MLA Anam : పోలీసుల్లో కలుపు మొక్కల్ని తొలగిస్తేనే వ్యవస్థ బలోపేతం.. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు !
పోలీసు వ్యవస్థ మాఫియాతో చేతులు కలిపిందని ఎమ్మెల్యే ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసుల్లో కలుపు మొక్కల్ని తొలగించాలన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోకల్ మాఫియాలతో పోలీసులు చేతులు కలిపారని ఆరోపించారు. నక్సలిజం.. టెర్రరిజం తగ్గిందని ఇక లోకల్ మాఫియాలు పోవాల్సి ఉందన్నారు. లోకల్ మాఫియాలతో పోలీసులు చేతులు కలిపారని.. అలా చేయడం వల్ల సామాన్యులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఈ లోకల్ మాఫియాలు గత ప్రభుత్వంలోనే కాదు ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలంటే.. కలుపు మొక్కలను తొలగించాలని ఆయన సలహా ఇచ్చారు.
Also Read: ఆనందయ్య ఒమిక్రాన్ మందుకు ఎదురుదెబ్బలు, ప్రభుత్వం నుంచే.. పంపిణీ సాగేనా?
ఆనం రామనారాయణ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. కొంత కాలంగా నేరుగా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయనప్పటికీ పరోక్షంగా అధికారయంత్రాంగంపై విమర్శల ద్వారా వెళ్లగక్కుతున్నారు. ఓ సారి మాఫియా గ్యాంగ్‌లు, గ్యాంగ్‌స్టర్‌లకు నెల్లూరును అప్పగించేశారని విమర్శించారు. నెల్లూరులో పని చేయాలంటేనే అధికారులు భయపడుతున్నారని, అయిదేళ్ళలో నలుగురు ఎస్పీలు మారిన ఘనత నెల్లూరుకే దక్కిందంటూ ఘాటుగా విమర్శించారు. ఇసుక నుంచి క్రికెట్ బెట్టింగ్ నుంచి యధేచ్ఛగా సాగుతున్న పోలీసులు సైతం అచేతనం అయిపోయారంటూ మండిపడ్డారు.
Also Read: మందు బాబులకు గుడ్ న్యూస్.. మద్యం విక్రయ వేళలు పొడిగింపు.. న్యూ ఇయర్ కు తగ్గేదేలే అంటారేమో..
ఈ మాఫియా వ్యాఖ్యలు చేసినప్పుడు వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే.. తర్వాత పరిస్థితి సద్దు మణిగింది. ఆ తర్వాత కూడా అధికార యంత్రాంగంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఓ సారి జలవనరుల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని..ఆ లెక్కలేమిటో తేల్చాలని డిమాండ్ చేశారు. 23 జిల్లాలకు మంత్రిగా చేసిన తనకు, ఎమ్మెల్యే పదవి అలంకారమేనని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెనుకాడనని ఆయన గతంలోనే ప్రకటించారు.
Also Read: వాషింగ్ మెషిన్‌లో ఇంటి తాళాలు.. అయినా దర్జాగా చోరీ చేసి, అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే..?
నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. పది ఎమ్మెల్యే స్థానాలనూ గెల్చుకుంది. అయితే గెలిచిన వారి మధ్య సఖ్యత లేకపోవడంతో ఆ పార్టీలో గ్రూపులు ప్రారంభమయ్యాయి. ఈ వ్యవహారాల వల్లే ఆనం అసంతృప్తికి గురయ్యారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: మందు రెడీ .. రెండు రోజుల్లో ఒమిక్రాన్ తగ్గిస్తా..! నెల్లూరు ఆనందయ్య చాలెంజ్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి