అన్వేషించండి

మతి స్థిమితం లేని యువతిని రూమ్ లో బంధించి చిత్రవధ- నెల్లూరులో దారుణం

లంకేశ్వర్ అనే ఆ దుర్మార్గుడు మతిస్థిమితం లేదని తెలిసి ఆ యువతిని చేరదీసినట్టు నటించి ఇంట్లో బంధించాడు. రెండు నెలలుగా ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసి రోజూ బయటకు వెళ్లొచ్చేవాడు.

ఆమెకు, అతడికి ఎలాంటి సంబంధం లేదు. ఆమె మానసిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని రెండు నెలలుగా రూమ్ లో బంధించాడు. చిత్ర హింసలు పెట్టేవాడు, లైంగికంగా వేధించేవాడు. ఆమెను బయటకు రాకుండా రూమ్ లోనే బంధించి తాళం వేసేవాడు. రెండు నెలలుగా ఈ వ్యవహారాన్ని గమనించిన పొరుగింటివారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు వచ్చి ఆమెను అతడి చెర నుంచి విడిపించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగింది.

లంకేశ్వర్ అనే ఆ దుర్మార్గుడు మతిస్థిమితం లేదని తెలిసి ఆ యువతిని చేరదీసినట్టు నటించి ఇంట్లో బంధించాడు. రెండు నెలలుగా ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసి రోజూ బయటకు వెళ్లొచ్చేవాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఆమె కేకలు వేయడం పరిపాటి. చుట్టుపక్కలవాళ్లు ఈ విషయంపై నిఘా పెట్టి చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఎంక్వయిరీ చేసినా కూడా లంకేశ్వర్ కథలు చెప్పసాగాడు. చివరకు ఆ యువతిని అతడి చెర నుంచి విడిపించి వైద్య పరీక్షలకు పంపించారు. అతడి తప్పుందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు బుచ్చిరెడ్డిపాలెం సీఐ వీరప్రతార్.

ఎవరా యువతి..?

ఆ యువతి తాను ఆత్మకూరు వాసినని చెబుతోంది. యువతి తండ్రి పేరు శ్రీరాములురెడ్డి అని పోలీసులు చెప్పారు. ఆమె తల్లి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూ కొంతకాలం క్రితం చనిపోయారు. ఈ క్రమంలో ఆ యువతికి తల్లికి చెందిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద మంజూరు చేశారు. కొడవలూరు మండలం ఎల్లాయపాలెం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో జూనియర్‌ అసిస్టెంట్‌ గా ఆమె విధుల్లో చేరారు. కొంతకాలంపాటు విధులు నిర్వహించిన యువతి... క్రమక్రమంగా మనోవేదనకు గురైంది. తల్లి మృతి చెందిన విషయాలను పదే పదే గుర్తు చేసుకుంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యేదని ఎల్లాయపాలెం ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత కొంతకాలానికి పూర్తిగా మతి స్థిమితం కోల్పోయిన ఆ యువతి విధులకు కూడా సరిగా హాజరయ్యేవారు కాదు. గతేడాది అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో ఆమె విధులకు హాజరు కావడంలేదు. రోడ్లపై తిరుగుతూ ఉండేది.

రోడ్లపై తిరుగుతూ.. గతేడాది ఇలాగే తప్పిపోవడంతో యువతి కుటుంబ సభ్యులు కొడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఆమెను వెతికి పట్టుకున్న పోలీసులు తిరిగి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత మళ్లీ తప్పిపోయి నార్త్ రాజు పాలెంలో లంకేశ్వర్‌ కి కనిపించారు. దీంతో అతను ఆమెను బుచ్చిరెడ్డిపాలెం తీసుకెళ్లి తన ఇంటిలో ఆశ్రయం కల్పించాడు. అయితే లంకేశ్వర్ ఆమెను రెండు నెలలుగా ఇంటిలోనుంచి బయటకు రానివ్వలేదు. బుచ్చిరెడ్డిపాలెంలో సమోసాలు విక్రయిస్తుండే లంకేశ్వర్ ఆమెను, రూమ్ లో బంధించి రోజూ వచ్చిపోయేవాడు. సరిగా భోజనం పెట్టేవాడు కాదు. ఆమెను ఇంట్లో ఉంచి తలుపులు పెట్టి.. సమోసాలు విక్రయించేందుకు వెళ్లేవాడు. గత రెండు నెలలుగా ఇదే తంతు కొనసాగుతోంది. రోజూ ఆమె కేకలు వేస్తుండడంతో.. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు, మీడియాకు తెలపడంతో వ్యవహారం బయటపడింది. ఐసీడీఎస్‌ అధికారుల ఫిర్యాదు మేరకు బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువతిని ఆస్పత్రికి తరలించారు.

టాప్ హెడ్ లైన్స్

Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget