By: ABP Desam | Updated at : 20 May 2022 05:00 PM (IST)
అనంతపురం జిల్లాలో చంద్రబాబు (Photo Source: Twitter)
దివంగత సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి సీమలోని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. అసెంబ్లీలో తనపై వ్యక్తి గత దూషణలు చేస్తే.. .శపథం చేసి బయటకు వచ్చానని, మళ్లీ సభను గౌరవ సభగా మార్చి అసెంబ్లీకి వెళతానన్నారు. అనంతపురం సభలో చంద్రబాబు మాట్లాడుతూ... 40 శాతం సీట్లు ఈ సారి యువతకు సీట్లు ఇస్తానని చెప్పారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికీ అవకాశం ఇస్తాం అన్నారు.
వైఎస్ జగన్ పాలనలో అనంతపురం జిల్లా వెనుకబడిందని, అన్ని విషయాల్లోనూ నిర్లక్ష్యం చేశారన్నారు. హంద్రీనీవా కాలువ పనులు ఏమయ్యాయని, కాలువ విషయంలో జగన్ గాలి మాటలు చెప్పలేదా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేసే ప్రయత్నం చేయగా, ఇప్పుడు ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్‌ను పూర్తిగా ఆపేశారని గుర్తుచేశారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రావడం లేదు, కనీసం ఇన్ స్యూరెన్స్ రావడం లేదని మండిపడ్డారు.
ప్రతిచోటా జనానికి 'నేను వస్తున్నా... నేను ఆదుకుంటా' అన్న భరోసా ఇస్తూ... అడుగడుగునా కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ చంద్రబాబు గారి పర్యటన సాగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ కార్యకర్తల సమావేశం మరియు
— Telugu Desam Party (@JaiTDP) May 20, 2022
రాప్తాడులో చంద్రబాబు గారి రోడ్ షో దృశ్యాలివి
(1/2) #CBNInAnantapur2022 pic.twitter.com/zoRpqHfNYt
హంద్రీనీవా కోసం పయ్యావుల కేశవ్, భైరవానితిప్ప కోసం కాలువ శ్రీనివాసులు వెంట పడేవారని, ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో ప్రజల కోసం , రైతుల కోసం నిలిచే నేతలు కనిపించడం లేదన్నారు. క్రమశిక్షణ లేని ఇల్లు మనుగడ సాగించలేదని, పార్టీకి కూడా అదే వర్తిస్తుందని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు విచ్చలవిడిగా మాట్లాడితే కఠినంగా ఉంటాను. కార్యకర్తలు పార్టీకి నిజాయితీగా వ్యవహరించాలని, పార్టీని నిలబెట్టేది వాళ్లేనన్నారు. కార్యకర్తలు లేకపోతే నాయకులు లే, పార్టీలు లేవన్నారు.
ముందుగా అభ్యర్థులను ప్రకటించాలని కార్యకర్తలు కోరుతున్నారు.
దొంగ ఓట్లపై అలర్ట్ అవండి
వైఎస్సార్‌సీపీ దొంగ ఓట్లపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి. పులివెందుల బస్ స్టాండ్ కట్టలేని జగన్.. మూడు రాజధానులు కడతాడా అని ఎద్దేశా చేశారు. పార్టీ నాయకులు నా చుట్టూ తిరిగితే లాభం లేదన్నారు. కార్యకర్తల కోసం పని చెయ్యాలని, సమర్థత, పని తీరు చూసి ముందుగా ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటిస్తాని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తన దగ్గరకు వచ్చి మోహమాట పెట్టడం ఇకపై కుదరదని, తన వయసు 72 ఏళ్లు కానీ 27 ఏళ్ల వాడిలా పని చేస్తానంటూ టీడీపీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ అనే యాప్ ను ప్రారంభిస్తున్నామని, కార్యకర్తలకు వైద్యం కోసం ప్రముఖ అసుపత్రులతో ఒప్పందం చేసుకుందాం అని వారికి గుడ్ న్యూస్ చెప్పారు.
CM Jagan Speech: ఏపీలో విద్యార్థులకు ఫ్రీగా ట్యాబ్‌లు, ఎప్పుడిస్తారో చెప్పిన సీఎం జగన్ - విద్యాకానుక కిట్ల పంపిణీ
Rains in AP Telangana: నేటి నుంచి 48 గంటలపాటు వర్షాలు, ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్ - ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
Rain Updates: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణకు వాతావరణం ఇలా
Rain Updates: ఏపీలో ఆ జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలు - తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ
AP Government On Bamboo: వెదురు పెంచితే సూపర్ ఆఫర్- మీ తోటలో పెంచినా రాయితీ
Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?
MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు
Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్
RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?