Crime News: సెల్‌ఫోన్ పోయిందా ఇలా ఫిర్యాదు చేయండి- శుభవార్త చెప్పిన అనంతపురం పోలీసులు
అనంతపురం జిల్లా వాసులకు పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. సెల్‌ఫోన్ చోరీకి గురైనా కనిపించకుండా పోయిన తర్వాత ఫిర్యాదు చేయడానికి ఓ ఫోన్ నెంబర్ ఇచ్చారు.
అనంతపురం జిల్లాలో కొన్ని రోజులుగా జరుగుతున్న దంగతనాలకు చెక్ పెట్టారు అనంత పోలీసులు. రెండు పెద్ద ముఠాలను పట్టుకొని కేసులు పెద్ద అప్‌డేట్ సాధించారు.
అనంతపురం జిల్లాలో కొన్ని రోజులుగా భారీగా దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో పార్థీ గ్యాంగ్ హస్తం ఉందని పోలీసులు మొదటి నుంచి అనుమానిస్తూ వచ్చారు. చివరకు ఆ గ్యాగ్‌లోని కీలకంగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు.
ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలో నేరాలు చేసిన మోస్ట్ వాంటెడ్ నిందితుడు పార్థి గ్యాంగ్ సభ్యుడు డోల్ సింగ్ కాలేను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. డోల్ సింగ్ కాలే నుంచి 12 లక్షలు విలువైన 218 గ్రాముల బంగారం, 2 కేజీల 600 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈనెల 3న అనంతపురంలో డోల్ సింగ్ కాలే పాల్పడిన హౌస్ బ్రేకింగ్ కేసులో మొత్తం సొత్తును పోలీసులు రికవరీ చేయగలిగారు. డోల్ సింగ్ కాలేపై మహారాష్ట్రలో 4 దొంగతనం కేసులు, తెలంగాణ రాష్ట్రంలో 17 దొంగతనం కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో ఒక కేసు ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని పరిశీలించి ఆయా రాష్ట్రాలు కోరితే కాలేను పంపిస్తామన్నారు పోలీసులు.
దొంగతనాలకు పాల్పడుతున్న మరో గ్యాంగ్‌ను కూడా పట్టుకున్నట్టు అనంతపురం జిల్లా పోలీసులు తెలిపారు. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్న సత్తెనపల్లి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు.
సత్తెనపల్లి ముఠాకు చెందిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బిగబండ గ్రామానికి చెందిన కుంచాలా నాగరాజు, డేరంగుల అంకమ రావును అరెస్టు చేసినట్టు చూపించారు అనంతపురం జిల్లా పోలీసులు. వీరి నుంచి రూ.14 లక్షలు విలువ చేసే 28 తులాల బంగారు ఆభరణాలు, రూ. 40,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు.
సత్తెపల్లి గ్యాంగ్‌పై ఒంగోలులో 5, చీరాలలో 1 , గుంటూరులో 3, తమిళనాడు రాష్ట్రం వేలూరులో 4, బెంగళూరులో 3 కేసులు కలిపి మొత్తం 16 కేసులు ఉన్నాయిని వెల్లడించారు అనంతపురం పోలీసులు. 20 రోజుల కిందట చోరీకి గురైన 135 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు జిల్లా పోలీస్. మరోసారి 125 సెల్ ఫోన్లు రికవరీ చేశారు.
ఇకపై సెల్‌ఫోన్లు చోరీకి గురైతే 9440796812నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీని వల్ల నెంబర్‌ను ట్రేస్ అవుట్ చేసి కనిపెడతామంటున్నారు. సెల్‌పోయిన వెంటనే ఫిర్యాదు చేస్తే మరింత సులభతరమవుతుందని చెబుతున్నారు పోలీసులు.