అన్వేషించండి

Lokesh : రెండు రోజులు పాదయాత్రకు విరామం ఇచ్చి కోర్టుకు హాజరు కానున్న నారా లోకేష్ - అసలేమయిందంటే ?

వైసీపీ నేతలపై నారా లోకేష్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోర్టులో దావా వేశారు. వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు హాజరు కానున్నారు.


  
Lokesh :  సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వైఎస్ఆర్‌సీపీకి చెందిన  గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి, పోతుల సునీత‌ల‌పై క్రిమిన‌ల్ కేసులు దాఖ‌లు చేశారు నారా లోకేష్. ఈ కేసుల విషయంలో  మంగ‌ళ‌గిరి అడిషిన‌ల్ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వ‌నున్నారు.  కోర్టుకి హాజ‌ర‌వుతున్న కార‌ణంగా 13,14 తేదీల‌లో యువ‌గ‌ళం పాద‌యాత్రకి విరామం ఇచ్చారు. త‌న‌పైనా, త‌న కుటుంబంపైనా అస‌త్య ఆరోప‌ణ‌ల‌ని ప్రచారం చేస్తున్న వైసీపీ నేత‌ల ఫేక్ ప్రచారం పై టిడిపి జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ న్యాయ‌పోరాటం మొద‌లుపెట్టారు. 

సోషల్ మీడియాలో లోకేష్ ని టార్గెట్ చేసుకుని ఫేక్ ప్రచారం 

వైసీపీ నేత‌లు, సోష‌ల్ మీడియా బాధ్యులు కూడా త‌న‌ని టార్గెట్ చేస్తూ చేసిన అస‌త్య ప్రచారంపై క్రిమిన‌ల్ కేసులు దాఖ‌లు చేశారు.  వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ  చీఫ్‌ డిజిటల్ డైరక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు  లోకేష్ పిన్ని కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య స‌మ‌స్యల‌తో బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడ్డారు.  ఈ ఆత్మహ‌త్యపై వైసీపీ సోష‌ల్ మీడియా కోఆర్డినేట‌ర్ గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి లోకేష్‌పై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు. ఉమామహేశ్వరి మరణానికి జూబ్లీ రోడ్డు నెం.45 సర్వే నెం. 273, 274, 275, 276 లలోని 5.73 ఎకరాల భూమి వివాదమే కారణం అని త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా  ప్రచారం చేశారు.  ఆ వివాదం, ఆ సర్వే నంబర్లూ ఫేక్ అని తేలింది. 

కొత్త కొత్త ఆరోపణలతో దేవేందర్ రెడ్డి ప్రచారం

తన ఆరోపణలు ఫేక్ అని తెలిసినా  గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి మరో కట్టుకథ అల్లి ప్రచారంలో పెట్టారు. హెరిటేజ్ లో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఉమామహేశ్వరిని మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తప్పుడు రాతలు రాశారు.  త‌ప్పుడు రాత‌లపై గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డికి త‌న లాయ‌ర్ దొద్దాల కోటేశ్వర‌రావు ద్వారా నోటీసులు పంపారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ  ఛీఫ్ డిజిటల్ డైరక్టర్ గా ప‌నిచేస్తుండ‌డంతో ఆయా కార్యాల‌యాల‌కు నోటీసులు పంపితే తీసుకోలేదు.  చివ‌రికి గుర్రంపాటికి వాట్స‌ప్ ద్వారా నోటీసులు పంపారు. 

చంద్రబాబు కుటుంబంపై పోతుల సునీత తీవ్ర ఆరోపణలు

సెప్టెంబ‌రు 2022లో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత  నారా చంద్రబాబుని సారా  చంద్రబాబు నాయుడు అని పిలవాలని పిలుపునిచ్చారు.  హెరిటేజ్ సంస్ధ ద్వారా వ్యాపారం చేస్తున్నామని చెబుతూ సారా పరిశ్రమ నడుపుతున్నారని ఆమె ఆరోపించారు. బీ-3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని, వీరు రాష్ట్రంలో సారా ఏరులై పారించి కోట్లు గడించారని త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారు.  భువనేశ్వరి, బ్రాహ్మణి కొట్టుకున్నారని,  లోకేష్‌కి మగువ, మందు లేనిదే నిద్ర పట్టదంటూ.. చంద్రబాబు, లోకేష్ లకు మందు తాగనిదే మాట పెగలదని సునీత‌ ఆరోపింారు.  

అన్నింటినీ సాక్ష్యాధారాలతో కోర్టులో సమర్పించిన లోకేష్

వ్యక్తిగ‌త‌, రాజ‌కీయ ప్రయోజ‌నాల కోసం త‌న‌పైనా, త‌న కుటుంబంపైనా పోతుల సునీత చేసిన దారుణ‌మైన త‌ప్పుడు వ్యాఖ్యలపై నారా లోకేష్ మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖ‌లు చేశారు. గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి, పోతుల సునీత‌ల‌పై దాఖ‌లు చేసిన కేసుల్లో ఐపిసి సెక్షన్ 499, 500 ప్రకారం క‌ఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ కేసులో పిటిష‌న‌ర్ అయిన నారా లోకేష్ వాంగ్మూలాన్ని మంగ‌ళ‌గిరి అడిషిన‌ల్ మేజిస్ట్రేట్ కోర్టులో 14వ తేదీ శుక్రవారం న‌మోదు చేయ‌నున్నారు.  యువ‌గ‌ళం పాద‌యాత్రలో ఉన్న నారా లోకేష్ 12న పాదయాత్ర ముగించుకొని బ‌య‌లుదేరి అమ‌రావ‌తి రానున్నారు. కోర్టు ప‌నిమీద వ‌స్తుండ‌డంతో యువ‌గ‌ళం పాద‌యాత్రకి 13,14వ తేదీల‌లో విరామం ప్రక‌టించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Starlink Vs Russia: ఎలాన్ మస్క్‌కు రష్యా గండం - స్టార్ లింక్ శాటిలైట్లపై పుతిన్ కన్ను - ఇక విధ్వంసమేనా?
ఎలాన్ మస్క్‌కు రష్యా గండం - స్టార్ లింక్ శాటిలైట్లపై పుతిన్ కన్ను - ఇక విధ్వంసమేనా?
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Embed widget