(Source: ECI/ABP News/ABP Majha)
Jagananna Thodu: ఇవాళ 'జగనన్న తోడు' వడ్డీ జమ.. ఎంత మంది లబ్ధిదారులంటే..?
జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఇవాళ వడ్డీని జమ చేయనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేస్తారు.
ఏపీలో అధిక వడ్డీల భారి నుంచి చిరు వ్యాపారులను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం జగనన్నతోడు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇవాళ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. 2021 నాటికి సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్ధిదారులకు రూ.16.36 కోట్ల వడ్డీని ప్రభుత్వం లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది.
జగనన్న తోడు పథకం క్రింద బ్యాంకుల్లో ఒక్కోక్క చిరు వ్యాపారులకు ఏటా 10 వేల రుపాయలు వరకు వడ్డీలేని రుణాన్ని అందిస్తోంది. పది వేల రుపాయలకు ఏడాదికి అయ్యే వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్దిదారులకు అందిస్తుంది. ఇప్పటివరకు మొత్తం 9,05,458 మంది లబ్ధిదారులకు రూ. 905 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించింది. నిరుపేదలైన చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10,000 వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందజేస్తుంది.
చిరు వ్యాపారులు.. వడ్డీ వ్యాపారుల భారిన పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం జగనన్న తోడు పథకం తెచ్చింది. తొలిదశలో 2020 నవంబర్‌లో రుణాలు తీసుకుని 30 సెప్టెంబర్, 2021 నాటికి సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వడ్డీ చెల్లిస్తుంది. జూన్ 2021లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించే లబ్ధిదారులకు కూడా వారి రుణ కాల పరిమితి ముగియగానే వడ్డీని తిరిగి ప్రభుత్వమే చెల్లిస్తుంది. జగనన్న తోడు పథకం కింద ఇవాళ రూ.16.36 కోట్ల వడ్డీని 4,50,546 మంది లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది ప్రభుత్వం.
Also Read: టీడీపీ ఆఫీసులపై దాడులు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం... సీఎం, డీజీపీలకు తెలిసే దాడులు జరిగాయి... చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
Also Read: టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ
Also Read: ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయమనం పాటించండి : డీజీపీ ఆఫీస్
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి