Jagan ED Case: జగతి పబ్లికేషన్స్ ఈడీ ఛార్జ్‌షీట్‌పై విచారణ వాయిదా.. పెన్నా కేసులో డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేసిన సీఎం జగన్, విజయసాయిరెడ్డి
నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులు విచారణ జరిగింది. ఈ కేసుల్లో దర్యాప్తు పూర్తందో లేదో చెప్పాలని న్యాయస్థానం ఈడీని ప్రశ్నించింది. జగతి పబ్లికేషన్స్ ఛార్జ్ షీట్ పై విచారణ వాయిదా పడింది.
హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్, పెన్నా, ఇండియా సిమెంట్స్ ఈడీ కేసులపై దర్యాప్తు పూర్తయిందా? కొనసాగుతోందా తెలపాలని ఈడీని న్యాయస్థానం ప్రశ్నించింది. పెన్నా కేసు నుంచి తొలగించాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్లు దాఖలు చేశారు. ఇండియా సిమెంట్స్ కేసులో జగన్, విజయసాయిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ జరిగింది. డిశ్ఛార్జి పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు ఈడీ గడువు కోరింది. జగతి పబ్లికేషన్స్ ఈడీ ఛార్జ్‌షీట్‌పై విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. పెన్నా, ఇండియా సిమెంట్స్ ఈడీ కేసుల విచారణ అక్టోబరు 5కి వాయిదా పడింది.
Also Read: భారీ రిక్రూట్‌మెంట్‌కు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్... వైద్య, ఆరోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి ఆమోదం
సీబీఐ కోర్టు విచారణ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణ చేస్తుంది. పెండింగ్ లో ఉన్న పిటిషన్లపై త్వరగా ఏదో ఒకటి తేల్చాలంటూ సుప్రీంకోర్టు గడువు విధించిన నేపథ్యంలో సీబీఐ కోర్టు కేసుల పరిష్కారానికి సిద్ధమవుతోంది. సీఎం వైఎస్ జగన్ నిందితుడిగా ఉన్న పెన్నా సిమెంట్స్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ హయాంలో పెన్సా సిమెంట్స్ జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడాన్ని సీబీఐ గతంలో దాఖలు చేసిన ఛార్జిషీట్ లో తప్పుబట్టింది. ఈ కేసుల్లో జగన్ ను ఏ1గా చేర్చింది. దీనిపై జగన్ సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా సిమెంట్స్ ఛార్జిషీట్ నుంచి తన పేరు తొలగించాలని సీబీఐ కోర్టును కోరారు. అయితే దీనిపై సీబీఐ తెలిపిన వివరాల ఆధారంగా సీబీఐ కోర్టు విచారణ జరపబోతోంది.
డిశ్చార్జ్ పిటిషన్లు
ఇదే కేసులో గతంలో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా ఛార్జిషీట్ లో తన పేరు సీబీఐ చేర్చడంపై సబిత ఇంద్రారెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కౌంటర్ దాఖలుకు సీబీఐ గడువు కోరడంతో సీబీఐ కోర్టు తదుపరి విచారణను వాయిదా వేస్తూ వచ్చింది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు రాజగోపాల్, శామ్యూల్ కూడా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు.
Also Read: కృష్ణా బోర్డుకు తెలంగాణ మరో లేఖ... పిన్నపురం జలవిద్యుత్ ప్రాజెక్టు ఆపాలని వినతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి