By: ABP Desam | Updated at : 21 Jan 2022 02:45 PM (IST)
సమ్మెకు సిద్ధమైన ఏపీ ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల ఏడు లేదా ఎనిమిదో తేదీ నుంచి నిరవధికంగా సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇస్తారు. సమ్మె ప్రారంభమయ్యే వరకూ వివిధ రూపాల్లో నిరసన చేపట్టనున్నారు. ఈ నెల 23న జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాు. 25వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇక జనవరి 26వ తేదీన అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత 27 నుంచి 30వ తేదీ వరకూ నిరాహారదీక్షలు చేస్తారు. ఫిబ్రవరి మూడో తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తారు. ఏడు లేదా ఎనిమిదో తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు ,
అన్ని ఉద్యోగ సంఘాలు ఏక తాటిపైకి వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ట్రెజరీ ఉద్యోగులు కూడా ఇప్పటికే సంఘిభావం తెలిపారు. దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు ఎక్కడివక్కడ నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలు ఇక అధికారులతో కూడా చర్చలకు వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. జీవోలను రద్దు చేసిన తర్వాతే.. తదుపరి చర్చల గురించి ఆలోచిస్తామని చెబుతున్నారు.
Also Read: Warangal: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య
ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉండే ఉద్యోగ సంఘాల నేతలు కూడా సమ్మె చేయాలనే నిర్ణయానికి మద్దతు పలికారు. ఉద్యోగులంతా పీఆర్సీ వల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్న అంచనాకు వచ్చారు. పాత పీఆర్సీనే కొనసాగించాలని అడుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఏ మాత్రం పట్టు వదలడం లేదు. ప్రకటించిన పీఆర్సీనే అమలు చేయాలని పట్టుదలగా ఉంది. బిల్లలు కూడా రెడీ చేయించాలని ప్రయత్నిస్తోంది.
Garuda Seva In Tirumala: గరుడాద్రి వాసా, శ్రీ శ్రీనివాసా పాహిమాం - అంగరంగ వైభవంగా శ్రీవారికి గరుడ సేవ
Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!
Skill Development Case: సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయనున్న టీడీపీ, జైల్లో చంద్రబాబుతో చర్చలు
Nagababu Meeting: టీడీపీతో పొత్తు తర్వాత రంగంలోకి నాగబాబు, ఆ జిల్లాపై కన్నేసిన జనసేన
Sidharth Luthra : సిద్ధార్థ లూధ్రా మరో ఆసక్తికర ట్వీట్ - ఈ సారి ఏం చెప్పారంటే ?
IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!
Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో
/body>