అన్వేషించండి

MLA AnilKumar: చంద్రబాబు అవినీతిలో పవన్ కు వాటా- ఎమ్మెల్యే అనిల్ సంచలన వ్యాఖ్యలు

ప్రశ్నిస్తానంటూ ట్విట్టర్లో పదే పదే సీఎం జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించే పవన్, ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారని అడిగారు. బాబు అవినీతిలో పవన్ కి కూడా వాటా ఉందా అని ప్రశ్నించారు అనిల్. 

YSRCP MLA Anil Kumar strong counter to chandrababu:

చంద్రబాబుకి ఐటీ నోటీసుల వ్యవహారంలో పవన్ కల్యాణ్ మౌనం వెనక పరమార్థమేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రశ్నిస్తానంటూ ట్విట్టర్లో పదే పదే సీఎం జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించే పవన్, ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారని అడిగారు. బాబు అవినీతిలో పవన్ కి కూడా వాటా ఉందా అని ప్రశ్నించారు. ఆ వాటాల లెక్కలు తేలాలని డిమాండ్ చేశారు అనిల్. 

మన్ను తిన్న పాము..
ఐటీ నోటీసులపై చంద్రబాబు కనీసం స్పందించడంలేదని, మన్ను తిన్న పాములాగా సైలెంట్ గా ఉన్నారని విమర్శించారు అనిల్. చంద్రబాబు అవినీతికి పాల్పడకపోతే రూ.118 కోట్ల ముడుపులను ఎందుకు లెక్కల్లో చూపించలేదని ప్రశ్నించారాయన. పీఏ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని అన్నారు. తాను సత్యహరిశ్చంద్రుడిని అని చెప్పుకునే చంద్రబాబు, ఐటీ నోటీసులపై సమాధానం చెప్పాలన్నారు అనిల్. 

మీడియాకి కూడా వాటా ఉందా.. 
చంద్రబాబు అవినీతిలో రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులకు కూడా వాటాలున్నాయని ఆరోపించారు అనిల్. అందుకే వారు కూడా నోరెత్తటం లేదని, చంద్రబాబు అనుకూల మీడియాలో ఎక్కడా నోటీసుల ప్రస్తావన లేదని చెప్పారు. నోటీసుల వ్యవహారాన్ని కవర్ చేసుకోడానికి తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని నక్కి నక్కి విన్నట్టుగా రాసే మీడియా ఛానెళ్లు ఇప్పుడు చంద్రబాబు నోటీసులపై ఎందుకు స్పందించలేదన్నారు అనిల్. నోటీసులపై వార్తలు రాయకపోతే వారికి కూడా వాటాలందాయనేది నిజం అని ఒప్పుకోవాలన్నారు. 

మరిదికోసం ఎన్ని కష్టాలు.. 
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ పై విమర్శల డోస్ పెంచిన పురందరేశ్వరి కూడా చంద్రబాబు విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు అనిల్. ఆమె కూడా తన మరిదిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌ లకు దుబాయ్‌ లో కూడా ముడుపులు అందాయన్నారు అనిల్. అమరావతి అనే బొమ్మ వెనుక జరిగిన భారీ అక్రమాలకు ఇది శాంపిల్ మాత్రమేనని చెప్పారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలను చంద్రబాబు కలవడానికి కారణం కూడా ఇదేనన్నారు. ఈ ఐటీ కేసులనుంచి బయటపడేయాలని వారిని బాబు బతిమిలాడుకున్నారని చెప్పారు. ఇంకా లోతుగా విచారణ జరిపితే భారీ అక్రమాలు బయటకు వస్తాయని చంద్రబాబు భయపడుతున్నారని, వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 

వామపక్షాలకు ఏమయింది..?
అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే వామపక్షాలకు నోరు పడిపోయిందా అని ప్రశ్నించారు అనిల్. చంద్రబాబు ఐటీ నోటీసులపై వామపక్షాలు ఎందుకు స్పందించడంలేదన్నారు. వారికి కూడా ముడుపులు అందాయనే అనుమానాలున్నాయని చెప్పారు. 

చంద్రబాబుకు శక్తి, వయసు అయిపోయిందని, ఆయన చేసిన పాపాలకు ఇప్పుడు పరిహారం చెల్లించాల్సిన సమయం వచ్చిందని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. అమరావతి పేరుతో కొల్లగొట్టిన నిధుల్లో ఇది కొంత మాత్రమేనని, లోతైన విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు అనిల్. తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి వెళ్లి మరీ అనిల్, చంద్రబాబు వ్యవహారంపై ప్రెస్ మీట్ పెట్టారు. ఐటీ నోటీసుల విషయంలో ఘాటుగా స్పందించారు. 

టాప్ హెడ్ లైన్స్

Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget