By: ABP Desam | Updated at : 16 Feb 2023 06:44 PM (IST)
సీఎం జగన్ కు నారా లోకేష్ డిఫరెంట్ సవాల్
Lokesh On CM Jagan : పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ సీఎం జగన్‌కు ఓ సవాల్ విసిరారు. నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చానని చెప్పుకోగలవా? ఒక్క ఉద్యోగమైనా ఇప్పించగలిగానని ప్రకటించగలవా? అని ప్రశ్నించారు. దీనికి కారణం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్‌కు డిక్సన్ అనే కంపెనీ ఉద్యోగులతో వెళ్తున్న బస్సు ఎదురయింది. ఆ బస్సులో కి ఎక్కిన లోకేష్ ఉద్యోగినుతో మాట్లాడారు. విశేషం ఏమిటంటే..లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ డిక్సన్ కంపెనీని తీసుకొచ్చారు. ఉత్పత్తి ప్రారంభించారు. అందుకే లోకేష్ ఈ తరహా సవాల్‌ను సీఎం జగన్‌కు విసిరారు.
My heart swelled with pride to see these sisters go to work at Dixon which I brought to AP. They invested 100 Crs and created 1000 direct and 5000 indirect employment. I challenge @ysjagan to show that he created one such job in the last 4 years.#YuvaGalamPadayatra pic.twitter.com/O619lhcSMg
— Lokesh Nara (@naralokesh) February 16, 2023
సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతున్న సమయంలో లోకేష్‌కు ఎదురుగా డిక్సన్ కంపెనీ బస్సు కనిపించింది. ఆ బస్సు లో మహిళా ఉద్యోగినులు డ్యూటీకి వెళ్తున్నారు.లోకేష్ వారితో మాట్లాడిన తర్వాత తన స్పందనను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు.
మహిళా ఉద్యోగుల మోముల్లో నన్ను చూసిన ఆనందం. నా కళ్ల వెంబడి ఆనందభాష్పాలు అప్రయత్నంగానే రాలాయి. నాలుగేళ్ల క్రితం నేను ఐటీ-ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రిగా తీసుకొచ్చిన కంపెనీ ఈ రోజు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. నేను ఇప్పుడు పదవిలో లేను. కానీ నా ప్రయత్నం వేలాది మంది జీవితాలకు ఉపాధి మార్గం చూపింది. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే ఒక వనరు అయ్యింది. ఆంధ్ర అభివృద్ధిలో డిక్సన్ కూడా ఒక భాగమైందని సంతోషం వ్యక్తం చేశారు.
``చిలుకను పెంచాను ఎగిరిపోయింది. ఉడుతను పెంచాను. పారిపోయింది. మొక్కను పెంచాను. ప్రస్తుతం ఆ రెండూ వచ్చి చేరాయి`` అని మిసైల్ మేన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన నిత్యసత్యం నేను నమ్మే సిద్ధాంతం. మీలాంటి వారి విమర్శలు-ఆరోపణలు-హేళనలకు వెరవకుండా అష్టకష్టాలు పడి తెచ్చిన కంపెనీలు పచ్చని చెట్లు అయ్యాయి. ఈ నీడన ఉపాధి దొరుకుతోంది. ఇంతకుమించిన ఆనందం ఏముంటుందని లోకేష్ వ్యాఖ్యానించారు.
అప్పట్లో డిక్సన్ 100 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీ వల్ల 1000 మందికి ప్రత్యక్షంగా, 5000 పరోక్ష ఉపాధి దొరికింది. నేను పదులసంఖ్యలో కంపెనీలు తెచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించాను. అన్ని కాకపోయినా ఒక్క కంపెనీ తెచ్చి యువతకి ఉపాధి కల్పించి చూపించగలవా మిస్టర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డీ అని లోకేష్ సవాల్ చేశారు.
వైఎస్ఆర్సీపీ గృహసారథులకు టీడీపీ సాధికార సారథులతో చెక్ - కొత్త వ్యవస్థను ప్రకటించిన చంద్రబాబు !
Visakha G20 Summit : ఈ నెల 28, 29న విశాఖలో జీ20 సదస్సు, హాజరుకానున్న 69 మంది విదేశీ ప్రతినిధులు
Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుదలతో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు
Mlc Dokka Vara Prasad : సస్పెండ్ చేయగానే టీడీపీ నినాదం, ఇంతకన్నా ఫ్రూప్ ఏంకావాలి- ఉండవల్లి శ్రీదేవికి డొక్కా కౌంటర్
MLA Maddali Giridhar: "క్రాస్ ఓటింగ్ కోసం టీడీపీ నేతలు నన్నూ సంప్రదించారు, కావాలంటే కాల్ డేటా చూడండి"
Divya Darshan Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, కాలినడకన వచ్చే వారికి దివ్యదర్శనం టోకెన్లు జారీ!
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!