అన్వేషించండి

Minister Atchennaidu: 'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు

Agricultural Budget: ఏపీ అసెంబ్లీలో రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసిందని మండిపడ్డారు.

Minister Atcehnnaidu Submitted Agricultural Budget: రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిదని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు (Atchennaidu) తెలిపారు. ఏపీ అసెంబ్లీలో సోమవారం ఆయన రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను (Agricultural Budget) ప్రవేశపెట్టారు. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యమిస్తున్నామని.. ఇందు కోసం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తామని చెప్పారు. రైతులకు విత్తనాలు, సూక్ష్మ ఎరువులు రాయితీపై అందిస్తున్నామన్నారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

వ్యవసాయ బడ్జెట్ పూర్తి వివరాలు

  • రాయితీ విత్తనాలు - రూ.240 కోట్లు
  • భూసార పరీక్షలకు - రూ.38.88 కోట్లు 
  • విత్తనాల పంపిణీ - రూ.240 కోట్లు
  • ఎరువుల సరఫరా - రూ.40 కోట్లు
  • పొలం పిలుస్తోంది - రూ.11.31 కోట్లు
  • ప్రకృతి వ్యవసాయం - రూ.422.96 కోట్లు
  • డిజిటల్‌ వ్యవసాయం - రూ.44.77 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ - రూ.187.68 కోట్లు
  • అన్నదాత సుఖీభవ  - రూ.4,500 కోట్లు
  • రైతు సేవా కేంద్రాలకు - రూ.26.92 కోట్లు
  • వడ్డీ లేని రుణాలకు - రూ.628 కోట్లు
  • ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ - రూ.44.03 కోట్లు
  • వ్యవసాయ శాఖ - రూ.8,564.37 కోట్లు
  • ఉద్యాన శాఖ - రూ. 3469.47 కోట్లు
  • పట్టు పరిశ్రమ - రూ.108.4429 కోట్లు
  • పంటల బీమా - రూ.1,023 కోట్లు
  • వ్యవసాయ మార్కెటింగ్ - రూ.314.80 కోట్లు
  • సహకార శాఖ - రూ.308.26కోట్లు
  • ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం - రూ.507.038 కోట్లు
  • ఉద్యాన  విశ్వవిద్యాలయం - రూ.102.227 కోట్లు
  • ఉచిత వ్యవసాయ విద్యుత్ - రూ.7241.30 కోట్లు
  • ఉపాధి హామీ అనుసంధానం - రూ.5,150కోట్లు
  • ఎన్టీఆర్ జలసిరి - రూ.50 కోట్లు
  • నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ - రూ.14,637.03 కోట్లు
  • శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం - రూ.171.72 కోట్లు
  • మత్స్య విశ్వవిద్యాలయం - రూ.38 కోట్లు
  • పశుసంవర్ధక శాఖ - రూ.1,095.71 కోట్లు
  • మత్స్య రంగం అభివృద్ధి - రూ.521.34 కోట్లు కేటాయించారు.

రూ.2,94,427.25 కోట్లతో బడ్జెట్

అటు, 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం రూ.2,94,427.25 కోట్లతో బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తన తొలి బడ్జెట్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఆర్థిక ప్రగతి, సంక్షేమాన్ని సమానంగా ప్రజలకు అందించేందుకు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,35,916.99 కోట్లు కాగా.. మూలధన వ్యయం అంచనా రూ.32,712.84 కోట్లు. రెవెన్యూ లోటు రూ.34,743.38 కోట్లుగా అంచనా వేశారు. ద్రవ్య లోటు రూ.68,742.65 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.)లో రెవెన్యూ లోటు 4.19 శాతంగానూ ద్రవ్యలోటు 2.12 శాతంగానూ ఉండవచ్చని అంచనా కట్టారు. యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ- రూ. 322 కోట్ల, పోలీసు శాఖ- రూ. 8,495 కోట్లు, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ - రూ. 687 కోట్లు, రవాణా, రోడ్లు, భవనాల శాఖ- రూ. 9,554 కోట్లు, ఇంధన శాఖ - రూ. 8,207 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ- రూ. 3,127 కోట్లు కేటాయించారు. ఇంకా వివిధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేశారు.

Also Read: YS Sharmila: 'అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది' - మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: పట్నం నరేందర్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేటీఆర్, కొండగల్ నుంచే రేవంత్ రెడ్డి భరతం పడతామంటూ ఫైర్
పట్నం నరేందర్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేటీఆర్, కొండగల్ నుంచే రేవంత్ రెడ్డి భరతం పడతామంటూ ఫైర్
Andhra Pradesh News: సోషల్‌ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- కేసులు పెడితే తప్పేంటని ప్రశ్న
సోషల్‌ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- కేసులు పెడితే తప్పేంటని ప్రశ్న
AP DSC 2024: ఏపీ డీఎస్సీపై కీలక ప్రకటన -అందుకే నోటిఫికేషన్ ఆలస్యమన్న మంత్రి లోకేష్
ఏపీ డీఎస్సీపై కీలక ప్రకటన -అందుకే నోటిఫికేషన్ ఆలస్యమన్న మంత్రి లోకేష్
Lagacharla Attack Case: బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు- లగచర్ల అధికారులపై దాడి కేసులో భారీ ట్విస్ట్
బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు- లగచర్ల అధికారులపై దాడి కేసులో భారీ ట్విస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: పట్నం నరేందర్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేటీఆర్, కొండగల్ నుంచే రేవంత్ రెడ్డి భరతం పడతామంటూ ఫైర్
పట్నం నరేందర్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేటీఆర్, కొండగల్ నుంచే రేవంత్ రెడ్డి భరతం పడతామంటూ ఫైర్
Andhra Pradesh News: సోషల్‌ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- కేసులు పెడితే తప్పేంటని ప్రశ్న
సోషల్‌ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- కేసులు పెడితే తప్పేంటని ప్రశ్న
AP DSC 2024: ఏపీ డీఎస్సీపై కీలక ప్రకటన -అందుకే నోటిఫికేషన్ ఆలస్యమన్న మంత్రి లోకేష్
ఏపీ డీఎస్సీపై కీలక ప్రకటన -అందుకే నోటిఫికేషన్ ఆలస్యమన్న మంత్రి లోకేష్
Lagacharla Attack Case: బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు- లగచర్ల అధికారులపై దాడి కేసులో భారీ ట్విస్ట్
బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు- లగచర్ల అధికారులపై దాడి కేసులో భారీ ట్విస్ట్
Andhra Politics: వైసీపీ ఏదీ కలసి రావడం లేదు - జగన్‌ను సలహాదారులు ముంచేస్తున్నారా ?
వైసీపీ ఏదీ కలసి రావడం లేదు - జగన్‌ను సలహాదారులు ముంచేస్తున్నారా ?
Rashmika Mandanna: అల్లు అర్జున్‌కు రష్మిక స్పెషల్ గిఫ్ట్... అందులో వెండి కాయిన్ ఎందుకు పెట్టిందో తెలుసా?
అల్లు అర్జున్‌కు రష్మిక స్పెషల్ గిఫ్ట్... అందులో వెండి కాయిన్ ఎందుకు పెట్టిందో తెలుసా?
Varun Tej Hit Movies: వరుణ్ తేజ్ సూపర్ హిట్ సినిమాలు... ఏయే ఓటీటీల్లో ఉన్నాయో తెలుసా?
వరుణ్ తేజ్ సూపర్ హిట్ సినిమాలు... ఏయే ఓటీటీల్లో ఉన్నాయో తెలుసా?
NBK 109 Title: బాలకృష్ణ సినిమా టైటిల్ ఇదే... నందమూరి అభిమానులకు నచ్చేలా, పండగ తెచ్చేలా!
బాలకృష్ణ సినిమా టైటిల్ ఇదే... నందమూరి అభిమానులకు నచ్చేలా, పండగ తెచ్చేలా!
Embed widget