Jagan meeting with MLCs : ఎమ్మెల్సీలతో జగన్ భేటీ - మండలిలో టీడీపీకి చుక్కలు చూపించాలని సూచన !
Andhra Politics : వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం అయ్యారు. మండలిలో టీడీపీని ముప్పుతిప్పలు పెట్టాలని సూచనలు చేశారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని జగన్ వారికి హామీ ఇచ్చారు.
Jagan had a meeting with MLCs : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో సమవేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై దేశవ్యాప్త చర్చ జరగాల్సి ఉందన్నారు. అదే సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా రానందున మన వాయిస్ వినిపించకుండా అధికారపక్షం కుట్ర చేసే అవకాశం ఉందని .. అందుకే మనకు బలం ఉన్న శాసనమండలిలో గట్టిగా పోరాడాలని ఎమ్మెల్సీలకు సూచించారు.
ప్రభత్వ పరంగా బటన్ నొక్కిన పథకాలకు ఇంకా నిధులు ఇవ్వలేదని జగన్ ఎమ్మెల్సీలకు చెప్పారు. చంద్రబాబు చేసే తప్పులు శిశుపాలుడి తప్పుల్లా లెక్కిద్దామన్నారు. కొంత సమయం ఇచ్చి పోరాడదామని సూచించరు. సీట్లు తక్కువగా వచ్చినప్పటికీ నలభై శాతం మంది ప్రజలు మన వైపు ఉన్నారని జగన్ వారికి భరోసా ఇచ్చారు. అవసరం అయితే రాను త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తానన్నారు. మనం చేసిన మంచి ప్రజలకు గుర్తు ఉందన్నారు.
శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ
శాసనసభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ కారణంగా వారికి అసెంబ్లీలో మాట్లాడే సమయం కూడా పెద్దగా రాదు. అయితే శాసనమండలిలో మాత్రం వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58 కాగా వైఎస్ఆర్సీపీకి 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. టీడీపీకే కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మంచి మెజార్టీ ఉన్నందున శాసనమండలిలో ప్రభుత్వాన్ని అడ్డుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
పవన్ కల్యాణ్ చదివింది పదో తరగతి- పుట్టింది చీరాలలో - ఇదిగో క్లారిటీ!
గతంలో టీడీపీకి మెజార్టీ - ఇప్పుడు రివర్స్
2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ లేదు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకే ఎక్కువ మెజార్టీ ఉంది. ఈ కారణంగా రాజధాని బిల్లులను పాస్ చేయించుకోలేకపోయారు. ఆ బిల్లు సలెక్ట్ కమిటీకి వెళ్లింది. రాను రాను టీడీపీ సభ్యులు పదవి విరమణ చేయడంతో.. ఆ స్థానాలను అసెంబ్లీ, స్తానిక సంస్థలు, గవర్నర్ కోటాలతో తమ పార్టీ నేతలను నియమించారు. ఫలితంగా వైసీపీకి మెజార్టీ వచ్చింది.
టీడీపీ కేబినెట్‌లో కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యత తగ్గిందా ? సీనియర్ నేతలకు పదవుల యోగం లేదా ?
ఈ సారి పదవి విరమణ చేసే ఎమ్మెల్సీ సీట్లన్నీ టీడీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో కూడా ఒకటి, రెండు ఎమ్మెల్సీలు వైసీపీకి దక్కే అవకాశాలు లేవు.