Nara Lokesh: ఢిల్లీ నుంచి ఏపీకి రానున్న నారా లోకేష్, శుక్రవారం చంద్రబాబుతో ములాఖత్
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా గురువారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకుంటారు.
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా గురువారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం బయలుదేరి వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం ములాఖత్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును లోకేశ్ కలవనున్నారు. చంద్రబాబు అరెస్టు పరిణామాల అనంతరం న్యాయనిపుణులతో చర్చించేందుకు లోకేశ్ ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 14న లోకేష్ ఢిల్లీ వెళ్లారు. 20 రోజుల పాటు అక్కడే ఉన్నారు.
లోకేష్ ఢిల్లీలో ఏం చేశారంటే?
నారా లోకేష్ ఢిల్లీలో పార్టీ అంతర్గ సమావేశాలు నిర్వహించారు. మొదటి రెండు రోజులు జాతీయ మీడియాలకు ఇంటర్యూలు ఇచ్చారు. అయితే లోకేష్ న్యాయపరమైన అంశాల్లో చురుగ్గా ఉన్నారు. వ్యక్తిగత పనులపై విదేశాల్లో ఉన్న ప్రముఖ లాయర్ హరీష్ సాల్వేను చంద్రబాబు కేసులో వాదించేందుకు ఆయన ఒప్పించారు. తరువాతం బీజేడీ, శివసేన, హర్యానా డిప్యూటీ సీఎం వంటి ప్రముకులు లోకేష్‌కు సంఘీభావం తెలిపారు. ప్రధాని మోదీ లేదా హోంమంత్రి అమిత్ షాలను కలిసే ప్రయత్నం చేయలేదు. కానీ తమ పార్టీకి మద్దతు తెలుపుతున్న వారికి మాత్రం సమయం ఇచ్చారు.
స్కిల్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పొడిగింపు
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముందస్తు బెయిల్‌ను అక్టోబర్ 12కు హైకోర్టు పొడిగించింది. లోకేష్ ముందస్తు బెయిల్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా... లోకేష్ ముందస్తు బెయిల్ ఈ రోజుతో ముగుస్తుందని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు. తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేవని సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేయాలని కోర్టును అడ్వకేట్ జనరల్ కోరారు. దీంతో అప్పటి వరకూ లోకేష్‌కు ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఫైబర్ గ్రిడ్ ఎఫ్ఐఆర్‌లో అసలు లోకేష్ పేరు లేదన్న సీఐడీ
నిన్న జరిగిన విచారణలో ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం నారా లోకేష్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో లోకేష్‌ను అరెస్ట్ చేస్తారనే ఆందోళన తమకుందని లోకేష్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే లోకేష్‌ను ఇంతవరకూ ఫైబర్ గ్రిడ్ కేసులో నిందితుడిగా చేర్చలేదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. ఒకవేళ చేరిస్తే ఆయనకు సీఆర్‌పీసీలోని 41ఏ కింద నోటీసులు ఇస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. 41ఏ నిబంధనలు పాటించకపోతే కోర్టుకు విన్నవిస్తామన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కేసులో పదో తేదీన లోకేష్ సీఐడీ విచారణ
ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ సవాల్ చేశారు. లోకేష్ సీఐడీ విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సీఐడీ ఇచ్చిన 41 ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హెరిటేజ్ డాక్యుమెంట్లు అడిగారని.. లోకేష్ హెరిటేజ్‌లో షేర్ హోల్డర్లు మాత్రమేనన్నారు.
వాటిని లోకేష్ ను ఇవి అడగడం సమంజసం కాదని సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని, బుధవారమే విచారణకు హాజరు కావాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. అయితే అంత తొందర ఏముందని లోకేష్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనల అనంతరం ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటి వరకూ అరెస్టు చేసే అవకాశం లేదు.