News
News
X

Kurnool News: కర్నూలు జిల్లాలో కొత్త సంవత్సర వేడుకలు నిషేధం.. అలా చేస్తే చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ

ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనాలు రోడ్లపైకి రావద్దని సూచిస్తున్నారు.

FOLLOW US: 

హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో కొత్త సంవత్సర వేడుకలను పూర్తిగా నిషేధిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జిల్లా యంత్రాంగానికి పూర్తి బాధ్యతలు అప్పగించేశారు. ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులను అంచనా వేసుకొని ఆంక్షలు అమలు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. అందుకే చాలా జిల్లా పోలీసులు కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నారు. 

కర్నూలు జిల్లాలో కూడా కొత్త ఏడాది వేడుకలు నిషేధిస్తున్నట్టు జిల్లా ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. ఎలాంటి సంబరాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని తేల్చి చెప్పేశారు. అర్థరాత్రి తర్వాత రోడ్లపై కనిపిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీనికి అనుగుణంగానే రెస్టారెంట్‌లు, బార్లు, హోటళ్లు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. 

31వ తేది అర్ధరాత్రి వరకు న్యూ ఇయర్ వేడుకలకు అనుమతుల్లేవని కర్నూలు జిల్లా పోలీసులు తేల్చి చెప్పేశారు. బార్లు, స్టార్ హోటళ్లలో అర్ధరాత్రి వరకు పార్టీలకు అనుమతించేది లేదని ప్రకటించారు. అర్థరాత్రి యువకులు రోడ్లపై కేకులు కోసి అల్లర్లు చేస్తూ కేకలు వేస్తూ ర్యాష్ డ్రైవింగ్‌లు చేస్తూ వాహనాలపై తిరగ వద్దని సూచించారు పోలీసులు. హద్దుమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్  ఆంక్షలు తప్పనిసరి పాటించాలని ప్రజలకు అభ్యర్థించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుందని సహకరించాలని కోరారు.

ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించిందని కర్నూలు  జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ జిల్లా పోలీసు కార్యాలయంలో తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హోటళ్లలో పార్టీలు, సామూహిక పార్టీలకు అనుమతులు లేవన్నారు. ప్రజలు, యువత పోలీసులకు సహకరించాలన్నారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసేసి అధిక శబ్దాలతో ర్యాష్ డ్రైవింగ్‌తో ఇబ్బంది పెడితే తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. బాణసంచా పేల్చడం వంటి వాటి వలన ప్రశాంతతకు భంగం కలిగి వృద్దులకు, చిన్న పిల్లలకు, రోగులకు సమస్యలు ఎదురవుతాయన్నారు. 

పోలీసు బృందాలు బ్లూ కోల్డ్, రక్షక్, స్పెషల్ పార్టీ పోలీసులు డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం నుంచి నగరంలో గస్తీలు చేపడతారన్నారు సుధీర్‌. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటారన్నారు. 

Also Read: Kidambi Srikant : కిడాంబి శ్రీకాంత్‌కు రూ. 7 లక్షలు.. 5 ఎకరాల భూమి.. సీఎం జగన్ నజరానా !

Also Read: మందు బాబులకు గుడ్ న్యూస్.. మద్యం విక్రయ వేళలు పొడిగింపు.. న్యూ ఇయర్ కు తగ్గేదేలే అంటారేమో..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 30 Dec 2021 10:22 AM (IST) Tags: Kurnool news Welcome 2022 new year celebrations Kurnool Updates

సంబంధిత కథనాలు

నేడు బలపడనున్న అల్పపీడనం - వర్షాలతో తెలంగాణలో 3 రోజులు ఎల్లో అలర్ట్, ఏపీలో ఇలా

నేడు బలపడనున్న అల్పపీడనం - వర్షాలతో తెలంగాణలో 3 రోజులు ఎల్లో అలర్ట్, ఏపీలో ఇలా

సంక్రాంతి నుంచి ఫ్యామిలీ డాక్టర్ - వైద్యులను నియమించుకుంటున్నామన్న ఏపీ ప్రభుత్వం !

సంక్రాంతి నుంచి ఫ్యామిలీ డాక్టర్ - వైద్యులను నియమించుకుంటున్నామన్న ఏపీ ప్రభుత్వం !

Kurnool News : కర్నూలు జిల్లాలో గడప గడపకూ నిరసన సెగ

Kurnool News : కర్నూలు జిల్లాలో గడప గడపకూ నిరసన సెగ

Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణం, భోజనం పెట్టలేదని భార్యను హత్యచేసిన భర్త!

Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణం, భోజనం పెట్టలేదని భార్యను హత్యచేసిన భర్త!

మెగస్టార్ బర్త్‌డే రోజున జనసేన కీలక భేటీ- కేడర్‌కు ఏం చెప్పబోతున్నారు?

మెగస్టార్ బర్త్‌డే రోజున జనసేన కీలక భేటీ- కేడర్‌కు ఏం చెప్పబోతున్నారు?

టాప్ స్టోరీస్

AP Politics: నన్ను టార్గెట్ చేశారు, నాపై కుట్ర జరుగుతోంది - మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు

AP Politics: నన్ను టార్గెట్ చేశారు, నాపై కుట్ర జరుగుతోంది - మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు

BJP Strategy In Telangana: తెలంగాణలో త్రిపుర తరహా వ్యూహం, తమ సక్సెస్‌పై ధీమాగా కమలనాథులు

BJP Strategy In Telangana: తెలంగాణలో త్రిపుర తరహా వ్యూహం, తమ సక్సెస్‌పై ధీమాగా కమలనాథులు

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!

వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!