By: ABP Desam | Updated at : 14 Jan 2022 01:53 PM (IST)
ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సినీ నటులు, దర్శక నిర్మాతల ఆస్తుల వివరాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీ నుంచి నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ.. ఎమ్మెల్యే ప్రసన్నకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఎవరికి బలిసిందో ప్రజలకు తెలుసని, సినిమా వాళ్ల కష్టాలు రాజకీయ నాయకులకు ఏం తెలుసని మాట్లాడారు. దీంతో ఇటు వైసీపీ నుంచి కూడా కౌంటర్లు మొదలయ్యాయి. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరులు, జిల్లా వైసీపీ నేతలు సినీ నిర్మాతలకు సమాధానమిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
సినీ నిర్మాతలు వ్యాపారం కోసం కష్టపడుతున్నారని, రాజకీయాల్లో కూడా అలాంటి కష్టాలుంటాయని చెప్పుకొచ్చారు. 1993లో తొలిసారిగా ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారని, అప్పటినుంచి 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారని, అప్పటికి ఇప్పటికి ఆయన ఆస్తులు లెక్కేస్తే ఎవరు నిజాయతీ పరులో తేలిపోతుందని చెప్పారు. ఈ మేరకు ఆస్తుల విచారణ కోసం సీఎం జగన్ కు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి లేఖ రాశారని, త్వరలోనే ఆ లేఖను ఆయన సీఎం జగన్ ని నేరుగా కలిసి ఇస్తారని నెల్లూరు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి చెప్పారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఫ్యామిలీకి నెల్లూరులో మంచి చరిత్ర ఉందని, దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు.
Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
సినిమా షూటింగుల్లో ఎంత కష్టం ఉంటుందో, ప్రజా సేవలో కూడా అంతే కష్టం ఉంటుందని వైసీపీ నేతలు చెప్పారు. ఇటీవల వరదల సమయంలో వైసీపీ నేతలు నిద్రాహారాలు మాని ప్రజల కష్టాలు తీర్చారని, దాని వల్ల అప్పటికప్పుడు ఎవరికీ ఏదీ రాదని, కానీ రాజకీయాల్లో కూడా కష్టం ఉంటుందని దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి చెప్పుకొచ్చారు.
నల్లపరెడ్డి కామెంట్స్ ఇవీ..
సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ నెల్లూరు జిల్లా కోవూరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శించారు. అసలు సినిమా వాళ్లకు ఏపీ గుర్తుందా అని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ప్రశ్నించారు. పెద్ద సినిమా టికెట్‌లను రూ.1000 నుంచి రూ.2000 దాకా అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. సినిమా టికెట్ రేట్స్‌ను తగ్గిస్తే సామాన్యులు కూడా పెద్ద సినిమాలు చూస్తారనే ఉద్దేశంతోనే ఏపీలో ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. ఇందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.
Also Read: Chiru Rajya Sabha : చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ ఇచ్చారా ? నిజమా ? మైండ్ గేమా ?
Also Read: పది రోజుల్లో సమస్యకు పరిష్కారం - చిరంజీవికి సీఎం జగన్ హామీ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !
Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
Nellore Wonder Kid: అక్షరాలతో ఆటలు, మ్యాథ్స్ తో గేమ్స్ - ఈ నెల్లూరు బాలిక సూపర్ అంతే
Nellore Pistol: నెల్లూరులో రెండు ప్రాణాలు తీసిన పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టిన పోలీసులు, కీలక విషయాలు
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
Amalapurama Protests: అమలాపురం విధ్వంసం కేసులో కీలక పురోగతి- కారకులైన 46 మంది అరెస్టు- 72 మంది కోసం గాలింపు
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్