అన్వేషించండి

Harvest India FCRA : విదేశాలకు పిల్లల దత్తతపై దుష్ప్రచారం, నా భర్తపై కావాలనే కుట్ర చేస్తున్నారు : గుంటూరు జెడ్పీ ఛైర్ పర్సన్

Harvest India FCRA : హార్వెస్ట్ ఇండియా యాభై ఏళ్ల క్రితమే స్థాపించారని, ఈ సంస్థ ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టిందని గుంటూరు జెడ్పీ ఛైర్ పర్సన్ హెన్రీ క్రిస్టినా అన్నారు. తన భర్తపై కావాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Harvest India FCRA : హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ, తన భర్త కత్తెర సురేష్ కుమార్ పై దుష్ప్రచారం చేస్తున్నారని గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ హెన్రీ క్రిస్టినా అన్నారు. గత మూడు రోజులుగా హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థపై దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. యాభై ఏళ్ల క్రితమే హార్వెస్ట్ ఇండియా సంస్థను స్థాపించారన్నారు. పేదలకు, అస్వస్థతతో ఉన్న వారికి, అనాథ పిల్లలకు సేవ చేయడమే ఈ సంస్థ లక్ష్యమన్నారు. పదిహేను అత్యున్నత సేవా అవార్డులు కూడా ఈ సంస్థ అందుకుందని తెలిపారు. మీడియాలో కొంత మంది తన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తన భర్త కత్తెర సురేష్ కుమార్ అరెస్టు అంటూ వార్తలు రాశారన్నారు.  

మూడేళ్ల క్రితమే లైసెన్స్ రద్దు 

"నా భర్త విదేశాల్లో ఉన్నారు. కావాలనే కుట్ర చేస్తున్నారు. మూడేళ్ల క్రితమే FCRA లైసెన్స్ నిలిపి వేసింది. FCRA లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. నిబంధనలకు లోబడి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సీబీఐతో పాటు ఇతర దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తాం. చట్టాలను, న్యాయ స్థానాలను గౌరవిస్తాం. నలభై యాభై మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వారిలో నా భర్త పేరు కూడా ఉంది. ప్రభుత్వానికి తెలియకుండా విదేశాలకు చిన్న పిల్లల దత్తత  చేయడం సాధ్యం కాదు." అని గుంటూరు జెడ్పీ ఛైర్ పర్సన్ హెన్రీ క్రిస్టినా అన్నారు. 

అసలేం జరిగింది? 

గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర క్రిస్టీనా భర్త కత్తెర సురేష్ పై తీవ్రమైన అభియోగాలతో రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి విదేశాల నుంచి అక్రమంగా విరాళాలు తీసుకోవడం కాగా మరొకటి దత్తత పేరుతో మైనర్లను నిబంధనలకు విరుద్ధంగా వేరే దేశాలకు తరలించారన్నది. కత్తెర సురేష్ హర్వెస్ట్ ఇండియా సొసైటీ పేరుతో మతపరమైన సంస్థను నడుపుతున్నారు. స్వచ్చంద సంస్థగా చెబుతూ విదేశాల నుంచి విరాళాలు తీసుకొచ్చేవారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం మతపరమైన సంస్థలు విదేశాల నుంచి విరాళాలు తేవడాన్ని నియంత్రించింది. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టాన్ని కఠినతరం చేసింది. అయినప్పటికీ ఎఫ్‌సీఆర్ఏ చట్టాన్ని ఉల్లంఘించి పెద్ద ఎత్తున విదేశీ విరాళాలను కత్తెర సురేష్ సేకరించినట్లుగా ఆధారాలు బయటపడ్డాయి. దీంతో  సీబీఐ కేసు నమోదు చేసింది.  విదేశీ నిధుల స్వీక‌ర‌ణల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న అనేక మత మార్పిడి సంస్థలపై కేంద్రం కొరడా ఝళిపించింది. దేశ‌వ్యాప్తంగా 40 చోట్ల  సీబీఐ  సోదాలు జ‌రిపింది. విదేశీ విరాళాల స్వీక‌ర‌ణ‌లో నిబంధ‌న‌లు ఉల్లంఘించిన స్వచ్ఛంద సంస్థల నుంచి ముడుపులందుకున్న ఐదుగురు ప్రభుత్వ అధికారులతోపాటు 10 మందిని అరెస్ట్ చేసింది.  విదేశీ నిధుల స్వీక‌ర‌ణ‌లో విదేశీ నిధుల నియంత్రణ చ‌ట్టం ఉల్లంఘించిన వారికి క్లియ‌రెన్స్ ఇవ్వడానికి కొంద‌రు అధికారులు ముడుపులు స్వీక‌రించార‌ని సీబీఐ ప్రకటించారు. కత్తెర సురేష్ నడుపుతున్న సంస్థ కూడా ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఫండ్స్ విదేశాల నుంచి తీసుకువచ్చినట్లుగా తేలడంతో కేసు నమోదు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Sankrantiki Vastunnam Trailer: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
KTR: ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
Embed widget