అన్వేషించండి

Minister Savitha: లోకేష్‌పై ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా - జగన్‌కు మంత్రి సవిత సవాల్

TDP : లోకేష్‌పై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని మంత్రి సవిత సవాల్ చేశారు. నిరూపించలేకపోతే రాజీనామా చేయాలన్నారు.

Minister Savita challenges jagan:  తల్లికి వందనం పథకం అమలుతో పేద విద్యార్థుల ఇళ్లలో ఆనందం వ్యక్తమవుతోందని  మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంతో, జగన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులకే ఓర్వలేకపోతున్నారని,  మంత్రి నారా లోకేశ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి లోకేశ్ పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని, లేకుంటే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా..? అని జగన్ ను మంత్రి సవిత సవాల్ విసిరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 

సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ముఖ్యమైన తల్లికి వందనం పథకాన్ని సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ముందుగానే చెప్పిన విధంగా పాఠశాలలు ప్రారంభం రోజున ఈ పథకానికి సీఎం చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేశామన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం కింద అర్హులైన 67,27,164 మంది విద్యార్థులను గుర్తించామన్నారు. వారందరికీ రూ.10,091 కోట్లు వెచ్చించామన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.13 వేల చొప్పున రూ.8,745 కోట్లను నేరుగా వారి తల్లుల ఖాతాలో జమచేశామన్నారు. మిగిలిన రూ.2 వేలు చొప్పున రూ. రూ.1,346 కోట్లను పాఠశాలల అభివృద్ధికి కేటాయించామన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారని మంత్రి సవిత వెల్లడించారు. ఒకరుంటే రూ.13 వేలు, ఇద్దరుంటే రూ.26 వేలు, ముగ్గురుంటే రూ.39 వేలు, నలుగురుంటే రూ.52 వేలు, అయిదుగురుంటే రూ.65 వేలు తల్లుల ఖాతాలో జమ చేశామన్నారు. 

తల్లి ప్రేమకు జగన్ పరిమితి పెడితే, తమ ప్రభుత్వం తల్లి ప్రేమకు హద్దుల్లేకుండా తల్లికి వందనం పథకం అమలు చేస్తోందని మంత్రి సవిత వెల్లడించారు. 2019 ఎన్నికల్లో ఇద్దరు పిల్లలకు అమ్మఒడి పథకం అందజేస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చి, మాటతప్పారని మండిపడ్డారు. ఇంట్లో ఇద్దరకు ముగ్గురు పిల్లులున్నా కేవలం ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం కింద రూ.13 వేలు అందజేశారన్నారు. 2022-23లో 42,61,965 మంది విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి పథకం కింద వర్తింపజేశారన్నారు. వారందకీ అప్పట్లో రూ.5,540 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో అదనంగా 24,65,199 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తింప జేశామన్నారు. గత ప్రభుత్వం కంటే అదనంగా రూ.3,205 కోట్లు కేటాయించామన్నారు.  

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వాలే వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని మంత్రి సవిత గుర్తు చేశారు. తల్లికి వందనం పథకంతో పాటు పాఠశాలల ప్రారంభం రోజున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర పథకం కింద విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒక్కో కిట్టు విలువ రూ.2,279లని, ఆ కిట్టులో పాఠ్య పుస్తకాలు, వర్క్, నోట్‌బుక్‌లు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ, 3 జతల యూనిఫారం, బ్యాగ్, బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్‌ ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు కడుపు నింపడమే కాదు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నామన్నారు. పిల్లలు కూడా సంతోషంగా భోజనం చేస్తున్నారన్నారు. గత వైసీపీ హయాంలో పాఠశాలలు, వసతి గృహాలకు, గోదాముల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ముతక బియ్యాన్ని సరఫరా చేశారని తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం పథకం అమలుచేస్తున్నామన్నారు. 2014-19లోనూ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేశామని, జగన్ రెడ్డి ఆ పథకాన్ని నిలిపేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు.  

తల్లికి వందనం పథకం అమలుతో జగన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయ్యిందని, దీంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని మంత్రి సవిత మండిపడ్డారు. తల్లికి వందనం పథకంలోని రూ.2 వేలు మంత్రి లోకేశ్ జేబులోకి వెళ్లాయని తప్పుడు ఆరోపణలు చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో మీరు చేసిన అవినీతిని మంత్రి లోకేశ్ పైకి నెట్టడం సరికాదన్నారు. మంత్రి లోకేశ్ పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని, లేకుంటే పులివెందుల ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తావా.. అని జగన్ కు మంత్రి సవాల్ విసిరారు. అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు, సానుభూతి పునాదుల మీదే జగన్ రాజకీయ జీవితాన్ని నిర్మించుకుంటున్నాడన్నారు. 
  
మహిళలంటే జగన్ కు గౌరవం లేదని, తల్లిని, చెల్లెళ్లను, రాష్ట్రంలో ఆడ బిడ్డలను ఏడిపిస్తున్నాడని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతదేహాల దగ్గరికి వెళ్లి నవ్వుతాడని, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి కుళ్లి కుళ్లి ఏడుస్తున్నాడని అన్నారు. కూటమి ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న మెగా డీఎస్సీని అడ్డుకోడానికి జగన్ కుట్రపన్నాడన్నారు. డీఎస్సీని అడ్డుకోడానికి 24 కేసులు వేశారన్నారు. చివరికి సుప్రీం కోర్టులో కూడా కేసు వేస్తే, దేశ అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసిందని తెలిపారు. ప్రజలు గట్టి గుణపాఠం చెప్పినా జగన్ రెడ్డికి బుద్ధి రాలేదని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. 
  

 

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
AP DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ - లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణకు రోజా, పేర్ని నాని డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ - లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణకు రోజా, పేర్ని నాని డిమాండ్!
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
Breaking News: నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget