అన్వేషించండి

Nellore Mandous: ముందు జాగ్రత్తల వల్లే నెల్లూరులో ప్రాణ నష్టం లేదు, వర్ష భయం ఉంది

మాండూస్ తుపాను అల్లకల్లోలం సృష్టించినా, నెల్లూరు జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ముందస్తు జాగ్రత్తల వల్లే తుపాను నష్టాన్ని కూడా నిలువరించగలిగామని అన్నారు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు.

మాండూస్ తుపాను అల్లకల్లోలం సృష్టించినా, నెల్లూరు జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ముందస్తు జాగ్రత్తల వల్లే తుపాను నష్టాన్ని కూడా నిలువరించగలిగామని అన్నారు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు. జిల్లాలో అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. నెల్లూరు బ్యారేజీని సందర్శించి ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్న వరద నీటి ప్రవాహన్ని కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. తెలుగుగంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ హరినారాయణ రెడ్డి, సోమశిల ప్రాజెక్టు, సంగం బ్యారేజీల ద్వారా విడుదలైన వరద నీటి ప్రవాహం గురించి కలెక్టర్ కి వివరించారు.

మాండూస్ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని 38 మండలాల్లో సగటున 18 సెంమీల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మనుబోలు, ముత్తుకూరు, వెంకటాచలం మండలాల్లో 28 సెంమీల వర్షపాతం, అత్యల్పంగా కలిగిరి మండలంలో 7 సెంమీల వర్షపాతం నమోదయింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నా, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు వరద నీటి ప్రవాహన్ని అంచనా వేస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. సోమశిల నీటిని కూడా విడతల వారీగా సముద్రంలోకి వదులుతూ తీరప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ నుంచి రెండు బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ నుంచి ఒక బృందం నెల్లూరులో మకాం వేశాయి, రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించాయి. దాదాపు 2800 మంది లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించి అన్ని రకాల సదుపాయాలు కల్పించారు అధికారులు.

వర్ష భయం ఉంది..

తుపాను తీరం దాటినా.. దాని ప్రభావం పూర్తిగా తొలగిపోలేదని, రాబోయే రెండు రోజులు మత్స్యకారులు సముద్రం లోకి వెళ్ళవద్దని సూచించారు అధికారులు. ఈనెల 12 తేదీ అర్ధరాత్రి వరకు నిషేదాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు. ఇరిగేషన్ కాలువలకు, చెరువులకు పడిన గండ్లు పూడ్చడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయానికి సంబంధించి దాదాపు 5 వేల హెక్టర్లలో నారుమడి దశలో వరిపంట దెబ్బతిన్నట్టు గుర్తించారు. పూర్తిగా నీరు పోయాక ఆయా రైతులకు అవసరాన్నిబట్టి 80 శాతం సబ్సిడీ పై విత్తనాలు సరఫరా చేస్తామని,  రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికే విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పంట నష్టం జరిగిన వారికి వెంటనే నష్టపరిహారం అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

సోమశిల ప్రాజెక్టు నుండి 38 వేల క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. భారీ వర్షాలతో జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదైందని, జిల్లాలోని 780 చెరువులు నిండాయని, రాబోయే వ్యవసాయ సీజన్ కు పుష్కలంగా నీరు లభించిందన్నారు అధికారులు. తుపాను ధీటుగా ఎదుర్కోవడంలో గ్రామ సచివాలయ సిబ్బంది సేవలు బాగున్నాయని అన్నారు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వాహిస్తామని, శానిటేషన్ డ్రైవ్, పశు వైద్య శిబిరాలు కూడా నిర్వాహిస్తామన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
5G Smartphones Under 20000: రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
Tiger Attacks in Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
Farmers Protest: ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
Embed widget