News
News
X

AP Minister Kakani: తగ్గేదేలే - జోరు వానలోనూ గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాణి

జిల్లాలో జోరు వానలు, పైగా ఆదివారం. అయినా కూడా మంత్రి గడప గడప కార్యక్రమంలో పాల్గొన్నారు. రెయిన్ కోట్ వేసుకుని మరీ గొడుగులతో అనుచరులతో కలసి వెళ్లారు. ఆదివారం అయినా అధికారుల్ని వెంటబెట్టుకుని వెళ్లారు.

FOLLOW US: 

వెంకటాచలం మండలం కంటేపల్లి గ్రామంలో ఆదివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. మంత్రి గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం పెద్ద విశేషమేమీ కాదు, కానీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జోరు వానలు, పైగా ఆదివారం. అయినా కూడా మంత్రి గడప గడప కార్యక్రమంలో పాల్గొన్నారు. రెయిన్ కోట్ వేసుకుని మరీ గొడుగులతో అనుచరులతో కలసి వెళ్లారు. ఆదివారం అయినా అధికారుల్ని తన వెంటబెట్టుకుని వెళ్లారు. గ్రామస్తులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కంటేపల్లిలో ప్రతి ఇంటికి వెళ్లి గ్రామస్తులను పలకరించి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో ఆరా తీశారు.

వర్షంలోనూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. వర్షంలో కూడా మంత్రి తమ ఇళ్ల వద్దరు కావడంతో గ్రామస్తులు సంబర పడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్ మంత్రుల, ఎమ్మెల్యేలను తమ ఇంటివద్దకే పంపిస్తున్నారని అంటున్నారు గ్రామస్తులు.

సీరియస్‌గా గడప గడపకు ప్రభుత్వం.. 
ఏపీలో గడప గడప కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమంపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలను అలర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేలందరితో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు గతంలో క్లాస్ తీసుకున్నారని సమాచారం. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా స్పీడ్ పెంచారు. ప్రతి ఎమ్మెల్యే గ్రామాల్లకి వెళ్తున్నారు. తమ తరపున కుటుంబ సభ్యులను పంపించకుండా తామే నేరుగా జనంలోకి వెళ్తున్నారు. ఓపిగ్గా వారి సమస్యలన్నీ వింటున్నారు. ఎక్కడికక్కడ అధికారుల్ని, సచివాలయ సిబ్బందిని వెంట బెట్టుకుని వెళ్తూ ప్రజల సమస్యలు నోట్ చేసుకుంటున్నారు. వీలైనంత వరకు వాటి పరిష్కార మార్గాలను అక్కడికక్కడే ప్రజలకు వివరించి చెబుతున్నారు.

News Reels

ఇక మంత్రి కాకాణి విషయానికొస్తే.. తన నియోజకవర్గంలో ఆయన ఈపాటికే అన్ని మండలాలు చుట్టేశారు. మిగిలిన కొన్ని గ్రామాల్లో కూడా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. మొక్కుబడిగా కాకుండా ఆయన గడప గడప విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో గడప గడప కార్యక్రమంలో ఆయన నేరుగా పాల్గొంటున్నారు.

ఓవైపు మంత్రిగా రాష్ట్ర వ్యవహారాలు చూసుకుంటున్న కాకాణి గోవర్దన్ రెడ్డి, నెలలో సగం రోజులు అమరావతి సహా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇటీవలే ఆయన విదేశీ పర్యటన కూడా ముగించుకుని వచ్చారు. తాజాగా ఆయన నిత్యం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గడప గడప కార్యక్రమంలో హుషారుగా పాల్గొంటున్నారు. వర్షం అయినా, ఇంకే ఇబ్బంది అయినా ఆయన అస్సలు ఆగడంలేదు. మధ్యాహ్నం వరకు అధికారిక కార్యక్రమాల్ల బిజీగా ఉన్నా కూడా సాయంత్రం నుంచి ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే దాదాపుగా ఆయన నియోజకవర్గంలోని మండలాలన్నీ చుట్టేశారు.

Published at : 14 Nov 2022 07:44 AM (IST) Tags: kakani govardhan reddy Nellore Update Minister Kakani Nellore News

సంబంధిత కథనాలు

AP New CS Jawahar Reddy: ఏపీ సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

AP New CS Jawahar Reddy: ఏపీ సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

AP News Developments Today: నేడు మదనపల్లెకు సీఎం జగన్; పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు టూర్

AP News Developments Today: నేడు మదనపల్లెకు సీఎం జగన్; పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు టూర్

Petrol-Diesel Price, 30 November 2022: పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్- తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్‌!

Petrol-Diesel Price, 30 November 2022: పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్- తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్‌!

Gold-Silver Price 30 November 2022: బంగారం కొనాలంటే మాత్రం ఆలస్యం చేయకండి- ఈ నగరంలో కొంటే మరింత తగ్గనున్న రేట్‌!

Gold-Silver Price 30 November 2022: బంగారం కొనాలంటే మాత్రం ఆలస్యం చేయకండి- ఈ నగరంలో కొంటే మరింత తగ్గనున్న రేట్‌!

Nellore Rotten Chicken: నెల్లూరులో నాన్ వెజ్ కొంటున్నారా ! మీ ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే !

Nellore Rotten Chicken: నెల్లూరులో నాన్ వెజ్ కొంటున్నారా ! మీ ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే !

టాప్ స్టోరీస్

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

TRS Fire On Sharimila : భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

TRS Fire On Sharimila :  భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?