News
News
X

నిఘా నీడలో కర్నూలు, వినాయక శోభాయాత్ర కోసం విస్తృత ఏర్పాట్లు!

Kurnool News: వినాయక నిమజ్జనోత్సవాల్లో ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. అందరూ నిబంధనలు పాటించాలని సూచించారు. 

FOLLOW US: 

Kurnool News: కర్నూలు నగరంలో వినాయక చవితి వారోత్సవాలు 8 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా సాగాయి. కుల, మతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి పండుగను జరుపుకున్నారు. నగరంలో గణనాథులు నిమజ్జనానికి తరలింపు పూర్తైంది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా గణేష్ నిమజ్జనోత్సవాన్ని ఎవరూ సరిగ్గా జరుపుకోలేకపోయారు. అందుకే ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించిన గణేష్ నిమజ్జనం మహోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కర్నూలు నగరంలో 2000 వరకు విగ్రహాలు ఏర్పాటు చేశారు. ప్రతి వాడలో ఉన్నటువంటి విగ్రహాలకు ఐడీ నెంబర్ ను కేటాయించారు. ఆయా ప్రాంతాలలో ఉన్న విగ్రహాల సంఖ్యను బట్టి భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 

మొదటి ప్రారంభమయ్యే నిమజ్జన యాత్ర ఎక్కడంటే?

కర్నూలు నగరంలో ఉదయం 9 గంటలకు రాంబట్ల దేవాలయం నుంచి వినాయక నిమజ్జన యాత్ర  ప్రారంభం అవుతుంది. చాలా ఏళ్లుగా వస్తున్న ఆచార, సాంప్రదాయాల ప్రకారం మొదటగా ఆ వినాయకుడిని నిమజ్జనం చేశాకే.. మిగతా విగ్రహాలకు నిమర్జనం కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొదటగా ఆ విఘ్నేశ్వరుడు పూజలు అందుకున్నాకే..  రాంబట్ల దేవాలయ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జనానికి బయలుదేరుతారు. తర్వాత కర్నూల్ లో ఉన్నటువంటి అన్ని వినాయకులు నాలుగు దిక్కుల నుండి నిమజ్జన ఘాటుకు వస్తాయి. ముఖ్యంగా పాత బస్టాండ్, ఆర్ఎస్ రోడ్డు, కొత్త బస్టాండ్, బిర్లాగేట్, నంద్యాల చెక్ పోస్ట్, గుత్తి పెట్రోల్ బంక్ నుండి రూట్ మ్యాప్ ద్వారా నిమజ్జనానికి గణనాథులు తరలివస్తారు.

పోలీసు సూచనలు తప్పక పాటించాలి...!

నగరంలో ఈరోజు జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమంలో పోలీసులతో మర్యాద పూర్వకంగా మెలగాలని, అధికారులతో అస్సలే గొడవ పడకూడదని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సూచించారు. ఊరేగింపులో శబ్దాలు, కాలుష్యం తగ్గించుకోవాలని ఎక్కడ పడితే అక్కడ నిలబడకుండా ఇతరులకు హాని కలిగించకుండా చూడాలని అన్నారు. అదే విధంగా లేనిపోని సమస్యలు సృష్టించరాదని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న విగ్రహ కమిటీ సభ్యులు వారి గణేష్ విగ్రహం వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా బాధ్యత తీసుకోవాలని.. ఊరేగింపులో కెమికల్స్ లాంటి రంగులు చల్లుకోరాదని, పోలీసులకు సహకరించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రజలు సహకరించాలని కోరారు. భారతీయ సంప్రదాయ సంస్కృతిక పద్ధతిలో వచ్చిన వారికి పోలీసులు బహుమతుల ప్రధానం జరుగుతుందని తెలియజేశారు. 

మద్యం దుకాణాలను మూసేయాలని.. నగర పరిధిలో బ్లాక్ లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని సూచించారు. నిమజ్జన కార్యక్రమంలో కొత్త వ్యక్తులపై రంగులు చల్లి ఇబ్బందులకు గురి చేయకుండా ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే పోలీసు వారి దృష్టికి తీసుకురావాలన్నారు. డీజేలు అనుమతి ఉన్నప్పటికీ... రాత్రి 12 గంటల వరకు మాత్రమే డీజేలు ఉపయోగించాలని గుర్తు చేశారు. డీజేలను నిలిపివేయాలని పైన సూచించిన నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఎస్పీ తెలిపారు. 

పోలీసుల వలయంలో కర్నూలు నగరం..!

నగరంలో 2000 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,  గొడవలకు తావివ్వకుండా భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకోవడం కోసం పోలీసులు పహారా కాస్తున్నారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకూ దిశానిర్దేశం చేశారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలతో ఏ విధంగా మెలగాలనే అంశాలపై సూచనలు చేశారు. 

కేసీ కెనాల్ చుట్టూ 7 క్రేన్ల ఏర్పాటు...!

కేసీ కెనాల్ పరిసర ప్రాంతాలలో 7 క్రేన్లను ఏర్పాటు చేశారు. విగ్రహాల ఎత్తు వాటి ప్రాధాన్యతను బట్టి పోలీసులు ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడబోతున్నారు. గత సంవత్సరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడు క్రేన్ల సంఖ్యను పెంచారు. గతంలో మరుసటి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిమర్జనం జరిగేది. కానీ ఇప్పుడు అది పునరావృతం కాకుండా చూడాలని.. ప్రస్తుత రోజుల్లో నగరంలో ఎక్కువ విగ్రహాలు ఉండటం వల్ల నిమర్జనం కార్యక్రమం త్వరగా ముగించాలని క్రేన్ల సంఖ్యను కూడా పెంచారు. నిమజ్జనాన్ని పురస్కరించుకొని దాదాపుగా 600 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. అలాగే నిమజ్జనానికి ప్రభుత్వ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని తెలియజేశారు. ఈ నిమజ్జనం ఉదయం 9 గంటలకు మొదలుకుని నిర్విరామంగా జరుగుతుందని పోలీసులు వివరించారు. 

Published at : 08 Sep 2022 09:45 AM (IST) Tags: kurnool police Kurnool Ganesh Immersion Kurnool SP Comments SP Koushal Sidharth

సంబంధిత కథనాలు

Rains In AP Telangana: రెయిన్ అలర్ట్ - నేడు ఆ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్

Rains In AP Telangana: రెయిన్ అలర్ట్ - నేడు ఆ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్

Tamil Martial Art: వైజాగ్‌లో తమిళ మార్షల్ ఆర్ట్స్ సిలంబం ట్రైనింగ్, కర్రసామును పోలి ఉండే యుద్ధ విద్య

Tamil Martial Art: వైజాగ్‌లో తమిళ మార్షల్ ఆర్ట్స్ సిలంబం ట్రైనింగ్, కర్రసామును పోలి ఉండే యుద్ధ విద్య

శ్రీ శైల దేవస్థానం భూముల సరిహద్దులు అక్టోబరు నెలాఖరులోపు ఖరారు

శ్రీ శైల దేవస్థానం భూముల సరిహద్దులు అక్టోబరు నెలాఖరులోపు ఖరారు

Rains In AP Telangana: మరో 2 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్

Rains In AP Telangana: మరో 2 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్

Kurnool News : రోజంతా మేత పెట్టలేదు, కర్నూలు మున్సిపల్ ఆఫీసులో గాడిదలతో నిరసన

Kurnool News : రోజంతా మేత పెట్టలేదు, కర్నూలు మున్సిపల్ ఆఫీసులో గాడిదలతో నిరసన

టాప్ స్టోరీస్

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్