News
News
X

Rayalaseema Faction Movies: ఆ సినిమాలతో మా జీవితాలు నాశనం, భవిష్యత్ లేదు: రాయలసీమ నేతల ఆవేదన

నేతల వల్ల జరిగిన నష్టం తమను బాధిస్తుంటే, సీమ ఫ్యాక్షనిజం, రౌడీయిజం, రక్తపాతం అంటూ సినిమాలు తమకు మరింత నష్టాన్ని చేకూర్చాయన్నారు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి.

FOLLOW US: 
Share:

Byreddy Rajasekhar Reddy fires on Rayalaseema Faction Movies:  75 ఏళ్లుగా రాయలసీమకు నేతలు మోసాలు చేశారని.. హోస్పేట డ్యామ్, బళ్లారి జిల్లా పోయింది. వచ్చింది అనుకున్న రాజధాని మూడేళ్లకే పోగొట్టుకున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి- బ్యారేజ్ నిర్మించాలని, దాంతోపాటు అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోకపోతే రాయలసీమకు నీటి చుక్క కూడా మిగలదన్న ఆయన తమ ప్రాంతానికి సినిమాల వల్ల చాలా నష్టం జరిగిందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి ఆరోపించారు. నేతల వల్ల జరిగిన నష్టం తమను బాధిస్తుంటే, సీమ ఫ్యాక్షనిజం, రౌడీయిజం, రక్తపాతం అంటూ సినిమాలు తమకు మరింత నష్టాన్ని చేకూర్చాయన్నారు. ఇకనైనా సీమకు నష్టం కలిగించే సినిమాలు తీయకూడదని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే తాను కథలు రాసిస్తా అన్నారు. కళియుగ అపర దానకర్ణుడు బుట్టా వెంగళరెడ్డి కథ రాసిస్తాను మీరు సినిమా తీసుకోండి అని సూచించారు. 

సీమ ఫ్యాక్షన్ సినిమాలపై బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
‘రాయలసీమ వాళ్లంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు సినిమా వాళ్లు. ఇక్కడికి పెట్టుబడులు రావు. ఎందుకంటే కాశ్మీర్ మాదిరిగా రాయలసీమలో దారుణాలు జరిగాయని చూపించి నాశనం చేశారు సినిమా వాళ్లు. మీకు కథలు కావాలంటే చెప్పండి. కళియుగ అపర దానకర్ణుడు బుట్టా వెంగళరెడ్డి కథ రాసిస్తాను మీరు సినిమా తీసుకోండి. కడప రెడ్డమ్మ 1991లో తీయగా, అంతపురం 1998లో వచ్చింది. సమరసింహారెడ్డి 1999, నరసింహనాయుడు 2001లో, ఇంద్ర 2002లో, చెన్నకేశవరెడ్డి, భరతసింహారెడ్డి అని రక్తపాతం చూపించి వసూళ్లు సాధించారు. ఆది సినిమా కూడా 2002లో వచ్చింది. ఒక్కడు 2003, సాంబ 2004, భద్ర 2005, మర్యాదరామన్న 2010, రక్తచరిత్ర పార్ట్ 1, పార్ట్ 2, అరవింద సమేత 2018, జాంబిరెడ్డి, వీరసింహారెడ్డి 2023 సినిమా కూడా మన మీదనే తీశారా అంటూ ఆశ్చర్యపోయారు. ఇలా సినిమాలు తీసి తమ కల్చర్ ను నాశనం చేశారని, ఇకనుంచి తమ జీవితాల్లో మార్పులు, మహానుభావుల గురించి సినిమా తీయాలని.. అంతేకాని కొండారెడ్డి బురుజు వద్ద ఆరుగుర్ని చంపినట్లు రక్తపాతం చూపించి డబ్బులు రాబట్టుకున్నారని’ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

రాయలసీమ నష్టపోవడానికి, తమకు అన్యాయం జరగడానికి రాజకీయ నాయకులతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా కారణమని అన్నారు. తమ ప్రాంతం కోసం ప్రాణాలు అర్పించేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారని, ఉంటే తింటాం లేకపోతే గంజి తాగి బతికే తమను సినిమాల్లో రౌడీలు, గూండాలు, ఫ్యాక్షనిస్టులుగా చూపించి పెట్టుబడులు రాకుండా చేశారని ఆరోపించారు. ఓ ప్రాంతం మీ కళ్ల ముందు నాశనం అవుతుంటే సిగ్గులేకుండా సినిమాలు తీసి తమ జీవితాల్ని, భవిష్యత్తును లేకుంగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ తమ ప్రాంతం వారు హైదరాబాద్ కు, లేక చెన్నైకి వలస వెళ్లి బతికే పరిస్థితి కొనసాగుతుందన్నారు. నిరుద్యోగ సమస్య దేశంలో ఎక్కడా లేనంతగా తమ ప్రాంతంలో ఉందని, దీనికి కారణం అయిన వాళ్లందర్నీ యువత వెంటాడుతారని చెప్పారు. 

ఇక నుంచి ఇలాంటి సీమ ఫ్యాక్షన్, సీమలో రక్తపాతం లాంటి సినిమాలు తీయడం నిలిపివేయాలని సినిమా వాళ్లకు బైరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఓవైపు తమకు భవిష్యత్ లేకుండా పోతుంటే, ఇక్కడ లేని వాతావరణాన్ని సినిమాల్లో రక్తపాతం, ఫ్యాక్షనిజంగా చూపించి కలెక్షన్లు రాబట్టుకోవడం సరికాదన్నారు. యోగి వేమన, అన్నమయ్య పుట్టిన గడ్డ, కన్నప్ప పుట్టిన గడ్డ రాయలసీమ అని.. కానీ డబ్బులు వస్తాయని రాయలసీమలో రక్తపాతం చూపించి సొమ్ము చేసుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. తాను చిన్నప్పుడు భారత్, పాక్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ జోలె పట్టుకుని వస్తే.. మహిళలు తమ తాళిబొట్లు సైతం మన సైన్యం కోసం దానం చేశారని గుర్తుచేసుకున్నారు. స్టంట్ మాస్టర్ లేకుండా సినిమాలు చేయలేరు కానీ, పేరున్న రాయలసీమ వాసులు ఆ సినిమాలతో ఎంతో నష్టపోయారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పదే పదే పేర్కొన్నారు. 

Published at : 05 Feb 2023 07:55 PM (IST) Tags: Rayalaseema AP News Veera Simha Reddy Byreddy Rajasekhar Reddy Rayalaseema Parirakshana Samithi

సంబంధిత కథనాలు

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

మరోసారి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు

మరోసారి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

KGBV: కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?

KGBV: కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?

APOSS SSC Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APOSS SSC Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం