అన్వేషించండి

TDP Leader Passes Away: తెలుగుదేశం పార్టీలో విషాదం, రాయచోటి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Sugavasi Palakondrayudu passes away టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఎంపీ సుదవాసి పాలకొండ్రాయుడు కన్నుమూశారు. బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాలకొండ్రాయుడు తుదిశ్వాస విడిచారు.

Andhra Pradesh News | రాయచోటి: తెలుగుదేశం పార్టీలో విషాదం చోటు చేసుకుంది. టిడిపి మాజీ ఎమ్మెల్యే సుదవాసి పాలకొండ్రాయుడు 78 కన్నుమూశారు. పలుమార్లు రాయచోటి ఎమ్మెల్యేగా, ఓసారి రాజంపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 1946 జూలై 3న జన్మించిన పాలకొండ్రాయుడు జనతా పార్టీ ద్వారా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇండిపెండెంట్ గానూ ఎన్నికల్లో నెగ్గి విజయవంతమైన నేతగా నిలిచారు.

వయసు రీత్యా గత కొంతకాలం నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఇటీవల అనారోగ్యంతో బెంగళూరులోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టీడీపీ సహా కూటమి నేతలు, రాయచోటి నేతలు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆయన దాదాపు మూడు దశాబ్దాల పాటు రాయచోటిలో కీలక నేతగా సేవలు అందించారు. వరుస ఎన్నికల్లో విజయాలు సాధించిన టీడీపీ నేతల్లో ఆయన ఒకరు.

పాలకొండ్రాయుడు పొలిటికల్ కెరీర్..
అప్పట్లో ఎంతో క్రేజ్ ఉన్న జనతా పార్టీ ద్వారా పాలకొండ్రాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో ప్రస్తుత అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి తొలిసారి జనతా పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీని వీడిన ఆయన 1983లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రాయచోటి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తరువాత ఏడాదికి ఎన్నికలు రావడం.. మరోవైపు ఆయన టీడీపీలో చేరారు. 1984 ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభ స్థానానికి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి రాయచోటి ఎమ్మెల్యేగా విజయాలు అందుకున్నారు. 

పాలకొండ్రాయుడుకు భార్య, ఇద్దరు కుమారులతో పాటు కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు సుదవాసి ప్రసాద్ బాబు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే చాలా కాలం నుంచే పాలకొండ్రాయుడు యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget