అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Nellore News : నెల్లూరు థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం, మూడు యూనిట్లలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

Nellore News : నెల్లూరు జిల్లా నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. యాష్ హ్యాండ్లీగ్ ప్లాంట్ ఆఫర్ కూలిపోయింది. దీంతో మూడు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

Nellore News : అసలే విద్యుత్ సమస్యలతో అల్లాడిపోతున్న ఏపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ప్రధాన కేంద్రంగా ఉన్న నెల్లూరు జిల్లాలోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగింది. మూడు పవర్ జనరేషన్ పాయింట్లు నిలిచిపోయాయి. ప్రమాద సమయంలో అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. ఇదే సమయంలో ప్లాంట్ కు తీరని నష్టం వాటిల్లింది. మూడో విద్యుత్ పవర్ జనరేషన్ పాయింట్ లో ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో అసలే అరకొరగా ఉన్న విద్యుత్ ఉత్పత్తికి మరో ఇబ్బంది ఎదురైంది. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్వహణలో తలెత్తిన లోపాలు ప్రధాన కారణమని నిర్వాహకులు భావిస్తున్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులోని ప్రధానమైన ఆఫర్లు కూలిపోవడంతో ఆ ప్రాంతమంతా కల్లోలంగా మారింది. చిమ్నీల నుంచి బూడిద విరజిమ్ముతోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల నిర్వహణ లోపాల వల్ల ఈ నష్టం వాటిల్లినట్లు స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో మరోసారి రాష్ట్రానికి తీవ్ర విద్యుత్ సమస్య ఏర్పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రమాదంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

స్థానికుల్లో ఆందోళన 

గత కొద్దిరోజులుగా నిర్వహణ లోపం కారణంగా ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఆఫర్ కూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్లాంట్ మొత్తం బూడిదమయం అయింది. చిమ్నీ నుంచి బూడిద వెదజల్లుతోంది. ఈ బూడిద కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయని స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో ఏపీ జెన్కోలో 3 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 

అనధికారిక కోతలు

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అనధికారిక విద్యుత్ కోతలు (Power Cuts) పెరిగిపోయాయి. ఇటీవల తుపాను కారణంగా వాతావరణం చల్లబడటంతో విద్యుత్ డిమాండ్ తగ్గింది. ఈ కారణంగా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా (Power Supply) చేయగలిగారు. పరిశ్రమలకు ప్రకటించిన పవర్ హాలీడేను దాదాపుగా నెలన్నర తర్వాత ఎత్తివేశారు. అయితే ఇటీవల ఏపీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. గాలులు కూడా తోడయ్యాయి. దీంతో కరెంట్ వినియోగం పెరిగింది. పవర్ హాలీడే (Power Holiday ) ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించడంతో పరిశ్రమలు కూడా పూర్తి స్థాయిలో కరెంట్ వినియోగించుకుంటున్నాయి. దీంతో  విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా మళ్లీ పెరిగింది. 

Also Read : Power Cuts Again In AP : ఏపీలో మళ్లీ అనధికారిక విద్యుత్ కోతలు - డిమాండ్ పెరగడమే కారణం !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Weather Update Today:తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత - వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత - వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget