Delhi Election Results 2025: ఢిల్లీ ఫలితాలు- ఎర్లీ ట్రెండ్స్‌లో కేజ్రీవాల్‌కు బీజేపీ బిగ్ షాక్ ! ఆప్ టైమ్ ముగిసిందా?
Delhi Results | ఢిల్లీ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ గమనిస్తే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ బిగ్ షాక్ ఇచ్చింది. గతంలో కనీసం పది స్థానాలు కూడా నెగ్గని బీజేపీ ఆధిక్యంలో ఉంది.

Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. పటిష్ట బందోబస్తు మధ్య అధికారులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు. దాదాపు 19 కౌంటింగ్ కేంద్రాల వద్ద దాదాపు 10000 మంది పోలీసులను మోహరించి ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహిస్తోంది ఈసీ. 9 గంటల అనంతరం బీజేపీ 45 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార ఆప్ 23 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది.
ఎర్లీ ట్రెండ్స్ ఏం చెబుతున్నాయి..
ఉదయం 8:18 గంటలకు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార పార్టీ ఆప్ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. అరవింద్ కేజ్రీవాల్‌ను నాలుగోసారి గెలిపిస్తారా లేదా అని ఉత్కంఠ నెలకొంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ కు బీజేపీ, కాంగ్రెస్ నుంచి గట్టిపోటీదారులు ఉన్నారు. బీజేపీ నుంచి పర్వేష్ వర్మ తనదే విజయమని ధీమాగా ఉన్నారు. లేక ఢిల్లీ ప్రజలు మాజీ సీఎం షీలా దీక్షిత్ వారసుడివైపు మొగ్గు చూపుతారా అని భావిస్తున్నారు. షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ను ప్రజలు గెలిపిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో 56.41 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.
8.30 గంటలకు గమనిస్తే బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆప్ 21 స్థానాల్లో ముందంజలో ఉంది. ఓ చోట కాంగ్రెస్ అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికార ఆప్ పుంజుకుంది. 9 గంటల సమయానికి చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో, బీజేపీ 27 స్థానాల్లో ముందుంజలో ఉన్నాయి. దాంతో ఢిల్లీ ఎన్నికల్లో ఆధిక్యం క్రమంగా మారుతోంది. బీజేపీ, ఆప్ నువ్వానేనా అన్నట్లుగా ఫలితాలలో ఫైట్ చేస్తున్నాయి. ఎర్లీ ట్రెండ్స్ తో బీజేపీలో ఆశలు చిగురించాయి.
#ResultsOnABP LIVE | शुरू हो गई वोटों की गिनती, जानिए आपकी सीट पर कौन चल रहा है आगे?#DelhiElections2025 #DelhiResults #ABPNews https://t.co/hTC5PaN76C
— ABP News (@ABPNews) February 8, 2025
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. కనీస మెజార్టీ 36 సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ఫిబ్రవరి 5న ఒకే దశలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 60.54 ఓటింగ్ నమోదైంది. బీజేపీ గెలిచే అవకాశాలున్నట్లు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తాము నాలుగోసారి గెలుస్తామని ఆప్ చెబుతోంది. 2013 చివరి నుంచి ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

