Perni Nani On Chandrababu : ఐటీ నోటీసులపై చంద్రబాబు నోరు విప్పాలి - పేర్ని నాని డిమాండ్
ఐటీ నోటీసులపై చంద్రబాబు నోరు విప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో అవినీతి చేశారని ఆరోపించారు.
Perni Nani On Chandrababu : ఐటీ నోటీసులు వ్యవహారం లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి పేరు నాని డిమాండ్ చేశారు. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఓ పత్రికలో చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయన్న కథనం వచ్చిందన్నారు. ప్రతి ఏటా చంద్రబాబు తన ఆస్తుల చిట్టా ని ప్రకటించటం ఆనవాయితీగా పెట్టుకున్నారు , అందులో తన ఆస్తుల వివరాలను ఎందుకు చెప్పలేదని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన భార్య ఆస్తుల వివరాలు అషాఢభూతి లాగా ప్రకటనలు ఉంటాయని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అవినీతిపై ఇంగ్లిష్ పత్రికలో కథనం : పేర్ని నాని
చంద్రబాబు అవినీతి భాగోతం పై ఆంగ్ల పత్రిక లో వార్త ప్రచురణ చేశారని పేర్ని నాని పేపర్ కటింగ్ చూపించారు. అమరావతి రాజధాని బయోస్కోప్ కధలు ఒకొక్కటి బయటకు వస్తున్నాయన్నారు. చంద్రబాబు భాగోతం 2016 నుండి 2019 వరకూ బయటకు రావాల్ిస ఉందన్నారు. ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజి సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చినందుకు రూ. 118 కోట్ల లంచం డబ్బులు వసూలు చేశారని ఐటీ అధికారులు గుర్తించారని పేర్ని నాని ఆరోపించారు. ఈ డబ్బు అంతా ఒక వ్యక్తి నుండి వచ్చిన లంచం డబ్బు మాత్రమేనని .. ఆస్తుల ప్రకటన లో చంద్రబాబు ఈ నిధులను ఎందుకు ప్రకటించలేదని పేర్ని నాని ప్రశ్నించారు.
మీడియా సంస్థలు ఈ నోటీసులు ఎందుకు పట్టించుకోలేదన్న పేర్ని నాని
అన్ని తెలిసే చంద్రబాబు కు మోడీ,అమిత్ షా, భారతి , విజయమ్మ తో జగన్ ఏమి మాట్లాడినా కనిపెట్టే మీడియా సంస్థలు ఈ నోటీసుల గురించి ఎందుకు పట్టించుకోలేదని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు గుర్తుపెట్టుకోండి, ఎన్టీఆర్ ఆత్మ మిములను వెంటాడుతోందని హెచ్చరించారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చారా ఇవ్వలేదా..నిజమా కాదా.. నోరు తెరవాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా కాదా..అని చంద్రబాబు ని ప్రశ్నించారు. చంద్రబాబు కు దమ్ముంటే మాట్లాడాలన్నారు. 2022 సెప్టెంబర్ లొనే నోటీసులు వస్తే ఎందుకు దాచారో చెప్పాలన్నారు.
జనం సొమ్మును తండ్రీ కొడుకులు తిన్నారు : పేర్ని నాని
జనం సొమ్మును హాల్వా తిన్నట్లు తండ్రీకొడుకులు తిన్నారని, లోకేష్ పాదయాత్ర అపి తన తండ్రి అవినీతి పై మాట్లాడాలన్నారు. అమరావతి పేరుతో ప్రతీది లంచం తీసుకున్నారని.. పోగేసుకోని తిన్నారని ఫైర్ అయ్యారు. కేవలం అమరావతి రాజధాని లొనే ఇంత అవినీతి ఉంటే మిగిలిన పనుల్లో ఎంత ఎంత తిన్నారో, అని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలు చేశారని భవిష్యత్ గ్యారెంటీ, పేరుతో మరో సారి దోచుకునేందుకు రెడీ అయ్యారని విమర్శించారు. 2014 లో ఇచ్చిన హామీ పత్రం ఏమి అయ్యిందో చంద్రబాబు చెప్పాలన్నారు..
మనిషి మాట్లాడాల్సిన మాటలు అయ్యన్న మాట్లాడలేదన్న పేర్ని
మనిషి మాట్లాడాల్సిన మాటలు అయ్యన్న పాత్రుడు మాట్లాడలేదని.. ల తీవ్ర పదజాలంతో దూషించారు, అందుకే మా హక్కులను కాపడుకోవటానికి పోలీసులు కి ఫిర్యాదు చేశామని పేర్ని నాని అన్నారు. టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. షర్మిల సోనియా గాంధీ ని కలవటం పై కూడా పేర్ని నాని స్పందించారు. షర్మిల ఒక పార్టీ నాయకురాలని, ఆమెది ఒక స్వతంత్ర రాజకీయ పార్టీ ఆమె నిర్ణయాలు ఆమె ఇష్టం..అని పేర్కొన్నారు..షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లోకి వస్తారనే ప్రచారం పై ... జగన్ జనం గుండెల్లో ఉన్నారు, ఎవరు వచ్చిన ఏమి ఉంటుందని అన్నారు. రాజకీయ పార్టీలు వస్తుంటాయి.. విలీనం అవుతాయని అన్నారు