By: ABP Desam | Updated at : 29 Dec 2021 05:51 PM (IST)
సీఎం జదన్ను కలిసిన స్టార్ షట్లర్ శ్రీకాంత్
భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఏపీ ప్రభుత్వం తరపున రూ. 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు. స్పెయిన్‌లో జరిగిన 2021 బీడబ్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీకాంత్ ఫైనల్ చేరుకున్నారు. ఫైనల్‌లో ఓడిపోవడంతో రజత పతకం లభించింది. ఇంత వరకూ ఏ షట్లర్ కూడా ఫైనల్ చేరుకోలేదు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారత పురుష షట్లర్ గా రికార్డు సృష్టించారు. దీంతో ఏపీ ప్రభుత్వం నజరానా ప్రకటించాలని నిర్ణయించుకుంది. కిడాంబి శ్రీకాంత్ కుటుంబసభ్యులతో కలిసి సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్.. కిడాంబి శ్రీకాంత్‌ను ఘనంగా సత్కరించారు.
Koo Appసీఎం వైయస్ జగన్‌ను కలిసిన అనంతరం కిడాంబి శ్రీకాంత్‌కు ప్రభుత్వం తరపున రూ. 7 లక్షల చెక్‌ను అందజేసిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి, శాప్ అధికారులు #CMYSJagan #KidambiSrikanth #SAP #AndhraPradesh - YSR Congress Party - YSRCP (@YSRCPOfficial) 29 Dec 2021
Also Read: చెలరేగిన భారత బౌలర్లు... సౌతాఫ్రికా 199 పరుగులకే ఆలౌట్... 146 పరుగుల ఆధిక్యంలో భారత్
ప్రస్తుతం శ్రీకాంత్ ఏపీలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2017లో జరిగిన ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో శ్రీకాంత్ టైటిల్ కైవసం చేసుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాంత్‌కు గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించారు. ఈ మేరకు క్రీడల కోటా కింద డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ 2018లో అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తర్వాత శ్రీకాంత్ శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. 2020 ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖ ప్రాధికార సంస్థలో డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. అయితే టోర్నమెంట్లలో పాల్గొనే వెసులుబాటు కల్పించింది.
Also Read: మా తెలుగు ఆటగాడు చేసిన తప్పేంటి? టీమ్‌ఇండియాపై విమర్శల వర్షం!!
తిరుపతిలో ఆకాడమీ పెట్టాలని శ్రీకాంత్ ఆసక్తి చూపించడంతో ప్రభుత్వం అక్కడ ఐదు ఎకరాలను కేటాయించాలని నిర్ణయించింది. ఇప్పటికే పీవీ సింధుకు విశాఖ పట్నంలో రెండు ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏపీలో ఇద్దరు దిగ్గజ ప్లేయర్లు.. రెండు బ్యాడ్మింటన్ ఆకాడమీల్ని పెట్టబోతున్నారు. అయితే ఇప్పటికీ సింధు, శ్రీకాంత్ చురుగ్గా టోర్నమెంట్లలో పాల్గొంటున్నారు. అందుకే అకాడెమీలు నెలకొల్పే సరికి బాగా సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: అమ్మబాబోయ్.. అన్ని డకౌట్లా.. అత్యంత చెత్త రికార్డు సాధించిన ఇంగ్లండ్!
LSG vs RCB, Eliminator: లక్నోదే లక్కు! టాస్ గెలిచిన రాహుల్ - ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్
LSG vs RCB, Eliminator: బ్యాడ్ న్యూస్! వర్షంతో ఎలిమినేటర్ మ్యాచ్ టాస్ ఆలస్యం
IPL 2022: ఈ రికార్డ్ LSGకే సొంతమేమో! ప్లేఆఫ్స్ చేరిన RR, RCB, GTపై గెలవనేదుగా!!
LSG vs RCB, Eliminator: ఎలిమినేటర్‌లో అందరి కళ్లూ కోహ్లీ, రాహుల్ పైనే! RCB, LSGలో అప్పర్ హ్యాండ్ ఎవరిదంటే?
GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్ 'కిల్లర్' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్ - ఇండియా టాప్-10లో ఉన్నట్టే!
MLC Suspend YSRCP : ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్ - కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్సీపీ !