Janasena News : కొత్త పరిశ్రమల విధానం పేరుతో సీఎం బినామీ కంపెనీలకు భూములు - మరో స్కాం బయట పెట్టిన జనసేన !
Nadendla Manohar : కొత్త పారిశ్రామిక విధానం పేరుతో భూములను సొంతం చేసుకున్నారని జనసేన ఆరోపించింది. ఇండోసోల్ కు వేల ఎకరాలు కట్టబెట్టిన వ్యవహారంపై సంచలన విషయాలను నాదెండ్ల మోనోహర్ వెల్లడించారు.
![Janasena News : కొత్త పరిశ్రమల విధానం పేరుతో సీఎం బినామీ కంపెనీలకు భూములు - మరో స్కాం బయట పెట్టిన జనసేన ! Janasena News : Expropriation of land in the name of new industrialization Janasena News : కొత్త పరిశ్రమల విధానం పేరుతో సీఎం బినామీ కంపెనీలకు భూములు - మరో స్కాం బయట పెట్టిన జనసేన !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/17092bba1495bacdc22e060fa25056ad1700054073000228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Janasena News : ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన పారిశ్రామిక విధానం సీఎం జగన్ బినామీ కంపెనీలకు భూములు కట్టబెట్టడానికేనని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో రోజుకో స్కామ్ అనే నినాదంతో రెండో రోజు ప్రెస్ మీట్లో ఇండస్ట్రీస్ శాఖలో కుంభకోణంపై శ్రీ నాదెండ్ల మనోహర్ వివరాలు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ కేబినెట్ న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ అనే విధానాన్ని ఆమోదించిందvf.. ఇది కేవలం సీఎం కి అత్యంత సన్నిహితమైన రెండు మూడు కంపెనీల కోసమే ఈ పాలసీ తీసుకువచ్చారvdvejg. ఈ పాలసీ పేరుతో వైసీపీ వాళ్ళు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రామాయపట్నం పోర్టు దగ్గర ఇండోసోల్ అనే కంపెనీకి 5,148 ఎకరాలు కేటాయించింది. తొలుత 10 సం. లీజు అని చెప్పారు. కొత్త పాలసీ పేరుతో ఆ కంపెనీ కాస్తా ఆ భూమికి లీజుకు తీసుకున్నట్లుగా కాకుండా ఓనర్ కి మారిందన్నారు. లీజు పేరుతో కేటాయించిన భూమి తాలూకు సర్వహక్కులను ఇండోసోల్ కి ధారదత్తం చేసి యజమానిని చేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అక్కడితో వీరి దోపిడీ ఆపలేదు. మరో 3200 ఎకరాలు పొందే విధంగా ప్రభుత్వమే ఫెసిలిటేటర్ గా వ్యవహరించబోతుందన్నారు. మొత్తంగా 8348 ఎకరాలను ఇండోసోల్ కి కట్టబెట్టారన్నారు.
ఇంతకీ ఈ ఇండోసోల్ సంస్థ వెనక ఉన్నది ఎవరంటే... షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదో కాదు ముఖ్యమంత్రి సన్నిహితులదేనన్నారు. అసలు ఇండోసోల్ అనే సంస్థ పుట్టి ఈ రోజుకి 1 సంవత్సరం 9 నెలల 12 రోజులు మాత్రమే అయిందని.. అంటే ఏడాది కిందట సృష్టించిన డమ్మీ కంపెనీ పేరుతో భూ దోపిడీ కోసం న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ తెచ్చారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
రూ. లక్ష షేర్ క్యాపిటల్ పెట్టుబడి పెట్టిన ఇండోసోల్ కంపెనీకి ఒక సంవత్సరం ఏడు నెలల్లో రూ. 76 వేల కోట్ల ప్రాజెక్టులు సీఎం జగన్ కట్టబెట్టారని ఇప్పటికే విపక్షాలు తీవ్రమైన ఆరోపణలుచేశాయి. వేల కోట్ల ప్రాజెక్టులు సొంతం చేసుకున్న ఇండోసోల్ కంపెనీ ఇడుపులపాయలో పుట్టిందని చెబుతున్నారు. వేల కోట్ల పెట్టుబడులు చేజిక్కించుకుంటున్న ఇండోసోల్ కు చెందిన నర్రా విశ్వేశ్వర్ రెడ్ది జగన్ రెడ్డి బినామీగా టీడీపీ, జనసేన కూటమి ఆరోపిస్తోంది. పెట్టుబడులు పెట్టిన అయిదు నెలల్లో ఇండోసోల్ నుంచి 49 శాతం షేర్లు అరబిందో గ్రూపు కొనేసిందని, మిగిలిన వాటిల్లో షేర్లు కొనుగోలు కోసం మరో జపనీస్ కంపెనీ వచ్చిందని, ఇది పెద్ద కుంభకోణమని టీడీపీ నేతలు గతంలో వివరాలు బయట పెట్టారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్.. ఆ కంపెనీ భూములు లీజుకు కాకుండా పూర్తిగా అమ్మకం పద్దతిలో వేల ఎకరాలు ఇచ్చేసినట్లుగా బయట పెట్టడంతో రాజకీయంగా సంచలనం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)