News
News
X

Raghuveera Reddy: పొలిటికల్ రీఎంట్రీపై రఘువీరారెడ్డి మౌనం, చేజారిపోతున్న కీలక అనుచరులు

Raghuveera Reddy: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు భారీ కాన్వాయ్ తో మాజీ పీసీసీ రఘువీరా డి .హీరేహాల్ కు వచ్చారు. కానీ ఏ ప్రకటన చేయకపోవడంతో ఆయన అభిమానులు నిరాశచెందారు.

FOLLOW US: 

ఇప్పటికే చేజారిపోయిన కీలక అనుచరులు. 
ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అనుచరవర్గంలో నిరాశ
వైసీపీలో ఇమడలేరు, టీటీడీలో చేరరు
కాంగ్రెస్‌లో ఉంటే నెట్టుకొస్తారా !
కాలాయాపన అనే కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారా

సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో చక్రం తిప్పిన రఘువీరారెడ్డి మరోసారి తన అనుచరులను ఊరించి ఉసూరుమనిపించారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు భారీ కాన్వాయ్ తో మాజీ పీసీసీ రఘువీరా డి .హీరేహాల్ కు వచ్చారు. దీంతో రాజకీయ పునః ప్రవేశం చేయబోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. కానీ పొలిటికల్ రీ ఎంట్రీకి సంబంధించిన ప్రకటన చేస్తాడని ఆయన అనుచరులలో ఉత్సాహం కనిపించింది. అయితే ఏ ప్రకటన చేయకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర నిరాశ నిస్పృహ లకు గురైనట్లు తెలుస్తోంది. 
ప్రధాన పార్టీల్లోకి వెళ్లడం కష్టమేనా !
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి రఘువీరా ఇమడ లేరని వినిస్తోంది. అదే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలోకి వెళ్లలేకపోతున్నారు. సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే అవుడేటెడ్ నాయకుడిగా మిగిలిపోతానేమోనని ఎప్పటికప్పుడు తన రాజకీయ ప్రకటనను రఘువీరా రెడ్డి దాటవేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చిన రాహుల్ గాంధీని కలవడానికి భారీ కాన్వాయ్ తోనే రఘువీరా వచ్చారు. ఈ సందర్భంగా రాజకీయ పునః ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటిస్తారని అనుచరులతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులందరూ భావించారు. కీలక సమయంలోనూ రఘువీరా మౌనమే మార్గం!

మధ్యలోనే వెనుదిరిగిన అనుచరులు
ఏ ప్రకటన చేయకుండా మౌనం వహించడంతో కార్యకర్తలలో నిరాశ నెలకొంది. అప్పటికే రఘువీరా నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన ఆయన అనుచరులు ఏ ప్రకటన వెలబడకపోయేసరికి మధ్యలోనే అక్కడి నుంచి నిష్క్రమించారు. ఏ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం కూడా ఓ చర్య అన్న పంథాను కాంగ్రెస్ అగ్ర నాయకులు ఫాలో అవుతుంటారు. అదే తరహాలో రఘువీరా కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. 

పూర్వవైభవం తీసుకొస్తారా, లేక రాజకీయాలకే దూరమా ! 
తన రాజకీయ భవిష్యత్తును కాలానికే వదిలేసారా..? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు అంధకారమయం అయింది. తిరిగి కాంగ్రెస్ పునరుజ్జీవం పోసుకోవాలంటే ఏవో అద్భుతాలు జరిగితే తప్ప సాధ్యం కానీ అంశం. ఈ పరిస్థితుల్లో రఘువీరా మరోసారి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తారా లేక, రాజకీయాలకే దూరం కానున్నారా అన్న చర్చ ఇప్పుడు జోరు అందుకుంది.

News Reelsఈ నెల 14వ తేదీన అనంతపురం జిల్లాలోకి రాహుల్‌ గాంధీ పాదయాత్ర ప్రవేశించింది. రఘువీరారెడ్డి చెప్పినట్లుగానే ఆ యాత్రలో నీలకంఠాపురం దేవస్థానం తరపున పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి స్వామివారి తీర్థప్రసాదాలను రఘువీరారెడ్డి అందజేశారు. నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణ పనులు చాలా ఉన్నాయని, అవి పూర్తయ్యాక రాజకీయాలపై ఆలోచిస్తానంటూ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నారు.

Also Read: అమరావతికి సపోర్ట్ - వైఎస్‌ఆర్‌సీపీపై పోరు ! ఏపీలో బలపడే వ్యూహాలతో బీజేపీ కీలక సమావేశాలు

Published at : 15 Oct 2022 01:33 PM (IST) Tags: CONGRESS Anantapur Raghuveera reddy Bharat Jodo Yatra Rahul Gandhi

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

AP News Developments Today: ఏపీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం- విజయవాడలో హాజరుకానున్న సీఎం జగన్

AP News Developments Today: ఏపీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం- విజయవాడలో హాజరుకానున్న సీఎం జగన్

వైసీపీలో ఆ వారసులకు లైన్ క్లియర్‌- ఎమ్మిగనూరు నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ !

వైసీపీలో ఆ వారసులకు లైన్ క్లియర్‌- ఎమ్మిగనూరు నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ !

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు- వణికించనున్న చలి పులి

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు- వణికించనున్న చలి పులి

AP TNSF Protest: విద్యార్థుల సమస్యలపై తెలుగుదేశం పోరుబాట- డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా టీఎన్ఎస్ఎఫ్ నిరసనలు

AP TNSF Protest: విద్యార్థుల సమస్యలపై తెలుగుదేశం పోరుబాట- డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా టీఎన్ఎస్ఎఫ్ నిరసనలు

టాప్ స్టోరీస్

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!