Janasena News : వారాహి యాత్రకు వర్షం ఎఫెక్ట్ - మలికిపురం సభ వాయిదా !
వర్షం కారణంగా జనసేన మలికిపురం సభ వాయిదా పడింది. ఆదివారం వర్షం పడకపోతే నిర్వహించే అవకాశం ఉంది.
Janasena News : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేస్తున్న వారాహి యాత్ర కు వర్షం అడ్డంకిగా మారింది. డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా... రాజోలు నియోజకవర్గం మలికిపురంలో నేడు జరగనున్న వారాహి సభ వాయిదా వేసినట్లుగా జనసేన ప్రకటించింది. సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాయిదా నిర్ణయం తీసుకున్నారు. రేపటి వాతావరణ పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటారు.
భారీ జన సందోహం మధ్య సాగుతున్న యాత్ర
రాష్ట్రం బాగుండాలంటే ప్రభుత్వం మారాలి, జనం బాగుండాలంటే జగన్ పోవాలి.. హలో ఏపీ బైబై వైసీపీ అనే నినాదాలతో వారాహియాత్రను పవన్ కొనసాగిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఫీల్డ్ విజిట్ తో పాటు వివిధ వర్గాల వారితో సమావేశం అవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అన్ని వర్గాలతో మమేకం అవుతూ యాత్ర సాగిస్తూ.. తీరిక లేకుండా గడుపుతున్నారు.
పవన్ వారాహి యాత్ర సూపర్ హిట్టేనా ? వైఎస్ఆర్‌సీపీ రియాక్షన్ చెబుతోంది అదేనా ?
ఉపవాస దీక్షలో పవన్ కల్యాణ్
జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఉపవాస దీక్ష ఆచరిస్తున్నారు. జూన్ 19 వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. మంగళవారం నుంచే దీక్ష మొదలుపెట్టారు. ఈ దీక్షను కార్తీక మాసం చివరి వరకు కొనసాగించనున్నారు. అదే సమయంలో, గురుపౌర్ణమి నాటి నుంచి చాతుర్మాస దీక్షను కూడా ఎప్పటిలాగానే ఆచరించనున్నారు.
ఉపవాస దీక్ష సమయంలో పవన్ కల్యాణ్ పాలు, పండ్లు మాత్రమే తీసుకోనున్నారు. ఇటీవల వారాహి యాత్ర ప్రారంభానికి ముందు పవన్ కల్యాణ్ మంగళగిరిలో ధర్మయాగం నిర్వహించారు. అప్పటి నుంచి ఆయన శాకాహారానికి మాత్రమే పరిమితం అయ్యారు.
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు- అకస్మత్తుగా ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి
కాస్త నీరసంగా పవన్ కల్యాణ్
దీక్ష కారణంగా ఫ్రూట్స్ మాత్రమే తింటూ ఉండటం.. తీరిక లేకుండా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూండటంో.. పవన్ కల్ాయమ్ కు కాస్త నీరసం ఏర్పడిందని చెబుతున్నారు. ఈ కారమంగా శుక్రవారం అతి కష్టం మీద బహిరంగభలో రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఈ రోజు వర్షం కరణంగా విశ్రాంతి లభించడంతో పూర్తి స్తాయిలో కోలుకుంటారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial