(Source: ECI/ABP News/ABP Majha)
Lokesh Yuvagalam : అది ఫిష్ ఆంధ్రా కాదు ఫినిష్ ఆంధ్రా - నారా లోకేష్ సెటైర్లు ! పాదయాత్ర 500 కి.మీ పూర్తి !
లోకేష్ పాదయాత్ర ఐదువందల కిలోమీటర్లు పూర్తయింది. మదనపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతోంది.
Lokesh Yuvagalam : తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మదనపల్లి నియోజకవర్గం చిన్న తిప్ప సముద్రం-2 వద్ద 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇటీవల ప్రతి వంద కిలోమీటర్లకు ఓ శిలాఫలకం ఆవిష్కరిస్తున్నలోకేష్.. వాటిపై తాను ఇచ్చిన హామీలను రాయిస్తున్నారు. ఐదువందల కిలోమీటర్ల శిలాఫలకంపై కూడా హామీలను చెక్కించారు. మదనపల్లె నియోజకవర్గంలో టమోటా రైతుల కోసం టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటుకి హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ మేరకు హామీలు అమలు చేస్తామని రైతులకు తెలిపారు. ఈ హామీకి గుర్తుగా శిలాఫలకం కూడా ఆవిష్కరించారు.
మదనపల్లి నియోజకవర్గం చిన్న తిప్ప సముద్రం-2 వద్ద 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర.#YuvaGalamPadayatra#YuvaGalam #Naralokesh pic.twitter.com/1Dt7PU4NMZ
— YuvaGalam (@yuvagalam) March 9, 2023
లోకేష్ తాను ఇస్తున్న హామీలను ప్రతి వంద కిలోమీటర్ కు శిలాఫలకంపై చెక్కించి పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినవి చేయకపోతే.. ఆ శిలాఫలాకాలను చూపించి.,.. ప్రశ్నించే అవకాశం ప్రజలకు లభిస్తుంది. ఇచ్చిన హామీలన్నింటినీ తాను అమలు చేయగలనని నమ్మకం లోకేష్ కల్పిస్తున్నారు. పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తానో కూడా చెబుతున్నారు.
అంతకు ముందు చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. పవర్ లూమ్ 500 యూనిట్స్ విద్యుత్ ఎత్తేశారని.. వైఎస్సార్ బీమా ఏం చేశారని ప్రశ్నించారు. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సబ్సిడీ ఏం చేశారని ప్రశ్నించారు. సబ్సిడీ ఏం చేశారని ప్రశ్నించారు. 63 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం పట్టించు కోలేదని నారా లోకేష్ విమర్శించారు. చేనేత కార్మికులకు గుర్తింపులు లేవని.. బీసీ సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు. రాజకీయంగా వాడుకుంటున్నారని.. వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారన్నారు. రియల్ టైం టెక్నాలజీతో ఆదుకుంటానన్నారు. G+3 ఇళ్లు, మగ్గాలకు ప్రత్యేక సదుపాయం కల్పించాలన్నారు. పింఛన్లు ఎత్తేశారని.. జీఎస్టీతో నేతన్నలు ఇబ్బంది పడుతున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు.
అంతకు ముందు తిప్ప సముద్రం-2 వద్ద ప్రభుత్వం ప్రారంభించిన ఫిష్ ఆంధ్రా స్టాల్ తో సెల్ఫీ దిగి ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ బ్రెయిన్ చైల్డ్ స్కీమ్ ఫిష్ ఆంధ్ర మూతబడిపోయిందన్నారు. అది ఫిష్ ఆంధ్రా కాదని ఫినిష్ ఆంధ్రా అని విమర్శించారు.
ఫిష్ ఆంధ్ర ఫినిష్
— Satish Gaddam (@tdpsatish) March 9, 2023
జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. మొన్ననే దేశంలో ఏడా దొరకని సరుకు జగన్ తయారు చేసే బూమ్ బూమ్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ లోడు మీకు చూపించాను. ఈ రోజు మరో జగన్ బ్రెయిన్ చైల్డ్ స్కీమ్ ఫిష్ ఆంధ్ర చూశాను. pic.twitter.com/XkgCAsr8wm