అన్వేషించండి

Rayalaseema University: ముడుపులు సమర్పిస్తేనే అనుమతులు, 32 కాలేజీల పర్మిషన్ రద్దు, అంతలోనే ఊరట

ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో 150 వరకు ప్రభుత్వ మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ఇందులో 80 కి పైగా ప్రైవేట్ కళాశాలలున్నాయి

మామూళ్లు ఇస్తేనే పర్మిషన్లు... మామూళ్ల మత్తులో ఆర్ యు అధికారులు... ఇచ్చిన వారికి ఒక న్యాయం ఇవ్వని వారికి ఇంకో న్యాయం...? రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరుగుతున్నది ఏంటి..? హైకోర్టు ఊరట నివ్వడంతో ఊపిరి పీల్చుకున్న కళాశాల యాజమాన్యాలు...!
32 కళాశాలల అనుమతి రద్దు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో 150 వరకు ప్రభుత్వ మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ఇందులో 80 కి పైగా ప్రైవేట్ కళాశాలలున్నాయి అయితే 70 శాతం వరకు ఉన్నటువంటి కళాశాలలో మౌలిక వసతులు లేకపోయినప్పటికీ వీటిని ప్రతి సంవత్సరం చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఈ సంవత్సరం ఉన్నట్లుండి ఏకంగా 32 కళాశాలల అనుమతి రద్దు చేయడంతో అధికారుల పనితీరు బట్టబయలైందని అంటున్నాయి యాజమాన్యాలు. ఏర్పాటు సమయంలో వీటికి విద్యాలయ సమితి నియమ నిబంధనలు ప్రకారం కొత్తకళాశాల ఏర్పాటు చేయాలంటే యూజీసీ నిబంధనలు మేరకు కళాశాల ఆవరణ, వసతులు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటేనే అనుమతులు ఇవ్వాలి.  నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారా అన్నది యూనివర్సిటీ అధికారులు పరిశీలించి అనుమతులు ఇవ్వాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఎటువంటి మౌలిక వసతులూ లేకున్నా మామూలు పుచ్చుకొని అనుమతులు ఇస్తున్నారు. ఈ కళాశాలలను ప్రతి ఏడాది అధికారులు పరిశీలించి రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది.
ముడుపులు తీసుకున్నారని విమర్శలు
అధికారులు మాత్రం ఏ నిబంధనలు పాటించని కళాశాలపై చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. కాని ఈ ఏడాది యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంట జిల్లాలో 32 కళాశాలలో ప్రవేశాలను యూనివర్సిటీ రద్దు చేసింది. అనుమతి ఉన్న పలు కళాశాలలో పరిశీలిస్తే దాదాపు జిల్లాలో 25 డిగ్రీ కళాశాలలో ఎటువంటి మౌలిక వసతులు యూజీసీ నిబంధనలు పాటించని కళాశాలకు ఎలాంటి నోటీసు కానీ చర్యలు కానీ లేవు. కేవలం ఆయా కళాశాల యాజమాన్యాలు భారీ స్థాయిలో యూనివర్సిటీ అధికారులకూ ముడుపులు ముట్టచెప్పడం వల్ల వాటిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా అనుమతులే..!
డోన్ లో ఒక కళాశాల, కర్నూల్ నగరంలో ఐదు, నంద్యాల తదితర ప్రాంతాల్లోని పలు కళాశాలలో కనీసం బిల్డింగ్ కూడా సరిగా లేకపోవడం అపార్ట్మెంట్లో కళాశాల నిర్వహిస్తున్నారు. వీటికి ఎలాంటి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు. ఇచ్చిన కళాశాలలో పక్కా భవనాలు సరైన వాటికి ఎందుకు ప్రవేశాలు రద్దు చేశారో యూనివర్సిటీ అధికారి చెప్పాల్సిన బాధ్యత ఉంది అంటూ ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యం సంఘాల వారు యూనివర్సిటీ అధికారులు తీరుపై మండిపడ్డారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకొని కళాశాల ప్రారంభంలో ప్రభుత్వాలు నియమించిన నిబంధనల ప్రకారమే నియమించుకోవడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత యూనివర్సిటీ అధికారులు తమ కళాశాలలకు సొంత భవనాలు ఉన్నప్పటికీ యూజీసీ నిబంధనలు ఉన్నప్పటికీ అధికారులు కక్షపూరితంగా తమ కళాశాలలను రద్దు చేయడం సరైంది కాదని ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
మొదటి నుంచే వివాదాలలో ఆర్‌యూవీసీ....!
రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఆనందరావు తీరు ఆది నుంచి వివాదం పలు రకాల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. యూనివర్సిటీలో సైతం ఈయనపై పలు ఆరోపణలు విమర్శలు వెలుగుతున్నాయి అయితే ఈ ఏడాది ఏకంగా ఏకపక్షంగా 32 కళాశాలలో ప్రవేశాలను రద్దు చేయడం మరింత వివాదానికి దారి తీసింది. ఇప్పటికే యూజీసీ లోకాయుక్త గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. అయితే ఈ వివాదంలో కొన్ని కాలేజీలు రద్దు చేశారు. మరికొన్ని కాలేజీలు వద్దు అనే తీరుగా వ్యవహరిస్తున్నారని పలు కళాశాల యాజమాన్యాలు ఆరోపిస్తున్నారు. కళాశాల ప్రవేశాలను రద్దు చేయడంలో వీసీ అక్రమాలకు పాల్పడ్డారని కొందరు కళాశాల యాజమాన్యాలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి వీసీ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

హైకోర్టును ఆశ్రయించిన డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు...
జిల్లాలో ప్రవేశాలు రద్దయిన 32 కళాశాలలకు హైకోర్టు తీర్పు కాసింత ఊరటనిచ్చింది. ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలను రద్దు చేసిన యూనివర్సిటీ అధికారుల  తీరుపై 16 కళాశాల యాజమాన్యాలు సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకొని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో లోపాలను నెల రోజుల్లో సరిచేసుకోవాలని స్పష్టం చేస్తూ ప్రవేశాల ప్రక్రియ కొనసాగించుకోవచ్చని తీర్పునిచ్చింది. లోపాలు సరిదిద్దుకోవడంలో విఫలమైతే కళాశాలలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు అదే కళాశాలలో విద్యను అభ్యసించడం తక్కువగా భావించడానికి వీల్లేదని ఉత్తర్వులు ఇచ్చింది.

మెమొలు లేవు తనిఖీలు లేవు.. రద్దు అంటూ నోటీసులు...
డిగ్రీ కళాశాలలో రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాల కర్నూల్ సమీపంలోని ఓర్వకల్ మండల కేంద్రంలోని శ్రీ బుగ్గరామేశ్వర్ డిగ్రీ కళాశాల భవనం కళాశాలకు అన్ని వసతులు ఉన్నాయని యూనివర్సిటీ అధికారులు భావించి అనుమతులు కొనసాగించారు. గత ఏడాది వరకు ఈ కళాశాలకు సెల్ఫ్ సెంటర్ కూడా ఉంది.. ఇది ఆర్ యూ అధికారుల పరిశీలన తీరు.. ఏదో కుంటి సాకులతో కళాశాలల అనుమతులను రద్దు చేయడం అన్నట్లుగా మారింది.
ఈ కళాశాలు యూజీజీ నిబంధనలు పాటించలేదని యూనివర్సిటీ అధికారులు ప్రవేశాలు రద్దు చేశారు. కర్నూల్ నగరంలో ఉన్న విజయ దుర్గ డిగ్రీ కళాశాల కూ పక్క భవనాలు ఉన్న చిన్నపాటి నిబంధనలు చూపిస్తూ అనుమతులను నిరాకరించారు. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తున్నప్పుడు కనిపించని విరుద్ధ నిబంధనలు ఇప్పుడే కనిపిస్తున్నాయా అంటూ పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది. కొన్ని కళాశాలలో కమర్షియల్ భవనాలలో, రహదారుల పక్కన ఉంటూ శబ్ద కాలుష్యానికి గురవుతున్నా వాటి నిర్వహణ ఏమాత్రం పట్టనట్లు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని... నిబంధనలు పాటించని మరిన్ని కాలేజీలను ఎటువంటి అనుమతులు రద్దు చేయకపోవడం అనేక విమర్శలకు దారితీసింది. వర్సిటీ అధికారులు ముడుపుల మాయలో పైసలు ఇచ్చిన కళాశాలలకు అనుమతులు కొనసాగించి ఇవ్వని ఇవ్వని వాటికి అడ్మిషన్ రద్దు చేశారని ఆరోపణలున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget