అన్వేషించండి

JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి అంతే - తన ప్రవర్తనపై తానే దీక్ష - తాడిపత్రిలో కొత్త రాజకీయం!

Tadipatri: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష చేస్తున్నారు. ఎవరిపైనో నిరసనగా ఆయన దీక్ష చేయడం లేదు. తన ప్రవర్తనపై తానే దీక్ష చేస్తున్నారు.

JC Prabhakar Reddy behavior: జేసీ ప్రభాకర్ రెడ్డి .. ఈ పేరు గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఆయన ఒక్క సారే ఎమ్మెల్యే అయ్యారు కానీ.. మళ్లీ మున్సిపల్ వార్డు మెంబర్ గా పోటీ చేసి గెలిచి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఎందుకంటే ఊరుని అభివృద్ధి చేసుకోవాలని అంటున్నారు.  ఆయనకు ఊరు మీద అంతటి ప్రేమ ఉంటుంది. హఠాత్తుగా ఆయన దీక్ష ప్రారంభించారు. కొత్త ఏడాదిలో ఆయన దీక్షచేస్తున్నారంటే అందరూ ఏదో లొల్లి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఆయన దీక్ష ఈ సారి వెరైటీగా ఉంది. 

తన ప్రవర్తన గురించి తాడిపత్రిలో అందరూ ఏవోవో అనుకుంటున్నారని.. అందరూ తన కోపాన్నే చూస్తున్నారని కానీ తన లక్ష్యం ఊరుని బాగు చేసుకోవడానికేనని ఆయన చెబుతున్నారు. తాడిపత్రి కోసం ఎన్ని పనులు చేశాను.   తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా తాను ఎంత నిధులు ఖర్చు చేశాను, ఏ ఏ అభివృద్ధి పనులకు ఎంత వెచ్చించాను అనే వివరాలను ఫ్లెక్సీలో ముద్రించి  తన దీక్ష దక్షర ఏర్పాటు చేశారు.   గాంధీ బొమ్మ సెంటర్ లో దీక్షా వేదిక ఏర్పాటు చేస్తున్న ఆయన  తన మనసులోని అభిప్రాయాలను ప్రజలకు చెప్పారు. తన ప్రవర్తనపై ప్రజల్లో అపోహల ుఉన్నాయని  ప్రజల అభిప్రాయం మేరకే తన ప్రవర్తనను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 2026లో తాడిపత్రిని మరింత అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. ప్రజలకు ఏమైనా సందేహాలుంటే తనను నేరుగా సంప్రదించేందుకు ఫోన్ ద్వారా కూడా అందుబాటులో ఉంటానని చెబుతున్నారు.  వారు అడిగే ప్రతి రూపాయికి లెక్క చెప్తా అని ప్రకటించారు. 

జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవలి కాలంలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారన్న అభిప్రాయాలు పట్టణ వాసుల్లో ఉన్నాయి. ఆయన తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతూండటంతో ఆయన ఇలా తనను సరిదిద్దాలని దీక్ష చేపట్టారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. తాడిపత్రి మున్సిపల్ కు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా తన పనితీరును ప్రజల ముందు పెట్టారని.. అంటున్నారు. వివాదాస్పద అంశాల విషయాలనూ మార్చుకుంటానని ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారుతోంది. 

దేశంలోని అత్యుత్తమ మునిసిపాలిటీల్లో ఒకటిగా తాడిపత్రి గుర్తింపు పొందింది. అయితే అక్కడ రాజకీయాల కారణంగా ఎప్పుడూ తాడిపత్రి అభివృద్ధి గురించి పెద్దగా ప్రచారంలోకి రాదు.  ఆ నగరంలో పచ్చనదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఇంటి ముందు చెట్లు పెంచకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి అంగీకరించరు. ఆయన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన మున్సిపాలిటీ చైర్మన్ గా పని చేసేవారు.  ఊరు విషయంలో ప్రతి విషయాన్ని ఆయన చాలా జాగ్రత్తగా డీల్  చేస్తారు.                                            

 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu and JP Nadda: ఏపీలో కీలక ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu and JP Nadda: ఏపీలో కీలక ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చించిన సీఎం చంద్రబాబు
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
Gannavaram MLA Yarlagadda: డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
Gannavaram MLA Yarlagadda: డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
BRICS Summit 2026: ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
బ్రిక్స్ సమ్మిట్ 2026.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
Shobha Shetty: రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శోభా శెట్టి... మంత్రాలయంలో స్వామి దర్శనం
రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శోభా శెట్టి... మంత్రాలయంలో స్వామి దర్శనం
Rithu Chowdary: తనూజ వెబ్ సిరీస్‌పై రీతూ చౌదరి కామెంట్స్... కళ్యాణ్ పాటపై ఏమన్నారంటే?
తనూజ వెబ్ సిరీస్‌పై రీతూ చౌదరి కామెంట్స్... కళ్యాణ్ పాటపై ఏమన్నారంటే?
Avengers End Game Advance Bookings : విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
Embed widget