Minister Pawan Kalyan: పవన్ కల్యాణ్ చదివింది పదో తరగతి- పుట్టింది చీరాలలో - ఇదిగో క్లారిటీ!
Pawan Kalyan: జనసేన పవన్ కల్యాణ్ ఎప్పుడూ చెప్పినట్టుగానే ఆయనకు చదువు వంటబట్టలేదు. పదోతరగతితోనే పుల్‌స్టాప్ పెట్టేశారు. అధికారికంగా దీనిపై క్లారిటీ వచ్చింది.
Janasena Chief Pawana Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. శాఖపై క్లారిటీ వస్తే ఇవాళ రేపు బాధ్యతలు కూడా తీసుకుంటారు. పిఠాపురం నుంచి విజయం సాధించిన పవన్ కల్యాణ్‌కు సంబంధించిన వ్యక్తిగత వివరాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ వివరాలు ఉన్నాయి.
అసలు పవన్ కల్యాణ్ ఏం చదువుకున్నాడని చాలా మంది ప్రత్యర్థులు ట్రోల్ చేస్తుంటారు. అయితే చాలా సందర్భల్లో పవన్ మాత్రం తనకు చదువు అబ్బలేదని చెప్పేవారు. ఇన్నాళ్లకు ఆయన చదువు విషయం బయటకు తెలిసింది.
పవన్ కల్యాణ్ పదోతరగతి మాత్రమే చదివారు. ఇప్పుడు ఎస్‌ఎస్‌సీగా పిలిచే పదోతరగతి అప్పట్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీగా చెప్పుకునే వాళ్లు. 1984లో నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి పవన్ కల్యాణ్ పదోతరగతి పూర్తి చేశారు.
పవన్ కల్యాణ్ చీరాలలో 2 సెప్టెంబర్ 1968లో జన్మించారు. 2008లో ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్... 2014లో జనసేన స్థాపించారు. పదేళ్ల తర్వాత అంటే 2024లో ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు.
పిఠాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పవన్ కల్యాణ్ శాశ్వత నివాసం మంగళగిరిలో ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. pawankalyan.k786@gmail.com మెయిల్ రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నట్టు తెలిపారు.