AP HighCourt : ఆ కేసుల ఉపసంహరణ కోర్టు ధిక్కరణే - ఏపీ సర్కార్‌కు హైకోర్టు షాక్ !
ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ కోర్టు ధిక్కారమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్ని కేసులు ఉపసంహరించారో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
AP HighCourt : ప్రజాప్రతినిధులపై కేసులను అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా ఎత్తివేయడంపై హైకోర్టు ఏపీ ప్రభుత్వంపై మండిపడింది. ఇప్పటివరకు ఎన్ని కేసుల తొలగింపునకు హైకోర్టు అనుమతి తీసుకున్నారు, ఎన్ని ఉపసంహరించారన్నదానిపై అఫిడవిట్ వేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై కేసులు ఉపసంహరించుకోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీజేఎఫ్ అధ్యక్షుడు చెవులు కృష్ణాంజనేయులు పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలను న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వినిపించారు.
ప్రతి మండలంలో 2 ఇంటర్ కాలేజీలు - అమ్మఒడి కింద ల్యాప్ ట్యాప్‌లిస్తామన్న బొత్స !
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో సంబంధం లేకుండా డీజీపీ, కలెక్టర్ ఆదేశాలతో కేసులుర తొలగించారని ఇలా చేయడం చట్ట విరుద్ధమని వాదించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేసులు తొలగించాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా తొలగించారని ధర్మాసనం ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇలా కేసులు తీసేసి ఉంటే.. కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్న ధర్మాసనం స్పష్టం చేసింది.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అస్వస్థత, మొహాలీలోని ఆసుపత్రిలో చికిత్స
ఇప్పటివరకు ఎన్ని కేసుల తొలగింపునకు హైకోర్టు అనుమతి తీసుకున్నారని ప్రశ్నించింది. ఎన్ని ఉపసంహరించారన్న దానిపై అఫిడవిట్ వేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఓటర్లకు డబ్బుల పంపిణీ, అధికారులపై దాడుల కేసులు కూడా.. తొలగించారని ధర్మాసనం దృష్టికి శ్రవణ్‌కుమార్ తీసుకొచ్చారు. ప్రభుత్వం అఫిడవిట్ వేయకుంటే కేసులో ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
నడిరోడ్డుపై వందల మద్యం బాటిళ్లు ధ్వంసం, మందుబాబులకు గుండెకోత ఈ దృశ్యం
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంవ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు సొంత పార్టీ ప్రతినిధులపై అనేక కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఏ కారణాలు లేకుండానే నేరుగా డీజీపీ ఆదేశాలతో ఉపసంహరించుకున్నట్లుగా ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటిపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రజాప్రతినిధులపై కేసులే కాకుండా తుని అల్లర్ల కేసు అలాగే పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై దాడి కేసులను కూడా ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకోవడం వివాదాస్పదమయింది. ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న కేసులను కూడా ఉపసంహరించుకోవడం కూడా వివాదాస్పదమయింది. ఈ అంశంపై కూడా కోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పుడు అన్ని వివరాలను అంటే ఎన్ని కేసులను ఉపసంహరించుకున్నారన్న వివరాలను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది.