అన్వేషించండి

High tension Penna boat: పెన్నా సంగం బ్యారేజీకు బోటు గండం - సాహసోపేతంగా ప్రమాదం నివారణ - అసలేం జరిగిందంటే ?

Sangam Barrage: నెల్లూరు పెన్నా నది మీద సంగం బ్యారేజీ తృటిలో పెను విపత్తు తప్పించుకుంది. వరదలో కొట్టుకొచ్చిన భారీ బోటును సమర్థవంతంగా అధికారులు ఒడ్డుకు చేర్చారు.

Penna River in Nellore Sangam Barrage: కృష్ణానదికి భారీగా వరదలు వచ్చినప్పుడు కొన్ని బోట్లు కొట్టుకు వచ్చి బ్యారేజీ గేట్లకు అడ్డం పడటం చాలా సార్లు  జరిగాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి నెల్లూరు లోని పెన్నా సంగం బ్యారేజీకి వచ్చింది.  ఓ భారీ ఇసుక బోటు లంగర్ తెగిపోయి డ్యాం వైపు దూసుకు వచ్చింది. ఆ బోటు డ్యాం గేట్లకు తాకి ఉన్నట్లయితే పెను ప్రమాదం జరిగి ఉండేది. కానీ అధికారులు ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటే..బోటును ఒడ్డుకు చేర్చారు. 
  
 నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద బోటు  ప్రజల్ని, రైతుల్ని టెన్షన్ పెట్టింది.  మోంథా తుపాను వల్ల అత్యధిక వర్షం పడిన ప్రాంతాల్లో నెల్లూరు ఒకటి. ఈ కారణంగా పెన్నా నదిలో లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం  వచ్చింది. సరిగ్గా అదే సమయంలో, 30 టన్నుల బరువున్న ఇసుక బోటు, లంగరు తెగిపోయి, నేరుగా బ్యారేజీ గేట్లను ఢీకొట్టడానికి దూసుకొచ్చింది.

పోటెత్తే వరద ఉద్ధృతికి, ఒకవేళ ఆ భారీ బోటు బ్యారేజీకి తగిలి ఉంటే 85 గేట్లతో నిర్మితమైన సంగం బ్యారేజీ  భారీగా దెబ్బతినేది.  దాదాపుగా నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఈ ప్రాజెక్టు దెబ్బతింటే ఎంత నష్టం జరిగేదో అంచనా వేయాల్సిన పని లేదు.  రాబోయే సీజన్‌లో రైతులు కన్నీరు కార్చేవారు.  పొదలకూరు, సంగం వంటి కీలక గ్రామాల మధ్య రాకపోకలకు వారధిగా నిలిచే ఈ బ్యారేజీ దెబ్బతింటే పునరుద్ధరణ కూడా చాలా సమస్య అయ్యేది.  

బోటు గురించి  తెలియగానే, జిల్లా యంత్రాంగం క్షణం కూడా ఆలస్యం చేయలేదు.  కలెక్టర్  హిమాన్షు శుక్లా  , ఎస్పీ అజిత వజ్రేంద్ర ఆఘమేఘాలపై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి 30 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని..  30 మంది ఎస్డీఆర్‌ఎఫ్  సిబ్బందిని రప్పించారు.  పెన్నా నది ప్రవాహానికి ఎదురొడ్డి, ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహించారు.  ఆ బోటు బ్యారేజీ వైపుకు దూసుకెళ్లే సమయంలోనే  అడ్డుకుని చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు!                           

అధికారుల సమయస్ఫూర్తిని నారా లోకేష్ కూడా అభినందించారు. 

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!

వీడియోలు

Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget