Guntur News: డబ్బాలో పాముతో ఆసుపత్రికి యువకుడు... హడలెత్తిపోయిన సిబ్బంది... ఎందుకలా చేశాడో తెలుసా...
పామును డబ్బాలో పెట్టుకుని ఆసుపత్రికి వెళ్లాడో ఓ వ్యక్తి. అసలు ఆ వ్యక్తి ఎందుకలా చేశాడో తెలుసా...!
పాము కాటేస్తే మనం ఏంచేస్తాం... ఇంకేమైనా ఉందా.. లబోదిబోమని కేకలు వేస్తాం. ధైర్యం కూడగట్టుకుని ప్రథమ చికిత్స చేసుకుని వైద్యుడి దగ్గరికి పరుగులు తీస్తాం. పామును చూస్తేనే హడలిపోతాం కానీ ఈ యువకుడు చేసిన ధైర్యం అంతా ఇంతా కాదు. కాటేసిన పామును డబ్బాలో పెట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అసలు ఎందుకలా చేశాడో తెలిస్తే మీరు అవాక్కవుతారు.
గుంటూరు జిల్లాలోని నందివెలుగు గ్రామానికి చెందిన వీరాంజనేయులును అనే వ్యక్తిని విషసర్పం కాటేసింది. అతడు బతికున్న ఆ తాచుపాము డబ్బాలో పెట్టుకుని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకి వచ్చాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు.
ఆ తర్వాత పామును వదిలేస్తా...
నందివెలుగుకు చెందిన వీరాంజనేయులు ఓ సిమెంట్ రాళ్ల పరిశ్రమలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సిమెంట్ ఇటుకల లోడ్ చేసుకునేందుకు ట్రాక్టర్‌తో సహా నందివెలుగు వచ్చాడు. బ్రిక్స్‌ను ట్రాక్టర్లలో లోడు చేసేందుకు తీస్తున్నప్పుడు వీరాంజనేయులను తాచుపాము కాటేసింది. అతడు కాటేసిన తాచుపామును డబ్బాలో పెట్టి బంధించాడు. తనతో పాటు ఆ పామును వైద్యశాలకు తీసుకొచ్చాడు. పామును డబ్బాలో తీసుకురావడంతో అక్కడున్న వైద్య సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఏ పాము కాటేసిందో వైద్యులను అడిగేందుకు పామును డబ్బాలో పెట్టుకుని తీసుకువచ్చినట్టు అతడు తెలిపాడు. అయితే వీరాంజనేయులు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. తనకు వైద్యం పూర్తి అవ్వగానే పామును వదిలేస్తానని వీరాంజనేయులు తెలిపాడు.
Also Read: MLA Gorantla Unhappy : ఎమ్మెల్యే గోరంట్ల అసంతృప్తి.. టీడీపీకి రాజీనామా చేసే యోచన..!
పామును నోటితో కొరికి
పాము కనబడితేనే ఆమడదూరం పారిపోతాం. మరి అలాంటి పామును నోటితో కొరికి చంపడమంటే మాటలా...ఊహించుకుంటేనే ఏదోలా ఉంది కదా. ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం పామును పరపరా కొరికి చంపేశాడు. ఒడిశా జాజ్‌పూర్ జిల్లా దనగాడి తాలూకా గంభారిపాటియా గ్రామానికి చెందిన కిషోర్ బద్రా వ్యవసాయ పనులు పూర్తిచేసుకుని ఇంటికి వస్తున్నాడు. చీకట్లో ఓ పాముపై అడుగు వేశాడు. అది వెంటనే బద్రా కాలిపై కాటువేసింది. ఇది గమనించిన బద్రా కోపంతో పామును చేతుల్లోకి తీసుకుని నోటితో కొరికి చంపేశాడు.
Also Read: Afghanistan Taliban News: అఫ్గాన్ ప్రస్తుత పరిస్థితిపై భారత వైఖరేంటి? విదేశాంగ మంత్రి ఎమన్నారంటే..