Lokesh Letter : హస్తకళలు, చేనేత వృత్తులపై జీఎస్టీ భారం తగ్గించాలి - నిర్మలా సీతారామన్‌కు నారా లోకేష్ లేఖ !
హస్తకళలు, చేనేత వృత్తులపై జీఎస్టీ భారం తగ్గించాలని టీడీపీ నేత నారా లోకేష్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.
హస్తకళలు, చేనేత వృత్తులపై జీఎస్టీ భారం ( GST ) తగ్గించాలని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ( Nirmala Sitaraman ) లేఖ రాశారు. ''జీఎస్టీ 5 నుంచి 12 శాతం పెంచడం చేనేత రంగంపై పెనుప్రభావం పడుతోంది. ఈ తరహా పన్ను ( TAX ) విధానం వస్త్ర రంగాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. పన్ను పూర్తిగా మినహాయించాలి లేదా 5 శాతం వద్ద కొనసాగించాలి. కోవిడ్‌తో నష్టపోయిన చేనేత కార్మికుల దుస్థితి¸ని కేంద్రం గుర్తించాలని లోకేష్ లేఖలో కోరారు.
చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి @nsitharaman గారికి లేఖ రాసాను. కరోనా దెబ్బతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలి.(1/2) pic.twitter.com/t1nmpYqhze
— Lokesh Nara (@naralokesh) March 5, 2022
వైఎస్ఆర్‌సీపీలో పార్టీ ఫిరాయింపులపై శివాజీ మాటలు మైండ్ గేమా ? నిజమా ?
చేనేత, జౌళిపై పన్నును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఇప్పటికే అమలు కావాల్సి ఉన్నప్పటికీ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అయితే రద్దు చేయలేదు. చేనేత, జౌళిపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కకు పెట్టారు. ఈ విషయంపై మరింత లోతైన సమీక్ష జరిపేందుకు 'పన్ను రేట్ల హేతుబద్ధీకరణ కమిటీ'కి పంపారు. ఈ కమిటీ తమ నివేదికను సమర్పించిందో లేదో స్పష్టత లేదు కానీ.. మళ్లీ జీఎస్టీ పెంచుతారన్న ప్రచారం మాత్రం ఊపందుకుంది.
చంద్రబాబు బాటలో సీఎం కేసీఆర్, ఆ వ్యూహం ఈయనకైనా పని చేస్తుందా?
కొవిడ్ ( Covid - 19 ) మహమ్మారి తర్వాత చేనేత, టెక్స్‌టైల్ రంగాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ఈ సమయంలో జీఎస్టీని పెంచడమంటే వాటిని చావుదెబ్బకొట్టడమేనని దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి టెక్స్‌టైల్, చేనేత రంగాలకు ఉపాధి కల్పిస్తున్నాయి. దేశ చరిత్రలో చేనేత ఉత్పత్తులపై ఎప్పుడూ పన్ను లేదు, జీఎస్టీ ద్వారా మొదటిసారి 5శాతం విధించింది. ఇప్పుడు పన్నెండుశాతానికి పెంచే ప్రయత్నం చేస్తోంది. ఈ కారణంగానే విమర్శలు వస్తున్నాయి.