అన్వేషించండి

Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా

Srikakulam News | మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ బోగీలో మంటలు చెలరేగాయి. మరోచోట శ్రీకాకుళం జిల్లాల్లో కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు బోల్తా పడింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రత్లాం జిల్లాలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఏసీ కోచ్‌లో అగ్నిప్రమాదం.
  • షార్ట్ సర్క్యూట్‌తో మంటలు, గార్డ్‌తో ప్రయాణికుల తరలింపు.
  • శ్రీకాకుళం జిల్లాలో కాశీ యాత్ర బస్సు బోల్తా, స్వల్ప గాయాలు.
  • రెండు ఘటనల్లోనూ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

భోపాల్: త్రివేండ్రం నుంచి హజరత్‌ నిజాముద్దీన్‌ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో  రైలులోని ఒక ఏసీ కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు కోచ్‌లో పొగలు, మంటలు రావడాన్ని గమనించి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

అయితే, రైలు గార్డ్ అత్యంత సమయస్ఫూర్తితో, అప్రమత్తతతో వ్యవహరించి వెంటనే రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఆర్‌పీఎఫ్ (RPF) సిబ్బంది రంగంలోకి దిగి, మంటలు వ్యాపించిన ఏసీ బోగీలో ఉన్న 68 మంది ప్రయాణికులను అత్యంత వేగంగా, సురక్షితంగా కిందకు దించేశారు. అనంతరం రైల్వే సిబ్బంది మంటలు అంటుకున్న ఆ బోగీని మిగతా రైలు నుంచి వేరు చేసి, అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. గార్డ్, ఆర్‌పీఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఒక పెద్ద ప్రమాదం తప్పింది. కాగా, ఈ తీవ్రమైన అగ్నిప్రమాద ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.


Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా

కాశీ యాత్రలో ప్రమాదం.. శ్రీకాకుళం జిల్లాలో ట్రావెల్ బస్సు బోల్తా.. 
కంచిలి : శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగం గ్రామ సమీప నేషనల్ హైవేపై శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 1:30 గంటల సమయంలో కాశి తీర్థయాత్రకు వెళ్తున్న ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ట్రావెల్ ఏజెంట్‌కు స్వల్ప గాయాలు కావడంతో వారిని వెంటనే సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కర్నూలు జిల్లా పెద్దకోడూరు మండలం మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన ఎమ్మిదినూరు గ్రామం నుంచి సుమారు 40 మంది భక్తులు పవిత్ర కాశీ యాత్రకు బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలంలో వీరు ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కంచిలి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చెక్ చేశారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

 

Frequently Asked Questions

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం ఎక్కడ జరిగింది?

త్రివేండ్రం నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో అగ్నిప్రమాదానికి గురైంది.

రాజధాని ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదానికి కారణం ఏమిటి?

ప్రాథమిక సమాచారం ప్రకారం, రైలులోని ఒక ఏసీ కోచ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.

కాశీ యాత్రకు వెళ్తున్న బస్సు ఎక్కడ బోల్తా పడింది?

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగంపల్లె గ్రామ సమీపంలో కాశి యాత్రకు వెళ్తున్న ట్రావెల్ బస్సు బోల్తా పడింది.

కాశీ యాత్ర బస్సు ప్రమాదంలో ఎవరికి గాయాలయ్యాయి?

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ట్రావెల్ ఏజెంట్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget