముప్పు తెస్తుందని అంగన్‌వాడీ ఆయాలు భయపడుతున్నారు. 

'రైట్‌ టూ ఎడ్యుకేషన్' చట్టం ప్రకారం విద్యార్థికి కిలోమీటరు దూరంలో పాఠశాల ఉండాలి. ఈ రేషనలైజేషన్ ప్రక్రియ వల్ల పాఠశాలలు దూరం అవుతాయన్న కారణంతో ఎవరైనా హైకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం బోధన విషయంలో ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మరోసారి అలాంటి అనుభవం ఎదురుకాకుండా చూసుకోవాలి.  ఆంధ్రప్రదేశ్ విద్యావిధానంలో తీసుకొస్తున్న మార్పులు పట్ల పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం కొత్త పాలసీపై ధృఢ నిశ్ఛయంతోనే ఉంది.

Also Read; AP Schools: ఆ పిల్లల చదువులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... అదే స్కూళ్లల్లోనే కొనసాగించాలని ఆదేశాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget