అన్వేషించండి

YSRCP: చంద్రబాబు భవిష్యత్ భయంకరంగా ఉంటుంది- వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరిక 

YSRCP :ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మారకపోతే భవిష్యత్ భయంకరంగా ఉంటుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీన్ని చంద్రబాబే మొదలు పెట్టారని ఆరోపించారు. 

YSRCP Leader Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రశ్నించే వారందర్నీ జైల్లో పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని సజ్జల రామకృష్ణరెడ్డి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని సజ్జల ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. రాజకీయ పగతోనే నేతలపై వరుస పెట్టి కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా కల్పిత కథనాలతో అలాంటి కేసే కాకాణిపై పెట్టారని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించినంత మాత్రాన ఎవరూ భయపడిపోరని సజ్జల చెప్పుకొచ్చారు. జైలుకు వెళ్లిన వాళ్లంతా మరింత రాటుతేలుతారని చెప్పుకొచ్చారు. 

వైఎస్సార్‌సీపీలో ఉండే సీనియర్‌ నేతలను టార్గెట్‌ చేస్తారని తమకు ముందే తెలుసుఅన్నారు సజ్జల. తాము కూడా అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని జైలుకు వెళ్లడానికి రెడీ అన్నారు. ఇలా వ్యవస్థలను మేనేజ్ చేసి సిస్టమ్‌ను తప్పుదారి పట్టించి చేపట్టే ప్రక్రియ బాగాలేదన్నారు. అరెస్టు అనేది అల్టిమేట్‌ అని అన్నారు సజ్జల. కానీ అరెస్టు చేసిన తర్వాత కేసును పుటప్ చేస్తున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు చేస్తున్న చర్యలు తిరిగి ఆయన మెడకు చుట్టుకుంటాయని హెచ్చరించారు సజ్జల. కచ్చితంగా దీనికి ఫలితం భయంకరంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి సిస్టమ్ దారి తప్పితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ చట్టాన్ని ఎవరూ చేతులోకి తీసుకోలేదని అన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు అందర్నీ సాక్ష్యాలతోనే అరెస్టు చేశామని గుర్తు చేశారు. ఇలా చేయాలనుకుంటే గెలిచిన మూడు నెలలకే చంద్రబాబును జైల్లో పెట్టే వాళ్లమని వ్యాఖ్యానించారు.  

మొదటి నుంచి చెబుతున్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు సజ్జల. తమకు సపోర్ట్ చేసే మీడియాలో కథనాలు రాయించడం, తర్వాత వాటి ఆధారంగా కేసులు పెట్టి ఎవరితోనో చెప్పించి కీలక నేతలను అరెస్టు చేస్తున్నారని అన్నారు. పబ్లిక్‌గానే పోలీసులు ప్రజలను కొడుతున్నారని తెలిపారు. సామాన్యులు భయపడిపోతున్నారని వివరించారు.  

చంద్రబాబు తన రాజకీయ ఉనికి లేకుండా చేసుకుంటున్నారని అన్నారు సజ్జల. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వంపై చూడలేదని అన్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి పాడె కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Press Meet:
"నా గుండెల్లో తెలంగాణ ఉంది! మీ అయ్య జాగీరా అడ్డుకుంటామని బెదిరించడానికి?" పవన్ సంచలన కామెంట్స్
Pawan Kalyan Press Meet: పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 
పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 
India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
Embed widget