అన్వేషించండి

Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ

Boat capsized near Phu Quoc Island in Vietnam | వియత్నాంలోని ఫు కుయోక్ దీవి సమీపంలో భారత పర్యాటకులతో వెళ్తున్న బోటు బోల్తా పడింది. భారత ఎంబసీ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వియత్నాంలో భారతీయ టూరిస్టుల బోటు బోల్తా, 15 మంది మృతి.
  • లావా మొబైల్ కంపెనీ పర్యాటకులు, అలల ఉధృతితో బోటు మునిగింది.
  • బోటు పూర్తిగా తలకిందులు కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది.
  • బాధిత కుటుంబాలకు భారత ఎంబసీ రెండు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.

Indian Tourists Boat capsize | వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫు కుయోక్ దీవి సమీపంలో భారత టూరిస్టులతో వెళ్తున్న బోట్ ఒక్కసారిగా బోల్తా పడింది. హాన్ మే రుట్ నుంచి అన్ థోయ్ పోర్టుకు వస్తున్న ఈ పడవ తీరానికి కేవలం 400 మీటర్ల దూరంలో ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది వరకు భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల వారే అధికంగా ఉన్నట్లు సమాచారం. భారత్ నుంచి లావా మొబైల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లను వియత్నాం టూర్ తీసుకెళ్లగా ఈ విషాదం చోటుచేసుకుంది.

ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని ఇతర బోట్ల నిర్వాహకులు స్పందించి నిమిషాల్లోనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే, బోటు పూర్తిగా తలకిందులు కావడంతో.. చాలా మంది లోపలే ఇరుక్కుపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కొందరిని మాత్రమే స్పృహలో ఉండగా కాపాడగలిగారు. వర్షం లేకపోయినప్పటికీ, సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

2 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసిన భారత ఎంబసీ.. 

భారత రాయబార కార్యాలయం ఒకేసారి రెండు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది, హెల్ప్‌లైన్ నంబర్లను జారీ చేసింది.  ప్రభావిత కుటుంబాలకు సమాచారం, సహాయం అందించడానికి, హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్‌లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414 నెంబర్లలో సంప్రదించవచ్చు అని సూచించారు. 

హనోయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.  +84 91 308 9165 నంబర్‌లో సంప్రదించి కుటుంబసభ్యులు టూరిస్టుల సమాచారం కోసం ప్రయత్నించవచ్చు అని పేర్కొన్నారు.  ఎలాంటి సహాయం, సందేహాల కోసమైనా అందుబాటులో ఉన్నామని భారత ఎంబసీ పేర్కొంది. 

వియత్నాం టూర్ వెళ్లిన మొబైల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు

ఒక మొబైల్ కంపెనీ భారత్ నుండి 250 మంది డిస్ట్రిబ్యూటర్లు, వారి కుటుంబాలను వియత్నాం ట్రిప్‌కు తీసుకెళ్లింది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుండి 75 మంది ఉన్నారు. ట్రిప్‌లో భాగంగా 3 పడవల్లో విహరిస్తుండగా, 32 మంది భారతీయులు, నలుగురు సిబ్బందితో హాన్‌ మే రుట్‌ నుండి అన్‌థోయ్‌ పోర్టుకు బయల్దేరిన ఒక స్పీడ్‌ బోట్‌ ప్రమాదానికి గురైంది.

పడవ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫు కుయోక్ స్పెషల్ ఎకనమిక్ జోన్ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఏడాదికి లక్షలాది మంది విదేశీయులు సందర్శించే ఈ దీవిలో, విహారయాత్రకు వెళ్లిన భారతీయులు ఇలా జలసమాధి కావడం తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది.

Also Read: Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల టూరిస్టులు సహా 15 మంది మృతి!

 

Frequently Asked Questions

వియత్నాంలో భారతీయ పర్యాటకులకు ఏం జరిగింది?

వియత్నాంలోని ఫు కుయోక్ దీవి సమీపంలో భారత టూరిస్టులతో వెళ్తున్న ఒక బోట్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు?

ఈ ఘోర ప్రమాదంలో 15 మంది భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల వారే అధికంగా ఉన్నట్లు సమాచారం.

బోటు బోల్తా పడటానికి కారణం ఏమిటి?

వర్షం లేనప్పటికీ, సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బోటు పూర్తిగా తలకిందులు కావడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడింది.

ప్రభావిత కుటుంబాలు సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలి?

భారత రాయబార కార్యాలయం రెండు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ప్రభావిత కుటుంబాలు సమాచారం కోసం హో చి మిన్ సిటీ, హనోయిలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget