అన్వేషించండి

చేసే ప్రతి పని ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేయాలి- అద్దంకి కేడర్‌కు జగన్ సూచన

ప్రతి సచివాలయం పరిధిలో కనీసం రెండు రోజులు గడపగడపకూ కార్యక్రమం చేపట్టాలని, కనీసం రోజుకు 6 గంటలు ఉండాలని, అంటే రెండు రోజుల్లో 12 గంటలపాటు ఆ సచివాలయంలో తిరగాలన్నారు.

బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన సీఎం,పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. సమావేశంలో ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడిన సీఎం వారి అభిప్రాయాలను తీసుకున్నారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం జాగ్రత్త అంటూ కుశల ప్రశ్నలు కూడా వేయటంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన మంచిని గణాంకాలతో సహ ముఖ్యమంత్రి వివరించారు. మరో 19 నెలల్లో ఎన్నికలు రానున్నాయని పార్టీని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై వేసే ప్రతి అడుగూ ఎన్నికల దిశగా ఉండాలన్నారు సీఎం. నియోజకవర్గంలో టీడీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉందని... నియోజకవర్గంలో కచ్చితంగా మార్పు వస్తుందన్నారాయన. 

డీబీటీ ద్వారా ప్రతి ఇంటికీ మేలు చేశాం... ఈ నియోజక వర్గంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.1081కోట్లు ఇచ్చాం, 93,124 కుటుంబాలకు మేలు చేశామని జగన్ అన్నారు. 6,382 మందికి ఇళ్లు, 9,368 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 47,123 మందికి బియ్యం కార్డులు మంజూరు చేశామని ఇది చరిత్రలో జరగలేదన్నారు. ఈ స్థాయిలో ఇంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావు లేకుండా చేశామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా, ఏ ఒక్కరూ మిస్‌ కాకుండా ఆయా కుటుంబాలకు మంచి చేశాం, బటన్‌ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేశామన్నారు. 

చేసిన మంచిని ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ వివరిస్తూ, వారికి లేఖలు ఇస్తూ గడపగడపకూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, మంచి స్పందన కూడా వస్తుందన్నారు సీఎం. మన ప్రతినిధిగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఇంట్లో జరిగిన మంచిని ఆయా కుటుంబాలకు వివరిస్తున్నా మీకు ధన్యవాదాలు అని జగన్ కొనియాడారు. ఎక్కడైనా పొరపాటున అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఉంటే అటువంటి వాళ్లకీ మళ్లీ మంచి చేయాలన్నదే ఈ గడపగడపకూ కార్యక్రమం ఉద్దేశంగా వివరించారు. అందరికీ మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో అడుగులు ముందుకేస్తున్నాం కాబట్టి మనకు అంతా మంచే జరుగుతుందని వివరించారు. 

ప్రతి గ్రామ సచివాలయానికీ రూ.20లక్షలు ఇచ్చాం కాబట్టి, ప్రాధాన్యతగా గుర్తించిన పనులకు ఈ నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు జగన్. ప్రతి సచివాలయంలో కనీసం రెండు రోజులు గడపగడపకూ కార్యక్రమం చేపట్టాలని, కనీసం రోజుకు 6 గంటలు ఉండాలని, అంటే రెండు రోజుల్లో 12 గంటలపాటు ఆ సచివాలయంలో తిరగాలన్నారు. దీనివల్ల ప్రాధాన్యతగా చేపట్టాల్సిన పనులను గుర్తించగలుగుతామని, అన్నిరకాలుగా మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే, ఎన్నికలకు దాదాపుగా రెండేళ్లకు ముందే నాయకులను ఈ విధంగా తిప్పిన కార్యక్రమం గతంలో ఎన్నడూ లేదని జగన్ అభిప్రాయ పడ్డారు.  

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలకు ఎలాంటి సాధకబాధకాలు ఉన్నా వాటిని పరిష్కరించే విధంగా ఉండాలన్నారు జగన్. ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ, అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం మంచి విజయాలు సాధిస్తామని, ముఖ్యమంత్రిగా  డీబీటీ ఇవ్వడం అయితేనేం, స్కూళ్లు బాగుచేయడం, ఆస్పత్రులు బాగుచేయడం అయితేనేం, వ్యవసాయం బాగుండేలా చూడటం.. ఇలా తాను చేయాల్సింది చేశాననని అదే సమయంలో మీరు చేయాల్సింది మీరు చేయాలన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget