(Source: ECI/ABP News/ABP Majha)
Rahul Gandhi: కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం, ఏపీలో షెడ్యూల్ ఇలా
Rahul Gandhi Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో నాలుగు రోజులపాటు 119 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది.
Rahul Gandhi Bharat Jodo Yatra: ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. నేటి ఉదయం 6.30 గంటలకు కర్నూల్ జిల్లాలో రాహుల్ పాదయాత్ర ప్రారంభం అయింది. ఈ యాత్రకు సంబంధించి నాలుగు నియోజకవర్గాలు ఆలూరు, ఆదోని ఎమ్మిగనూరు, మంత్రాలయంలో నాలుగు రోజులపాటు 119 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది. ఆలూరు నియోజకవర్గం పరిధిలోని క్షేత్ర గుడి నుండి పాదయాత్ర ప్రారంభించారు రాహుల్. ఆరున్నర గంటలకు పాదయాత్ర ప్రారంభం క్షేత్ర గుడి నుండి ఉదయం 10:30 గంటలకు విరామం తీసుకుంటారు. ఆలూరు నగర శివారులో సాయంత్రం పాదయాత్ర ప్రారంభం, రాత్రి ఏడున్నర గంటలకు నేటి పాదయాత్ర విరామం తీసుకుంటారు.
తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ వరంగల్ డిక్లరేషన్ లో రైతుల రుణమాఫీ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 3 లక్షల రూపాయలను రైతులకు రుణమాఫీ చేస్తామని అదే అజెండాతో ప్రజలకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమ మరియు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి వాటి అభివృద్ధికి తోడ్పడుతామని తెలిపారు. అత్యంత పేద వర్గాలకు న్యాయపధ్ ద్వారా నెలకు 6000 రూపాయలను సంవత్సరానికి ఇవ్వాలని ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ పైన తెలిపిన తీర్మానాలనే అజెండాగా పేర్కొంటూ భారత్ జోడోయాత్ర ప్రజల్లోకి వెళ్తుందని పార్టీ సీనియర్ నాయకులు తెలుపుతున్నారు.
కర్నూల్ నుంచి తెలంగాణకు రూట్ మ్యాప్
కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలలో ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాలకు వలసలు వెళ్లడం వాటి పరిష్కార మార్గాలను అధికారంలోకి రాగానే ఆలోచించే ఆలోచనలో ఉందంటూ పార్టీ వర్గాల నుండి వస్తున్నటువంటి సమాచారం. అలాగే జిల్లాలో అత్యధికంగా పండిచ్చేటటువంటి టమోటా పత్తి వేరుశనగ ఉల్లేవంటే పంటలకు కనీస మద్దతు ధరలను కల్పించే విధంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై పెద్ద ఎత్తున వినిపించే యువచనలో ఉన్నామంటూ జిల్లా నాయకులు నుండి జిల్లా నాయకులు రాహుల్ దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యలు పరిష్కారం కృషి చేస్తామని హామీలిస్తున్నారు.
ఏపీలో నాలుగు రోజుల పాదయాత్ర..
నాలుగు రోజులు పాటు ఏపీలో రాహుల్ పాదయాత్ర సాగనుంది. రేపు ఉదయం 6.30 నిమిషాలకు ఆలూరు చత్రగుడి హనుమాన్ టెంపుల్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభంకానుంది. మంగళవారం ఉదయం 10.30 ఆలూరు సిటీ లోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. రాత్రికి చాగి గ్రామంలో నైట్ హాల్ట్ ఉంటుంది. బుధవారం (19వ తేదీ) ఉదయం 6.30 నిమిషాలకు తిరిగి చాగి నుంచి రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది. ఎల్లుండి ఉదయం 10.30 నిమిషాలకు ఆదోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీకి యాత్ర చేరుకుంటుంది. రాత్రి 7 గంటలకు ఆదోనిలోని ఆరేకల్ లోని జెల్లి నాగన్నా తాతా దర్గా నుంచి యాత్ర సాగనుంది. ఎమ్మిగనూరు చెన్నాపురం క్రాస్ వద్ద రాహుల్ రాత్రి బస చేయనున్నారు.
20వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు పాదయాత్ర ఎమ్మిగనూరు నుంచి ప్రారంభం కానుంది. గురువారం 11 గంటలకు యెమ్మిగనూరు ధర్మాపురం గ్రామానికి రాహుల్ యాత్ర చేరుకుంటుంది. సాయంత్రం నాలుగు గంటలకు ధర్మాపురం టోల్ గేట్ వద్దకు, రాత్రి ఏడు గంటలకు కల్లుదేవర కుంటకు పాదయాత్ర చేరుకుంటుంది. మంత్రాలయం అవుట్ కర్ట్స్ లో రాత్రి రాహుల్ బస చేయనున్నారు. 21వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు మంత్రాలయం టెంపుల్ సర్కిల్ నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 10.30 నిమిషాలకు కర్ణాటకలోని రాయచూర్ లోకి రాహుల్ యాత్ర కొనసాగనుంది.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌కు రాహుల్ యాత్ర..
రాహుల్ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమై 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3,570 కిలోమీటర్ల పాటు యాత్ర సాగనుంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో పాదయాత్ర పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లోకి రాహుల్ గాంధీ ప్రవేశించారు. రాహుల్ ఇదివరకే వెయ్యిమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తి చేశారు. పాదయాత్రలో భాగంగా ఎన్నికల నాటికి గుజరాత్‌లో రాహుల్ రెండో విడత భారత్ జోడో యాత్ర చేపట్టేలా కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ నేడు అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజల మనోభావాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటి పరిష్కార మార్గాలను సూచించడం కోసం కేంద్రంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను కల్పించే తొలి సంతకాన్ని ఆ ఫైలు పైనే చేస్తానని హామీ ఇస్తూ ఈ యాత్ర ముందు కొనసాగిస్తున్నారు.
ముఖ్యంగా జిల్లాలో సమస్యలను ఉపాధి నిరుద్యోగం రైతుల కష్టాలు వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి వాటిని కచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారం చేపట్టిన తర్వాత ప్రస్తుత భారత్ జూడయాత్రలో జిల్లాలో వచ్చినటువంటి అర్జీలను రాబోయే రోజుల్లో అధికారం చేపట్టిన వెంటనే వాటిని పరిష్కరించే విధంగా తమ అధినేత దృష్టికి తీసుకెళ్తామని జిల్లాలో ఉండే పార్టీ సీనియర్ నాయకులు తెలుపుతున్నారు.