అన్వేషించండి

Ponnavolu : నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన

Tirumala Laddu Issue : నెయ్యి కంటే పందికొవ్వు రేటు ఎక్కువ కాబట్టి కల్తీ చేయరని లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. ఢిల్లీలో ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Lawyer Ponnavolu Sudhakar Reddy : వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేత, లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో పందికొవ్వు కలపలేదని ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఎందుకంటే..  నెయ్యి కంటే పంది కొవ్వు రేటు చాలా ఎక్కువ అన్నారు. వైవీ సుబ్బారెడ్డి తరపున సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూ కల్తీ అంశంపై పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ వాల్యూ తగ్గిలందంటే .. కల్తీ జరిగిందని అర్థం కానీ.. ఆ కల్తీ  పంది కొవ్వు కాదని ఆయన అంటున్నారు. అంటే కల్తీ జరిగిందని వైసీపీ లాయర్ కూడా నిర్ధారించినట్లయింది. 

నెయ్యి కంటే ఖరీదైనది యానిమల్ ఫ్యాట్           

అదే సమయంలో పందికొవ్వు కేజీ రూ. 1450 వరకూ ఉంటుందని.. కానీ నెయ్యి మాత్రం రూ. నాలుగు వందలు మాత్రమేనన్నారు. ఎవరైనా  రూ. నాలుగు వందలు మాత్రమే ఉన్న నెయ్యిలో రూ. పధ్నాలుగు వందల విలువ చేసే పందికొవ్వును కలుపుతారా అని  ప్రశ్నించారు. రాగి చెంబులో ఎవరైనా బంగారాన్ని కలుపుతారా..  ఇత్తడిలో ఎవరైనా  గోల్డ్ కలుపుతారా అని ప్రశ్నించారు. లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

'శ్రీవారి భక్తులూ ఈ మంత్రం జపించండి' - భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి

రాగిలో ఎవరైనా బంగారం కలుపుతారా ?           

ఆయన మరో పోలిక కూడా తెచ్చారు. రాగిలో ఎవరైనా బంగారం కలుపుతారా అని కూడా ప్రశ్నించారు. అంటే.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం రాగి.. పందికొవ్వు బంగారమా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నించడం ప్రారంభించారు.  లడ్డూ అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు వెలికి తీయాలనే తాను వైవీ సుబ్బారెడ్డి తరపున  హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. ఏపీ ప్రభుత్వం  వేసిన సిట్‌తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదని.. ఆయన  యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు కాబట్టి చంద్రబాబు కింద పనిచేసే ఏజెన్సీలు అవే చెబుతాయన్నారు.  దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో  ఫుడ్ టెక్నాలజీ నిపుణులతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును కోరుతున్నామన్నారు.  

Also Read: Tirupati Laddu Row: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌లు- సమగ్ర విచారణ కోరిన వైసీపీ, బీజేపీ నేతలు

ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన 10 ట్యాంకులలో నాలుగు ట్యాంకుల్లో కల్తీ ఉందని.. ఈ ట్యాంకులలో  వనస్పతి ఉందని మొదట టీటీడీ ఈవో చెప్పారని పొన్నవోలు చెప్పారు.  ట్యాంకులు ముందుగానే ఒక సర్టిఫికెట్‌తో  తిరుమలకు వస్తాయని, ఆ వచ్చిన ట్యాంకులను టీటీడీ 3 పరీక్షలు నిర్వహిస్తుందని .. ఆ టెస్టుల్లో పాసయితేనే... లడ్డూల తయారీకి వినియోగ్సాతరన్నారు. టెస్టుల్లో ఫెయిల్ అయితే వెనక్కి  పంపిస్తారన్నారు. తిరుమలలో నెయ్యిని  టెస్టు చేసే ల్యాబులు లేవని చెప్పారని..త కానీ ఉన్నాయని పొన్నవోలు వాదించారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో ఊహకందని ఆధ్యాత్మిక విషాదాలివే!
మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో ఊహకందని ఆధ్యాత్మిక విషాదాలివే!
Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలివే!
GSLV F15 Satellite: సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం
సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbh 2025 Prayag Raj Drone VisualsMaha Kumbh 2025 Mouni Amavasya | మౌని అమావాస్య రోజు కుంభమేళాలో మహా అపశృతి | ABP DesamCM Yogi Adityanath Request Devotees | నాలుగు కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్న యోగి | ABP DesamISRO's Histroic 100th Launch Success | నేవిగేషన్ శాటిలైట్ ను సక్సెస్ ఫుల్ గా ప్రవేశపెట్టిన ఇస్రో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో ఊహకందని ఆధ్యాత్మిక విషాదాలివే!
మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో ఊహకందని ఆధ్యాత్మిక విషాదాలివే!
Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలివే!
GSLV F15 Satellite: సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం
సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం
Ind Vs Eng T20 Series Updates: టీమిండియా కొంపముంచిన మిస్టేక్స్ అవేనా? - పుంజుకున్న ఇంగ్లాండ్‌ను ఆపేదెలా!, నాలుగో టీ20లో మేలుకోకపోతే కష్టమే
టీమిండియా కొంపముంచిన మిస్టేక్స్ అవేనా? - పుంజుకున్న ఇంగ్లాండ్‌ను ఆపేదెలా!, నాలుగో టీ20లో మేలుకోకపోతే కష్టమే
Hyderabad Crime: డిజిటల్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం - చేసిందో ఎవరో కాదు బ్యాంక్ మేనేజర్లే - ఇంకెవర్ని నమ్మాలి ?
డిజిటల్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం - చేసిందో ఎవరో కాదు బ్యాంక్ మేనేజర్లే - ఇంకెవర్ని నమ్మాలి ?
Crime News: ఒకే ఊరిలో ఒకే టైమ్‌లో వివాహిత, యువకుడు ఆత్మహత్య - అనైతిక బంధం వెనుక విషాదం ఇదీ!
ఒకే ఊరిలో ఒకే టైమ్‌లో వివాహిత, యువకుడు ఆత్మహత్య - అనైతిక బంధం వెనుక విషాదం ఇదీ!
Malavika Mohanan: ప్రభాస్ 'రాజాసాబ్' రాణి మాళవిక మోహనన్ రాయల్ లుక్!
ప్రభాస్ 'రాజాసాబ్' రాణి మాళవిక మోహనన్ రాయల్ లుక్!
Embed widget