JP Nadda AP Tour: నేడు ఏపీ పర్యటనకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పూర్తి షెడ్యూల్ ఇదే
JP Nadda To Visit AP: ప్రధానిగా నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈవెంట్లలో భాగంగా నేడు ఏపీకి జేపీ నడ్డా రానున్నారు.
![JP Nadda AP Tour: నేడు ఏపీ పర్యటనకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పూర్తి షెడ్యూల్ ఇదే JP Nadda AP Tour: BJP National President Nadda to tour Andhra Pradesh on June 6 and 7, Know Full Details JP Nadda AP Tour: నేడు ఏపీ పర్యటనకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పూర్తి షెడ్యూల్ ఇదే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/06/1ea1807de3213078d81719a9c444e73d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
JP Nadda To Tour AP: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP National President JP Nadda) నేటి నుంచి రెండు రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈవెంట్లలో భాగంగా నేడు ఏపీకి జేపీ నడ్డా రానున్నారు. ఏపీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా విజయవాడ, రాజమహేంద్రవరాల్లో పలు కార్యక్రమాలకు హాజరు అవుతారు. నేడు విజయవాడలో బీజేపీ శక్తికేంద్రాల ఇన్‌చార్జీలు, కోర్ కమిటీ నేతలతో భేటీలలో పాల్గొననున్న జేపీ నడ్డా, మంగళవారం సాయంత్రం రాజమండ్రిలో బహిరంగ సభకు హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏపీకి రానుండటంతో పార్టీ శ్రేణులలో నూతనోత్సాహం కనిపిస్తోంది. బీజేపీ, జనసేన కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించాలని జనసేన నేతల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
జేపీ నడ్డా ఏపీ పర్యటన షెడ్యూల్..
నేటి (జూన్ 6న) ఉదయం ఢిల్లీ నుంచి బయలురేరనున్న జేపీ నడ్డా ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి 17 కిలోమీటర్లు కారు ర్యాలీతో సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డుకు చేరుకుంటారు.
అనంతరం విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ కాలేజీ గ్రౌండ్‌లో శక్తికేంద్రాల ఇన్‌చార్జీల సమావేశానికి జేపీ నడ్డా హాజరవుతారు.
మధ్యాహ్నం 2 లేదా 2:15 గంటలకు సిద్ధార్థ ఫార్మసీ కాలేజీ నుంచి నోవోటెల్ హోటల్‌కు చేరుకుంటారు.
అనంతరం హోటల్‌లోనే ఆయన లంచ్ చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు
సాయంత్రం 6 గంటలకు నోవోటెల్ నుంచి వెన్యూ ఫంక్షన్‌హాల్‌కు వెళతారు. అక్కడ విజయవాడ నగర, ఎన్టీఆర్ జిల్లా పురప్రముఖులతో సమావేశమవుతారు. దాదాపు 400 మంది వరకు సమావేశంలో పాల్గొంటారు.
రాత్రి 7:30 తరువాత తిరిగి నోవోటెల్ హోటల్‌కు చేరుకుంటారు.
అనంతరం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య బీజేపీ ఏపీ కోర్ కమిటీ, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై పార్టీ భవిష్యత్ వ్యూహాలపై జేపీ నడ్డా చర్చిస్తారు.
రాత్రి 9 గంటలకు హోటల్‌లోనే డిన్నర్ చేసి, రాత్రి అక్కడే బస చేయనున్నారు.
రాత్రికి విజయవాడలోనే బసచేసి, మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకుని రాజమహేంద్రవరం వెళతారు. అక్కడ కేంద్ర పభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశమవుతారు. సాయంత్రం రాజమండ్రిలో నిర్వహిస్తున్న బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)