![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pawan Kalyan: పవన్ పైకి దూసుకొచ్చిన అభిమాని, కారుపై పడిపోయిన జనసేనాని
పవన్ కల్యాణ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ అభిమాని అత్యుత్సాహంతో పవన్ పైకి ఒక్కసారిగా దూసుకొచ్చాడు. దీంతో అభిమానులకు అభివాదం చేస్తున్న పవన్ కారుపై ఒక్కసారిగా పడిపోయారు.
![Pawan Kalyan: పవన్ పైకి దూసుకొచ్చిన అభిమాని, కారుపై పడిపోయిన జనసేనాని Narsapuram Janasena Fisherman Sabha Pawan kalyan fell down on car Video Viral Pawan Kalyan: పవన్ పైకి దూసుకొచ్చిన అభిమాని, కారుపై పడిపోయిన జనసేనాని](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/20/a7807c674209dfd827eba3a65749c404_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నర్సాపురం(Narsapuram) పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. అభిమాని అత్యుత్సాహంతో పవన్(Pawan) కు తృటిలో ప్రమాదం తప్పింది. రాజమహేంద్రవరం నుంచి నర్సాపురం ర్యాలీగా వస్తున్న పవన్ కల్యాణ్ కారుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో వెనుక నుంచి ఓ అభిమాని ఒక్కసారిగా దూసుకొచ్చాడు. అభిమాని లాగడంతో కారు(Car)పై నిల్చున్న పవన్ కల్యాణ్ కారుపైనే ఒక్కసారిగా జారిపడిపోయారు. వెంటనే తేరుకున్న పవన్ తిరిగి కారుపై నిలబడ్డారు. ఈ యువకుడ్ని భద్రతా సిబ్బంది పక్కకు లాగారు. ఈ ఘటనతో పవన్ ఒక్కసారిగా కంగుతిన్నారు. అనంతరం ర్యానిని యథావిధిగా కొనసాగించారు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జనసేన పార్టీ(Janasena) మత్స్యకార అభ్యున్నతి సభ నిర్వహిస్తుంది. ఈ సభకు హాజరయ్యేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి పవన్... రావులపాలెం, సిద్ధాంతం, పాలకొల్లు మీదుగా నర్సాపురం(Narsapuram) చేరుకున్నారు. ఈ సభ ముగిసిన అనంతరం పవన్ నర్సాపురం నుంచి రాత్రి 8 గంటలకు రాజమహేంద్రవరం(Rajahmahendravam) చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
నరసాపురం మత్స్యకార అభ్యున్నతి సభ లో పాల్గొనేందుకు రాజమండ్రి నుంచి భారీ ర్యాలీగా తరిలివస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు, అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్న జనసేన శ్రేణులు, ప్రజలు#JSPForAP_Fishermen pic.twitter.com/x35DwFBGTN
— JanaSena Party (@JanaSenaParty) February 20, 2022
మత్స్యకారుల అభ్యున్నతి పేరిట జనసేన చేపట్టిన మత్స్యకార అభ్యున్నతి యాత్ర తుది దశకు చేరింది. గత పది రోజులుగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ఈ యాత్రలో పాల్గొ్న్నారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా నర్సాపురంలో జనసేన పార్టీ భారీ సభ ఏర్పాటుచేసింది. ఈ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సభ కోసం గత రెండు రోజుల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నాయకులు ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. నర్సాపురం, రుస్తుంబాధ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జనసేన జెండాలతో కళకళలాడుతున్నాయి. సభా ప్రాంగణం వద్ద జనసేనాని భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. రాజమండ్రి చేరుకున్న పవన్ కల్యాణ్ జనసైనికుల ర్యాలీతో నర్సాపురం చేరుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)